Skip to main content

CIPET | ఐటీఐ, డిప్లొమా అర్హ‌త‌తో ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగం.. పూర్తి వివ‌రాలు ఇవే

కేంద్ర ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖకు చెందిన చెన్నైలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సీ-పెట్) దేశవ్యాప్తంగా ఉన్న పలు సిపెట్‌ కేంద్రాల్లో.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 38 సూపర్‌వైజరీ, నాన్‌ సూపర్‌వైజరీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
CIPET Recruitment 2023
CIPET Recruitment 2023

చ‌ద‌వండి: ప‌ది, ఐటీఐ అర్హ‌త‌తో శ్రీహ‌రికోట‌లో ఉద్యోగాలు.. వేత‌నం 45 వేలు...

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

ఖాళీలు : 38
అసిస్టెంట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ (స్కిల్‌ డెవలప్‌మెంట్‌/ ప్రాసెసింగ్‌/ టెస్టింగ్‌/ డిజైన్‌/ టూల్‌రూమ్‌/ క్యాడ్‌/క్యామ్‌ - 10 పోస్టులు ఉన్నాయి.  

అసిస్టెంట్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌ అండ్‌ ఏ)-1 పోస్టు. దీన్ని ఎస్సీలకు కేటాయించారు.

టెక్నికల్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-3 (టూల్‌రూమ్‌/ టెస్టింగ్‌/ ప్రాసెసింగ్‌/ డిజైన్‌ (క్యాడ్‌-క్యామ్‌-సీఏఈ) - 20 పోస్టులు. 

Cipet

అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌ 3 - 3 పోస్టులు 5) అకౌంట్స్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌ 3 - 4 పోస్టులు ఉన్నాయి. ఈ రెండు పోస్టులూ నాన్‌-టెక్నికల్‌ గ్రూప్‌-సి విభాగానికి చెందినవి.
 
సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ పాసవడంతోపాటు అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు లేదు.

చ‌ద‌వండి: మే అంతా ప‌రీక్షా కాలం.. 7 పరీక్షలు ఈ నెల‌లోనే... రూల్స్ మార్చేసిన టీఎస్‌పీఎస్‌సీ

అర్హతలు:
అసిస్టెంట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ (స్కిల్‌ డెవలప్‌మెంట్‌/ ప్రాసెసింగ్‌/ టెస్టింగ్‌/ డిజైన్‌/ టూల్‌రూమ్‌/ క్యాడ్‌/క్యామ్‌ పోస్టుకు మెకానికల్‌/ కెమికల్‌/ పాలిమర్‌ టెక్నాలజీలో బీఈ/ బీటెక్‌ ఫస్ట్‌క్లాస్‌లో పాసవ్వాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి. లేదా ఎంఎస్సీ పాలిమర్‌ సైన్స్‌ ఫస్ట్‌క్లాస్‌లో పాసై.. మూడేళ్ల అనుభవం ఉండాలి. 

అసిస్టెంట్‌ ఆఫీసర్‌ (ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌) పోస్టుకు బీకామ్‌, ఎంబీయే (ఫైనాన్స్‌) ఫస్ట్‌క్లాస్‌లో పాసవ్వాలి/ ఎంకామ్‌ ఫస్ట్‌క్లాస్‌లో పాసై మూడేళ్ల అనుభవం ఉండాలి. గవర్నమెంట్‌ ఫైనాన్షియల్‌ రూల్స్‌, బడ్జెట్‌, కాస్ట్‌ అకౌంటింగ్‌, బుక్‌ కీపింగ్‌, ఫైనాన్షియల్‌ బడ్జెట్స్‌, అకౌంట్స్‌ ఫైనలైజేషన్‌, ఫండ్స్‌ మేనేజ్‌మెంట్‌, ట్యాలీ/ఎంఐఎస్‌/ఈఆర్‌పీ నైపుణ్యాలు ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.

చ‌ద‌వండి: ప‌ది, డిప్లొమా అర్హ‌త‌తో ఇస్రోలో ఉద్యోగాలు... పూర్తి వివ‌రాలు ఇవే

టెక్నికల్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-3 (టూల్‌ రూమ్‌/ టెస్టింగ్‌/ ప్రాసెసింగ్‌/డిజైన్‌ పోస్టుకు క్యాడ్‌/క్యామ్‌తో మెకానికల్‌/ డీపీఎంటీ/ డీపీటీ/ పీజీడీపీటీక్యూసీ/ పీజీడీపీపీటీ/ పీడీపీఎండీ డిప్లొమా పాసై.. సంవత్సరం అనుభవం ఉండాలి. లేదా ఐటీఐ (ఫిట్టర్‌/ టర్నర్‌/ మెషినిస్ట్‌) పాసై రెండేళ్ల అనుభవం ఉండాలి.

CIPET

అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-3 పోస్టుకు గ్రాడ్యుయేషన్‌ 52 శాతం మార్కులతో పాసవ్వాలి. ఆఫీసు నిర్వహణలో రెండేళ్ల అనుభవం ఉండాలి. ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 పదాలు, హిందీలో 30 పదాలు టైప్‌ చేయగలగాలి. కంప్యూటర్‌ ఆపరేషన్స్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, నోటింగ్‌, డ్రాఫ్టింగ్‌ నైపుణ్యం ఉండాలి.

అకౌంట్స్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-3 పోస్టుకు బీకామ్‌ ఫస్ట్‌క్లాస్‌లో పాసై..ట్యాలీ నాలెడ్జ్‌ ఉండి, రెండేళ్ల అనుభవం ఉండాలి. డైరెక్ట్‌ అండ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సేషన్‌, గవర్నమెంట్‌ పర్చేస్‌ ప్రొసీజర్స్‌, పీఎఫ్‌ఎంఎస్‌ సాఫ్ట్‌వేర్‌ నాలెడ్జ్‌ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. అన్ని పోస్టులకూ గరిష్ట వయసు 32 సంవత్సరాలు. రిజ‌ర్వేష‌న్ ఉన్న వారికి వయసులో సడలింపు ఉంటుంది.

చ‌ద‌వండి: ప‌ది, ఇంట‌ర్ అర్హ‌త‌తో ఎన్‌సీఈఆర్‌టీలో ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే

ఎంపికైన అభ్యర్థులను ఏడాదిపాటు ట్రెయినీగా నియమిస్తారు. ఆ తర్వాత రెండేళ్ల ప్రొబేషన్‌ ఉంటుంది. దరఖాస్తుకు విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన సర్టిఫికెట్లను జతపరచి..

CIPET

డైరెక్టర్‌ (అడ్మినిస్ట్రేషన్‌), సిపెట్‌ హెడ్‌ ఆఫీస్‌, టి.వి.కె. ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌, గిండీ, చెన్నై- 600 032 అనే చిరునామాకు రిజిస్టర్డ్‌/స్పీడ్‌ పోస్టులో పంపించాలి. 

గ‌మ‌నిక‌: ఎన్వలప్‌పైన పోస్టు పేరు, అడ్వర్‌టైజ్‌మెంట్‌ నంబర్‌, తేదీలను స్పష్టంగా రాయాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 29.05.2023

ఇత‌ర వివ‌రాల‌కు http://www.cipet.gov.in/ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

Published date : 03 May 2023 03:10PM
PDF

Photo Stories