Top Polytechnic Courses Details : పాలిటెక్నిక్‌లో ఈ కోర్సుల్లో జాయిన్ అయితే.. జాబ్ గ్యారెంటీ..!
పదో తరగతి తర్వాత విద్యార్థుల ముందున్న మరో మంచి ప్రత్యామ్నాయం.. పాలిటెక్నిక్. ఎందుకంటే.. మూడేళ్ల పాలిటెక్నిక్ కోర్సు పూర్తిచేశాక.. ఇండస్ట్రీలో వెంటనే ఉద్యోగం సంపాదించుకోవచ్చు. ఉన్నత విద్య కావాలంటే.. అందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేసుకుంటూనే సంపాదించుకునే వెసులుబాటు ఉండటం పాలిటెక్నిక్ కోర్సుల మరో ప్రత్యేకత. నేడు పాలిటెక్నిక్ అభ్యర్థులకు కార్పొరేట్ సంస్థలు ఎర్రతివాచీ పరుస్తున్నాయి.
భారీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఖాయం..
ప్రారంభంలో ఏడాదికి రూ 1.5 నుంచి 2 లక్షల ప్యాకేజీతో సంస్థలు ఉద్యోగాలిస్తున్నాయి. ఐటీ బూమ్ ఉన్నా, లేకున్నా.. పాలిటెక్నిక్ చదివినవారికి భారీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఖాయం అన్నది నిపుణుల అభిప్రాయం. మరోవైపు తక్కువ ఖర్చుతో సాంకేతిక విద్యను అందించే కోర్సులివి. దాంతో పాలిటెక్నిక్ కోర్సుల వైపు మొగ్గుచూపేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
శిక్షణ :
పాలిటెక్నిక్ కోర్సుల్లో ఐదో సెమిస్టర్‌లో ఆరునెలలు విద్యార్థి తప్పనిసరిగా పరిశ్రమలో శిక్షణ పొందాలనే నిబంధనను తాజాగా అమల్లోకి తెచ్చారు. తద్వారా విద్యార్థికి ప్రాక్టికల్ నాలెడ్‌జతోపాటు అనుభవం కూడా వస్తుంది.
☛ AP POLYCET 2024 College Predictor | Cut-off Ranks: Check Expected Colleges for Your Rank
పాలిటెక్నిక్ కోర్సులు ఇవే..
సివిల్ ఇంజనీరింగ్, కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ, ఆర్కిటెక్చరల్ అస్టిస్టెంట్‌షిప్, మెకానికల్ ఇంజనీరింగ్, మెకానికల్ (సాండ్‌విచ్), ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్‌ట్రుమెంటేషన్, స్పెషల్ డిప్లొమా కోర్సెస్ ఇన్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైనింగ్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, టెక్స్‌టైల్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్(షుగర్ టెక్నాలజీ), కెమికల్ ఇంజనీరింగ్(ఆయిల్ టెక్నాలజీ), కెమికల్ ఇంజనీరింగ్(పెట్రోకెమికల్స్), కెమికల్ ఇంజనీరింగ్(ప్లాస్టిక్స్ అండ్ పాలి మర్స్), సిరామిక్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ, ఫుట్‌వేర్ టెక్నాలజీ, ప్రింటింగ్ టెక్నాలజీ తదితర కోర్సుల్లో 3ఏళ్లు, మూడున్నరేళ్ల డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సీప్‌లో ర్యాంక్ ద్వారా వీటిల్లో చేరొచ్చు.
పాలిటెక్నిక్ వల్ల ప్రయోజనాలు ఎన్నో..
తక్కువ ఖర్చుతో ఇంజనీరింగ్‌కు మార్గం సుగమం. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు పూర్తయ్యాక ఈసెట్ రాసి.. నేరుగా ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో చేరొచ్చు. పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రాక్టికల్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి ఈ కోర్సులను పూర్తిచేసిన విద్యార్థులు కంపెనీల్లో చేరాక త్వరగా షైన్ అవుతారు. పాలిటెక్నిక్‌లో చదివే సబ్జెక్టులే ఇంజనీరింగ్‌లో కూడా ఉంటాయి. కాబట్టి పాలిటెక్నిక్ తర్వాత ఇంజనీరింగ్ చేస్తే చాలా సులువుగా సబ్జెక్ట్‌పై పట్టు వస్తుంది. ఏఎంఐఈ, గ్రేడ్ ఐఈటీఈ, ఏఐఐసీఈఆర్‌ఏఎం, ఏఐఐఎం, ఐఐసీఈ వంటి బీఈ/బీటెక్‌తో సమానమైన కోర్సుల్లోకి రిజిస్టర్ చేసుకొని ఉద్యోగం చేసుకుంటూనే ఇంజనీరింగ్ పూర్తిచేసుకోవచ్చు.
Also Read: 20 Best Polytechnic Colleges in Andhra Pradesh
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కంటే కూడా పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తిచేసిన వారికి కంపెనీలు అధిక ప్రాధ్యానం ఇస్తున్నాయి. ఎందుకంటే.. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు తరచూ కంపెనీలు మారుతుంటారు. అదే పాలిటెక్నిక్ అభ్యర్థులను రిక్రూట్ చేసుకుంటే నిలకడగా పనిచేస్తారు.
గ్రామీణ, మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో..
పాలిటెక్నిక్ కోర్సులు.. గ్రామీణ, మధ్యతరగతి విద్యార్థులకు మంచి అవకాశం. తక్కువ ఖర్చుతో ఇంజనీరింగ్ వైపు అడుగులు వేసేందుకు వీలుకల్పించే అద్భుత అవకాశం ఇది. రాష్టంలోని పాలిటెక్నిక్‌లను ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు, ప్రయివేట్ పాలిటెక్నిక్ కాలేజీలు, మహిళా పాలిటెక్నిక్ కళాశాలలు అని మూడు రకాలుగా పేర్కొనవచ్చు. మహిళా పాలిటెక్నిక్ కళాశాలల్లో మహిళల స్వయం ఉపాధికి ఉపయోగపడే కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
పాలిటెక్నిక్ ఏ కోర్సుకు క్రేజ్ అంటే..?
ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిప్లొమాకు క్రేజ్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే.. ఈ బ్రాంచ్‌లో డిప్లొమా చేసి, అవసరమైన కంప్యూటర్ కోర్సులు చేస్తే ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. దాంతోపాటు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ కోర్సులు ఎవర్ గ్రీన్‌గా పేరు సాధించాయి. వీటిని పూర్తి చేస్తే జాబ్ గ్యారెంటీ అనే అభిప్రాయం ఉంది.
After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భవిష్యత్ ఉంటుంది..?
డిప్లొమా పూర్తి చేసిన వారు స్వయంగా..
మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ వంటి విభాగాల్లో డిప్లొమా పూర్తి చేసిన వారు స్వయం ఉపాధి ద్వారా కూడా స్థిరపడొచ్చు. కంప్యూటర్స్ చేసిన వారు ఇంటర్నెట్ కేఫ్ ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా హార్డ్‌వేర్ స్పేర్స్ సంబంధిత వ్యాపారం చేసుకోవచ్చు. మెకానికల్ డిప్లొమా పూర్తిచేసినవారు టూవీలర్, ఫోర్ వీలర్ మెకానిక్ రంగంలో కూడా దిగవచ్చు. ప్యాకేజింగ్, ప్రింటింగ్ యూనిట్లు స్థాపించుకోవచ్చు. ఇందుకు ఆర్థిక సంస్థల సహకారం కూడా పొందవచ్చు.
కెరీర్ స్కోప్ ఇలా..
డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ :
కాల వ్యవధి : మూడేళ్లు
ఉద్యోగాలెక్కడ : ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్, పబ్లిక్ హెల్త్ డిపా ర్ట్‌మెంట్,రహదారులు, భవనాలు,రైల్వేస్, సర్వే, డ్రాయిం గ్, వాటర్ సప్లైయ్, ప్రభుత్వ, ప్రయివేట్ రంగ విభా గాలుకాంట్రాక్టర్‌గా, డ్రాఫ్ట్స్‌మెన్‌గా.. స్వయం ఉపాధి.
కంపెనీలు : డీఎల్‌ఎఫ్, యూనిటెక్, జైపీ అసోసియేట్స్, మైటాస్, జీఎంఆర్ ఇన్ఫ్రా, పుంజ్‌లాయిడ్, ల్యాంక్ ఇన్ఫ్రా.
కెరీర్: సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా అభ్యర్థుల కెరీర్ సైట్ ఇంజనీర్‌గా మొదలై.. ఇంజనీర్లు, సీనియర్ ఇంజనీర్లు, మేనేజర్లుగా పనిచేసి కంపెనీ జనరల్ మేనేజర్ స్థాయి వరకూ ఎదగొచ్చు.
డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ :
కాల వ్యవధి: మూడేళ్లు
ఉద్యోగాలెక్కడ : ఏయిర్, డీడీ, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రా నిక్స్ ఇండస్ట్రీస్,రేడియో, టీవీ సర్వీసింగ్‌లో స్వయం ఉపాది,సేల్స్, సర్వీస్‌లో సెల్ఫ్‌ఎంప్లాయిమెంట్.
కంపెనీలు : భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఐడియా సెల్యులార్, టాటా
కమ్యూనికేషన్స్, బీఎస్‌ఎన్‌ఎల్..:
కెరీర్: ట్రైనీ ఇంజనీర్‌గా మొదలై.. స్కిల్స్‌తో సర్వీస్ ఇంజనీర్, టెస్ట్ ఇంజనీర్, ప్రొడక్ట్ ఇంజనీర్, సీనియర్ ప్రొడక్ట్ డవలప్‌మెంట్ ఇంజనీర్, డిపార్ట్‌మెంట్ మేనేజర్ స్థాయికి ఎదగొచ్చు.
డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ :
కాల వ్యవధి: మూడేళ్లు
ఉద్యోగాలెక్కడ: కంప్యూటర్ మెయిన్‌టెనెన్స్, సాఫ్ట్‌వేర్ డవలప్‌మెంట్, కంప్యూటర్ ట్రైనింగ్, కంప్యూటర్స్ సేల్స్ అండ్ సర్వీసింగ్‌లో స్వయం ఉపాధి.
కంపెనీలు: ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, పొలారీస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వంటి టాప్ కంపెనీలతోపాటు ఇతర సాప్ట్‌వేర్ డవలప్‌మెంట్, ట్రైనింగ్ సంస్థల్లో జాబ్స్ లభిస్తాయి.
కెరీర్ : జూనియర్ ప్రోగ్రామర్‌తో మొదలై సాఫ్ట్‌వేర్ ప్రోగ్రా మర్, సీనియర్ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్ స్థాయికి చేరుకోవచ్చు.
డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్..:
కాల వ్యవధి : మూడేళ్లు
ఉద్యోగాలెక్కడ : ఏపీ జెన్‌కో, ఏపీ ట్రాన్స్‌కో, డీసీఎల్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్, డిపార్ట్‌మెంట్స్, ఇండస్ట్రీస్‌లో మెయిన్‌టెనెన్స్ స్టాఫ్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్‌లు, వైరింగ్ కన్సల్టెన్సీ వైండర్‌లుగా స్వయం ఉపాధి.
కంపెనీలు: సీమెన్స్, సుజ్లాన్, ఎల్ అండ్ టీ, ఎన్‌టీపీసీ, టాటా పవర్, ఎన్‌హెచ్‌పీసీ, నెవైలీ లిగ్నైట్.
కెరీర్: జూనియర్ ఇంజనీర్ ట్రైనీగా మొదలై.. అనుభవంతో సూపర్ వైజర్, ఇంజనీర్, ఎక్జిక్యూటివ్ ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్, అసిస్టెంట్ మేనేజర్, జనరల్ మేనేజర్ స్థాయికి చేరుకోవచ్చు.
డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ :
కాల వ్యవధి : మూడేళ్లు
ఉద్యోగాలెక్కడ : ప్రభుత్వ రంగ సంస్థలుప్రభుత్వ, ప్రయి వేట్ విభాగాలు మెషినరీ, ట్రాన్స్‌పోర్టు, ప్రొడక్షన్, సేల్స్‌కు సంబంధించిన వర్క్‌షాపులు, గ్యారేజీలు, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో సేల్స్,మెకానికల్ ఇంజనీరింగ్ అనుబంధ విభాగాల్లో స్వయం ఉపాధి.
కంపెనీలు : ఓల్టాస్, ఏసీసీ లిమిటెడ్, బీఓఎస్ సీహెచ్, హిం దుస్థాన్ యూనిలెవెల్ లిమిటెడ్, మారుతి సుజుకి, ఇన్ఫోటెక్.
కెరీర్: పారిశ్రామిక రంగం బాగా అభివృద్ధి చెందడంతో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి డిమాండ్ బాగా పెరిగింది. ఈ విభాగంలో డిప్లొమా అభ్యర్థి ట్రైనీగా చేరి... 7-8 ఏళ్లలో స్కిల్స్, ఉన్నత విద్యతో అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ స్థాయికి ఎదగొచ్చు.
డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్..:
కాల వ్యవధి : మూడేళ్లు
ఉద్యోగాలెక్కడ : ఏపీఎస్‌ఆర్‌టీసీ,ఆటోమొబైల్ కంపెనీల షోరూంలకు సంబంధించిన ట్రాన్స్‌పోర్టు విభాగాలు, ఆటోమొబైల్స్ సర్వీసింగ్‌లో స్వయం ఉపాధి.
కంపెనీలు: సుజ్కీ, టయోటా, టాటా, ఫియాట్, హోండా, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్, ఎల్‌ఎంఎల్, యమ హా వంటి ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు..
కెరీర్: సర్వీస్ ఇంజనీర్ ట్రైనీగా మొదలై స్కిల్స్, హార్డ్‌వర్క్, ఉన్నత విద్యతో సర్వీస్ ఇంజనీర్, డిప్యూటీ సర్వీస్ ఇంజనీర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్ స్థాయికి ఎదగొచ్చు.
డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్..:
కాల వ్యవధి: మూడేళ్లు
ఉద్యోగాలెక్కడ: మైన్స్(ఓపెన్‌కాస్ట్, అండర్‌గ్రౌండ్), ఎస్.సి.సి.ఎల్, ఎన్.ఎం.డి.సి
కంపెనీలు: సింగరేణి కాలరీస్, ఎన్‌ఎండీసీ, ఇండియన్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్, ఎస్సెల్ మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.
డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ..:
కాల వ్యవధి: మూడేళ్లు
ఉద్యోగాలెక్కడ: అన్ని సాఫ్ట్‌వేర్ డవలప్‌మెంట్ యూనిట్లలో..
కంపెనీ: ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, పొలారీస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కెరీర్: జూనియర్ ప్రోగ్రామర్‌గా చేరి స్కిల్స్‌తో ప్రోగ్రామర్, సీనియర్ ప్రోగ్రామర్ స్థాయికి ఎదగొచ్చు.
డిప్లొమా ఇన్ టెక్స్‌టైల్ టెక్నాలజీ..:
కాల వ్యవధి: మూడున్నరే ళ్లు
ఉద్యోగాలెక్కడ: టెక్స్‌టైల్ మిల్స్,క్లాత్ ఎక్స్‌పోర్టు ఇండస్ట్రీస్.
కంపెనీలు: విమల్, రేమండ్స్, అరవింద్ మిల్స్, బాంబే డయింగ్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, లక్ష్మీ మిల్స్.
కెరీర్: ప్రాసెస్ ఇంజనీర్, టెక్నికల్, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్, సూపర్ వైజర్, ప్రొడక్షన్ కంట్రోల్ విభాగాల్లో కెరీర్‌ను ఎంచుకొని ఉన్నత స్థాయికి ఎదగొచ్చు.
డిప్లొమా ఇన్ సిరామిక్ టెక్నాలజీ..:
కాల వ్యవధి: మూడున్నరేళ్లు
ఉద్యోగాలెక్కడ: రిఫ్రాక్టరీ, బ్రిక్ క్లిన్స్, సిమెంట్,గ్లాస్ అండ్ సిరామిక్ అండ్ శానిటరీవేర్ ఇండస్ట్రీస్.
కంపెనీలు: ఏసీసీ లిమిటెడ్, గుజరాత్ అంబుజా సిమెంట్, అల్ట్రాటెక్, ఇండియా సిమెంట్స్ లిమిటెడ్.
కెరీర్: అభ్యర్థి సిరామిక్ టెక్నాలజీ, సిరామిక్ డిజైనర్స్ ఫీల్డ్‌లను ఎంచుకోవచ్చు. వీటిల్లో జూనియర్ ఇంజనీర్‌గా మొదలై.. ప్రాసెస్ ఇంజనీర్, సీనియర్ సిరామిక్ ప్రాసెస్ ఇంజనీర్ స్థాయికి ఎదగొచ్చు.
గ్రామీణ, పేద, మధ్యతరగతి విద్యార్థులకు పాలిటెక్నిక్ పూర్తైతే త్వరగా ఉద్యోగం వస్తుంది. అలాగే కుటుంబానికి ఆసరా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ పాలిటెక్నిక్ వల్ల స్వయంగా ఉపాధి కూడా పొందవచ్చు. అలాగే వీరు కూడా నలుగురికి ఉపాధి మార్గం కూడా చూపించవచ్చును.
చదవండి: Best Career Options After 10th: పది తర్వాత.. కెరీర్ ప్లానింగ్!
Tags
- Polytechnic Courses
- best polytechnic courses for govt jobs
- Best Polytechnic Courses After 10th Class
- Top Polytechnic Colleges
- Polytechnic
- polytechnic courses list after 10th
- best polytechnic courses after 10th in telugu
- advantages of polytechnic courses
- advantages of polytechnic courses news telugu
- advantages of polytechnic courses details
- polytechnic advantages and disadvantages in telugu
- polytechnic courses duration
- polytechnic courses duration news in telugu
- polytechnic subjects
- polytechnic subjects details in telugu
- polytechnic student salary
- polytechnic student salary details in telugu
- polytechnic highest salary per month
- polytechnic highest salary per month details in telugu
- polytechnic mechanical course news in telugu
- polytechnic mechanical course details
- polytechnic cse course details in telugu
- polytechnic electrical course details in telugu
- polytechnic course details in telugu
- polytechnic course based jobs
- Best Polytechnic Courses details in telugu
- polytechnic jobs government
- which course is best in polytechnic
- Diploma in Mechanical Engineering
- Diploma in Mechanical Engineering details in telugu
- Diploma in Civil Engineering
- Diploma in Civil Engineering details in telugu
- Diploma in Electrical Engineering
- Diploma in Electrical Engineering in telugu
- Diploma in Mining Engineering
- Diploma in Mining Engineering details in telugu
- Diploma in Biomedical Engineering
- Diploma in Biomedical Engineering details in telugu
- top 10 polytechnic courses details in telugu
- Career Guidance
- Andhra Pradesh education
- Polyset-2024 results
- Polytechnic career paths
- Diploma in engineering opportunities
- Engineering technician jobs
- sakshieducation updates