Skip to main content

Felicitation to a Girl Child : 6 ఏళ్ల వయస్సులోనే హాఫిజా కోర్సును పూర్తి చేసిన చిన్నారికి ఘ‌న స‌న్మానం..

Felicitation for a girl child as she completes hafiza course being six year old

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: జిల్లా కేంద్రం షాసాబ్‌గుట్టకు చెందిన మహ్మద్‌ హైదర్‌అలీ మనుమరాలు సయ్యదా షారిష్‌ ముబీన్‌ పవిత్ర ఖురాన్‌ను కంఠస్థం చేసి హాఫిజా కోర్సు పూర్తి చేశారు. తల్లి జరీష్‌ తబస్సుం కూడా హాఫిజా ఆలిమా కోర్సు చేయడంతో కూతురిని కూడా ఈ కోర్సు చేయడానికి ప్రోత్సహించారు. దీంతో చిన్నారి ముబీన్‌ నాలుగన్నరేళ్లలో పవిత్ర ఖురాన్‌ను కంఠస్తం చేసి ప్రారంభించి తన 6 ఏళ్ల వయస్సులో హాఫిజా కోర్సు పూర్తి చేయడం విశేషం.

AP PGECET Rankers : పీజీఈసెట్‌లో జేఎన్‌టీయూఏ విద్యార్థుల స‌త్తా..!

ఘనంగా సన్మానం

హాఫిజా కోర్సు పూర్తి చేసిన చిన్నారి సయ్యదా షారిష్‌ ముబీన్‌ను రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఘనంగా సన్మానం చేశారు. శాలువాలతో సత్కరించారు. చిన్నవయస్సులో ఖురాన్‌ను కంఠస్థం చేసి హాఫిజా అవడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో హాఫీజ్‌సలీం, హైదర్‌అలీ, అజ్మత్‌అలీ, వాజిద్‌ తదితరులు పాల్గొన్నారు.

Directorate of Enforcement: ఉచిత విద్య పేరిట విదేశాల నుంచి అక్రమంగా కోట్లు వసూలు

Published date : 27 Jun 2024 09:35AM

Photo Stories