Job Mela For Freshers: ఈనెల 13న జాబ్‌మేళా.. పూర్తి వివరాల కోసం క్లిక్‌చేయండి
Sakshi Education
కడప ఎడ్యుకేషన్ : కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాలలో జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల 13న గురువారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రవీంద్రనాథ్ తెలిపారు. ఐటీఐ ఫిట్టర్, ఇంటర్, డిగ్రీ, బిటెక్, మాస్టర్ డిగ్రీతోపాటు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు 9347256400, 9390052901 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Job Mela For Freshers
ముఖ్య సమాచారం: ఎప్పుడు: ఫిబ్రవరి 13న ఎక్కడ:, బాయ్స్ జూనియర్ కళాశాల, కడప