Job Opportunities: ముంగిట్లోకే వచ్చిన ఉద్యోగ అవకాశాలు.. విస్తృతంగా జాబ్‌మేళాల నిర్వహణ!

ఐదేళ్లలో రికార్డు స్థాయిలో 13,385 మంది యువతీ, యువకులకు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని కార్పొరేట్, ఇతర కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. టీడీపీ హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో నిధులు కొల్లగొట్టారు. భారీగా నిధులు ఖర్చు చేసినా పదుల సంఖ్యలో ఉద్యోగాలు లభించిన ధాఖలాలు లేవు.
టీడీపీ హయాంలో ఆ పార్టీ నేతలు స్కిల్స్ డెవలప్‌మెంటును సొతం ఆదాయ వనరుగా వినియోగించుకుంటే.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి యువత అభ్యున్నతికి శ్రీకారంచుట్టారు. చంద్రబాబు స్కిల్స్‌పేరుతో దోనిడికి పాల్పడితే.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి యువతకు ఉఫాధి అవకాశాలు పెంచారు.
శిక్షణ.. ఉద్యోగం
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం నియోజకవర్గాల వారీగా ఎనిమిది స్కిల్స్ హబ్‌లు ఏర్పాటు చేసింది. వాటిల్లో యువతకు ఆసక్తి ఉన్న రంగాల్లో వృత్తి నైపుణ్యాలను అభివృద్ధి చేసి.. కార్పొరేట్ కంపెనీలు, ఇతర ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించింది.
స్కిల్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో ఐదేళ్లలో 6,791 మంది యువతకు ఉద్యోగాలు లభించడం విశేషం. ఒక్కో హబ్‌లో ఏడాది నాలుగు బ్యాచ్‌లను నైపుణ్యాల అభివృద్ధిపై శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు కల్పించారు.
Top Polytechnic Courses Details : పాలిటెక్నిక్‌లో ఈ కోర్సుల్లో జాయిన్ అయితే.. జాబ్ గ్యారెంటీ..!
జూనియర్ సాప్ట్‌వేర్ డెవలపర్, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, ప్లంబర్ జనరల్ తదితర వాటిల్లో నైపుణ్యాల అభివృద్ధి చేసుకున్నారు. కొందరు వృద్ధి చేసుకున్న నైపుణ్యాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా స్వయం ఉపాధిలో రాణిస్తున్నారు.
మరి కొందరు పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు పొందారు. స్కిల్ హబ్‌లో శిక్షణ పొందిన వారు దేశ వ్యాప్తంగా వివిధ కంపెనీలు, కార్పొరేట్ సంస్థల్లో రాణిస్తుండటం విశేషం. మెగా జాబ్ మేళా, మినీ జాబ్‌మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలను అందుబాటులో తీసుకు రావడం విశేషం.

స్కిల్ కాలేజీ ద్వారా 2,844 మందికి ఉద్యోగ అవకాశాలు..
డీఆర్‌డీఏ–వైకేపీ ఆధ్వర్యంలో యువతలో నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా స్కిల్ కాలేజీ నడుస్తోంది. పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున స్కిల్ కాలేజీ ఏర్పాటయ్యాయి. డీఆర్‌డీఏ–వైకేపీకి సంబంధించి కర్నూలు స్కిల్ కాలేజీ, ఎమ్మిగనూరులో ట్రెనింగ్ సెంటరు నడుస్తున్నాయి. కర్నూలు శివారులోని టీటీడీసీలో రెసిడెన్షియల్ స్కిల్ కాలేజీ నిర్వహిస్తున్నారు.
స్కిల్ కాలేజీ, స్కిల్ ట్రైనింగ్ సెంటరు, వీటికి సంబంధించిన సంస్థల ద్వారా 2019–20 నుంచి 2023–24 వరకు 3,463 మందికి నైపుణ్యాల అభివృద్ధిపై శిక్షణ ఇచ్చారు. ఇందులో 2,844 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. నిరుద్యోగ యువతకు మెడికల్‌కు సంబంధించి పేషెంట్ రిలేషన్ సర్వీస్ డ్యూటీ మేనేజర్, పేషెంట్ రిలేషన్ సర్వీస్ అసోసియేట్, సేల్స్ సూపర్‌వైజర్‌లుగా రాణించేందుకు వీలుగా స్కిల్స్‌ను వృద్ధి చేసుకునేందుకు శిక్షణ ఇస్తూ ప్లేస్‌మెంటు చూపుతుండటం విశేషం.
Job Opportunities: వివిధ సంస్థల్లో ప్లేస్మెంట్, ఇంటర్న్‌షిప్‌తో ఉద్యోగాలు..
మెరుగు పడిన ఉద్యోగ అవకాశాలు..
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెద్ద ఎత్తున జాబ్ మేళాలు నిర్వహించారు. జాబ్ మేళా కార్యక్రమాలకు కంపెనీల ప్రతినిధులే వచ్చి అర్హత, నైపుణ్యాలు కలిగిన వారిని ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తుండటం విశేషం.
జిల్లా ఉపాధి కల్పన సంస్ధ నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమాలకు 382 కంపెనీలు హాజరయ్యాయి. ఉపాధి కల్పన సంస్థ ద్వారా ఉద్యోగాలకు 4,471 మంది ఎంపికై తే 3,750 ప్లేస్‌మెంటులు లభించాయి. జాబ్ మేళా ద్వారా అర్హులైన యువతను ఎంపిక చేసుకునేందుకు పెద్ద కంపెనీలు ముందుకు వస్తున్నాయి. రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు వేతనాలతో యువత పనిచేస్తోంది.
Tags
- job opportunities
- Skill College
- Skill Development Corporation
- AP government
- skills hub
- Corporate companies
- Software Developer
- Accounts executive
- Mega Job Fair
- Mini Job Mela
- Unemplyed youth
- Sakshi Education News
- Kurnool District News
- Skill development schemes
- Youth empowerment
- Economic growth strategies
- Agriculture opportunities
- Kurnool employment
- latest jobs in 2024