ISRO SHAR Recruitment 2023: పది, ఐటీఐ అర్హతతో శ్రీహరికోటలో ఉద్యోగాలు.. వేతనం 45 వేలు... ఇలా అప్లై చేసుకోండి

టెక్నీషియన్ అసిస్టెంట్ ఖాళీలు: 12
విభాగాలు: సినిమాటోగ్రఫీ/ ఫొటోగ్రఫీ, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్.
లైబ్రరీ అసిస్టెంట్-ఎ ఖాళీలు: 2
సైంటిఫిక్ అసిస్టెంట్ ఖాళీలు: 6
టెక్నీషియన్-బి/ డ్రాఫ్ట్స్‌మ్యాన్-బి ఖాళీలు: 74
చదవండి: పది, డిప్లొమా అర్హతతో ఇస్రోలో ఉద్యోగాలు... పూర్తి వివరాలు ఇవే
మొత్తం పోస్టులు: 94
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ/ ఎన్‌టీసీ/ ఎన్‌ఏసీ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి (16-05-2023 నాటికి): 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం: నెలకు టెక్నికల్ అసిస్టెంట్/ సైంటిఫిక్ అసిస్టెంట్/ లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులకు రూ.44,900-రూ.1,42,400; టెక్నీషియన్/ డ్రాఫ్ట్స్‌మ్యాన్ పోస్టులకు రూ.21,700-69,100.
చదవండి: ఇకపై వాట్సాప్‌లో సచివాలయాల సేవలు... ఏపీలో మరో విప్లవాత్మక నిర్ణయం
దరఖాస్తు ఫీజు: రూ.600, రూ.1000.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్
పరీక్ష కేంద్రాలు: గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 16.05.2023.
వివరాలకు https://www.isro.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.