Skip to main content

Central Petrochemicals Engineering and Technology: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనతో కూడిన ఉచిత శిక్షణ

గుంటూరుఎడ్యుకేషన్‌: విజయవాడ లోని కేంద్ర పెట్రో కెమికల్స్‌ ఇంజి నీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సీపెట్‌) లో ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనతో కూడిన ఉచిత శిక్షణ కల్పిస్తున్నట్లు సంస్థ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సీహెచ్‌ శేఖర్‌ గురువారం ఓప్రకటనలో తెలిపారు.
కేంద్ర పెట్రో కెమికల్స్‌ ఇంజి నీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సీపెట్‌
కేంద్ర పెట్రో కెమికల్స్‌ ఇంజి నీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సీపెట్‌

నేషనల్‌ ఎస్సీ, ఎస్టీ హబ్‌ పథకం ద్వారా మంది అభ్యర్థులకు మెషీన్‌ ఆపరేటర్‌ ప్లాస్టిక్స్‌ ప్రాసెసింగ్‌ కోర్సులో ఆర్నెల్లపాటు ఉచిత శిక్షణ కల్పించి, సర్టిఫికెట్‌తో పాటు అనంతపురం, హైదరాబాద్‌, బెంగళూరు, హోసూరు, చైన్నె ప్రాంతాల్లోని ప్లాస్టి క్‌, అనుబంధ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఈ శిక్షణ ద్వారా వ్యవస్థాపకులుగా సై తం అవకాశాలను అందిపుచ్చుకోవచ్చునని పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి సదుపాయాలను కల్పిస్తామని, ఆసక్తి గల అభ్యర్థులు టెన్త్‌ ఉత్తీర్ణతతో పాటు 18 ఏళ్ల వయసు నిండి ఉండా లని సూచించారు. వివరాలకు తమ ప్రతినిధి అంజినాయక్‌ను 7893586494 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

Also read: Internet in AP Govt Schools #sakshieducation

Published date : 04 Aug 2023 04:19PM

Photo Stories