Skip to main content

Central Bank of India : సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

ముంబైలోని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హ్యూమన్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌.. దేశవ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల్లో సఫాయి కర్మచారి కమ్‌ సబ్‌–స్టాఫ్‌ /సబ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Invitation for applications   Applications for posts at Central Bank of India in Mumbai  Application details for Central Bank of India

»    మొత్తం పోస్టుల సంఖ్య: 484
»    జోన్ల వారీగా ఖాళీలు: అహ్మదాబాద్‌–76, భోపాల్‌–38, ఢిల్లీ–76, కోల్‌కతా–02, లక్నో–78, ఎంఎంజెడ్‌వో–పుణె–118, పాట్నా–96.
»    అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
»    వయసు: 31.03.2024 నాటికి 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
»    పే స్కేల్‌: నెలకు రూ.19,500 నుంచి రూ.37,815.
»    ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష(70 మార్కులు), లోకల్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌(30 మార్కులు), డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంగ్లిష్‌ మీడియంలో పరీక్ష జరుగుతుంది. ఆబ్జెక్టివ్‌ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, జనరల్‌ అవేర్‌నెస్, ఎలిమెంటరీ అర్థమెటిక్, సైకోమెట్రిక్‌ టెస్ట్‌(రీజనింగ్‌) సబ్జెక్ట్‌ల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
»    ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 27.06.2024.
»    ఆన్‌లైన్‌ పరీక్ష: జూలై/ఆగస్ట్‌ 2024.
»    వెబ్‌సైట్‌: https://centralbankofindia.co.in

Apprentice Posts at MDSL : ఎండీఎస్‌ఎల్‌లో వివిధ అప్రెంటీస్ పోస్టుల్లో ఉద్యోగావ‌కాశం.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Published date : 26 Jun 2024 02:54PM

Photo Stories