Free Employment Training: NTPCలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, భోజనం, వసతి, ఉపాధి.. ఇలా రిజిస్టర్ చేసుకోండి
Sakshi Education
భారత ప్రభుత్వ సంస్థ (సీఐపీఈటీ), ఎన్టీపీసీ సింహాద్రి (విజయవాడ) సౌజన్యంతో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనతో కూడిన ఉచిత శిక్షణ అందిస్తున్నట్టు సీఐపీఈటీ జాయింట్ డైరెక్టర్, హెడ్ సీహెచ్.శేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఎన్టీపీసీ సింహాద్రి ప్రాజెక్ట్ ప్రభావిత గ్రామాల్లో స్థానికత ఉండి, 10వ తరగతి పాసై 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు గల 60 మందికి విజయవాడ పోలిమెర్స్ టెక్నాలజీలో 6 నెలల నైపుణ్యాభివృద్ధి శిక్షణతో పాటు సర్టిఫికెట్ అందించనున్నట్టు తెలిపారు.
విశాఖపట్నం, అనంతపురం, హైదరాబాద్, బెంగుళూరు, హోసూర్, చైన్నె ప్రాంతాల్లో ప్రముఖ ప్లాస్టిక్స్, అనుబంధ సంస్థలలో ఉద్యోగాలు కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి సదుపాయాలతో పాటు నెలకు రూ.3 వేలు స్టైఫండ్ ఇస్తామన్నారు. ఆసక్తి గల యువత సీఐపీఈటీ ప్రతినిధి బాణావత్ అంజి నాయక్‌ని 7893586494 నంబర్‌లో సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
Free Coaching: NEET & JEE విద్యార్థులకు ఈ ప్రభుత్వం వరం!!
Published date : 10 Jan 2024 09:08AM