CM Ys Jagan: ఏ ఒక్క విద్యార్థి బడికి దూరమవ్వకూడదు: సీఎం జగన్
చదవండి: ఇకపై వాట్సాప్‌లో సచివాలయాల సేవలు... ఏపీలో మరో విప్లవాత్మక నిర్ణయం
1998 డీఎస్సీ అభ్యర్థులకు శిక్షణా తరగతులు
పాఠశాలలు ప్రారంభంనాటికే పాఠ్యపుస్తకాలు రెడీగా ఉండాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. మే 15వ తేదీ నాటికి సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే టీచర్లలో నైపుణ్యాలు మెరుగుపర్చేందుకు రెండేళ్ల కోర్సును అందుబాటులోకి తెస్తున్నామని అధికారులు సీఎంకు చెప్పగా.. ఈ ప్రతిపాదనకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో
మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో నైపుణ్యాలు పెంపొందించేలా వచ్చే రెండేళ్లపాటు సర్టిఫికెట్ కోర్సును కొనసాగిస్తామన్నారు. అలాగే 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఈ వేసవిలో శిక్షణా తరగతులు ఏర్పాటు చేయాలని సూచించారు.
చదవండి: ఇకపై 24 గంటలూ షాప్‌లు తెరుచుకోవచ్చు.. ఈ నిబంధనలు పాటించాల్సిందే
సీబీఎస్‌ఈ అఫిలియేషన్ పూర్తి చేయాలి
పిల్లల సంఖ్యకు తగ్గట్లు టీచర్లను ఏర్పాటు చేయాలని జగన్ ఆదేశించారు. అలాగే జూన్ నాటికి తరగతి గదుల్లో ఐఎఫ్‌పీలు ఏర్పాటు చేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు సీఎంకు వెల్లడించారు. అలాగే విద్యార్థులకు టోఫెల్ సర్టిఫికెట్ పరీక్షలపైనా సీఎం సమీక్షించారు. విద్యార్థులకు పంపిణీ చేసిన ట్యాబ్‌లను వారు ఎలా వినియోగిస్తున్నారో తెలుసుకోవాలని సూచించారు. పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగాలని సీఎం ఆదేశించారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలకు సీబీఎస్‌ఈ అఫిలియేషన్ పూర్తి చేయాలన్నారు. చివరగా ప్రభుత్వ పాఠశాలల్లో రెండో దశ నాడు – నేడు కింద జరుగుతున్న పనులపై సమీక్షించి... ప్రాధాన్యతా క్రమంలో పనులు చేసుకుంటూ వెళ్లాలని ఆదేశించారు.