Skip to main content

ISRO Jobs: ప‌ది, డిప్లొమా అర్హ‌త‌తో ఇస్రోలో ఉద్యోగాలు... పూర్తి వివ‌రాలు ఇవే

ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) ఆధ్వర్యంలోని ఇస్రో ప్రొపల్షన్‌ కాంప్లెక్స్‌ (మహేంద్రగిరి)లో రాకెట్‌ ప్రయోగానికి అవసరమయ్యే వివిధ పరికరాలనూ ఇక్కడ తయారుచేస్తారు. ఈ సంస్థ తాజాగా వివిధ పోస్టులకు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. పదోతరగతి/డిప్లొమా/ ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులైన వారు అర్హులు. 24.04.2023 నాటికి అభ్యర్థుల వయసు 18-35 సంవత్సరాలు ఉండాలి.
ISRO
ISRO

ఫైర్‌మ్యాన్‌ ‘ఎ’ పోస్టుకు 25 సంవత్సరాలు మించి ఉండ‌కూడ‌దు. రిజ‌ర్వేష‌న్ల ఆధారంగా గరిష్ట‌ వయసులో మినహాయింపు ఉంటుంది. ఇది కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) విధానంలో ఉంటుంది. అభ్యర్థుల తుది ఎంపికను రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే నిర్ణయిస్తారు
ఖాళీల వివ‌రాలు:
టెక్నికల్‌ అసిస్టెంట్‌ (మెకానికల్‌)-15, టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌)-4, టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ఎలక్ట్రికల్‌)-1, టెక్నికల్‌ అసిస్టెంట్‌ (కంప్యూటర్‌ సైన్స్‌)-1, టెక్నికల్‌ అసిస్టెంట్‌ (సివిల్‌)-3, టెక్నీషియన్‌ ‘బి’ (ఫిట్టర్‌)-20, టెక్నీషియన్‌ ‘బి’ (ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌)-3, టెక్నీషియన్‌ ‘బి’ (వెల్డర్‌)-3, టెక్నీషియన్‌ ‘బి’ (రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఏసీ)-1, టెక్నీషియన్‌ ‘బి’ (ఎలక్ట్రీషియన్‌)-2, టెక్నీషియన్‌ ‘బి’ (ప్లంబర్‌)-1, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ ‘బి’ (సివిల్‌)-1 హెవీ వెహికల్‌ ఢ్రైవర్‌-ఎ-5, లైట్‌ వెహికల్‌ ఢ్రైవర్‌ ‘ఎ’-2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఫైర్‌మ్యాన్‌: ఫైర్‌మ్యాన్‌-ఎ పోస్టుకు దరఖాస్తు చేసే అభ్య‌ర్థులు ప్రిలిమినరీ మెడికల్‌ ఎగ్జామినేషన్‌ (పీఎంఈ) సర్టిఫికెట్‌ను కూడా అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. జనరల్‌ కేటగిరీకి చెందిన పురుష అభ్యర్థులు 165 సెం.మీ.ఎత్తు, 50 కేజీల బరువు ఉండాలి. ఛాతీ చుట్టుకొలత 81 సెం.మీ., గాలి పీల్చినప్పుడు 86 సెం.మీ ఉండాలి. మహిళలు 155 సెం.మీ. ఎత్తు, 43 కేజీల బరువు ఉండాలి. దీన్ని కంప్యూట‌ర్ బేస్డ్‌గా నిర్వ‌హిస్తారు. 

చ‌ద‌వండి: ఏ ఒక్క విద్యార్థి బ‌డికి దూర‌మ‌వ్వ‌కూడ‌దు: సీఎం జ‌గ‌న్‌
మినిమం 50 మార్కులు రావాలి
టెక్నికల్‌ అసిస్టెంట్‌/టెక్నీషియన్‌ ‘బి’/ డ్రాఫ్ట్స్‌ మ్యాన్‌ ‘బి’ పోస్టులకు రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఉంటాయి. హెవీ వెహకల్‌ డ్రైవర్‌ ‘ఎ’/ లైట్‌ వెహికల్‌ డ్రైవర్‌ ‘ఎ’ పోస్టులకు రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ (డ్రైవింగ్‌ టెస్ట్‌) ఉంటాయి. ఫైర్‌మ్యాన్‌ ‘ఎ’ పోస్టుకు రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ (ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌, మెడికల్‌  ఎగ్జామినేషన్‌) ఉంటాయి. స్కిల్ టెస్ట్‌కు అకడమిక్‌ సిలబస్‌ ఆధారంగా 100 మార్కులకు ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. ప‌రీక్ష‌లో మినిమం 50 మార్కులు రావాలి.  
- హెవీ వెహికల్‌ డ్రైవర్‌ ‘ఎ’, లైట్‌ వెహికల్‌ డ్రైవర్‌ ‘ఎ’ పోస్టులకు స్కిల్‌ టెస్ట్‌లో భాగంగా డ్రైవింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. దీంట్లో 100 మార్కులకు 60 మార్కులు సాధించాలి.  

చ‌ద‌వండి: ఇక‌పై వాట్సాప్‌లో స‌చివాల‌యాల సేవ‌లు... ఏపీలో మ‌రో విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యం
- ఫైర్‌మ్యాన్‌ ‘ఎ’ పోస్టుకు స్కిల్‌ టెస్ట్‌ కింద ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇది రెండు దశల్లో జరుగుతుంది. తొలి దశలో పాసైనవారిని రెండో దశకు ఎంపికచేస్తారు. దీంట్లో విజయం సాధించినవారిని వైద్య పరీక్షలకు పిలుస్తారు. ఈ రెండు దశల్లోనూ తప్పనిసరిగా అర్హత సాధించాలి. 
దరఖాస్తు ఫీజు: టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు రూ.750. టెక్నీషియన్‌ ‘బి’/డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ ‘బి’/ ఫైర్‌మ్యాన్‌ ‘ఎ’/ లైట్‌ వెహికల్‌ డ్రైవర్‌ ‘ఎ’/ హెవీ వెహికల్‌ డ్రైవర్‌ ‘ఎ’ పోస్టులకు రూ.500. 
- అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజును ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి.

Published date : 10 Apr 2023 07:47PM

Photo Stories