Skip to main content

Free Skill Development Training: సీపెట్‌లో ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ

Dr. CH Shekhar Announces Free Training Initiative,Free skill development training at CIPET, Free Training for OBC and ST Youth

గుంటూరు ఎడ్యుకేషన్‌: విజయవాడలోని కేంద్ర పెట్రో కెమికల్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సీపెట్‌) లో ఓబీసీ, ఎస్స్టీ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనతో కూడిన ఉచిత శిక్షణ కల్పిస్తున్నట్లు సంస్థ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సీహెచ్‌ శేఖర్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థికాభివృద్ధి సంస్థ (ఎన్‌బీసీఎఫ్‌డీసీ), జాతీయ షెడ్యూల్డ్‌ కులాల ఆర్థికాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ) సంయుక్తంగా టెన్త్‌లో ఉత్తీర్ణులైన 18 నుంచి 35 ఏళ్ల లోపు వయపు కలిగిన నిరుద్యోగ యువతకు పాలిమర్స్‌ టెక్నాలజీలో మెషీన్‌ ఆపరేటర్‌–ప్లాస్టిక్స్‌ ప్రాసెసింగ్‌, మెషీన్‌ ఆపరేటర్‌ అసిస్టెంట్‌–ప్లాస్టిక్‌ ప్రాసెసింగ్‌ కోర్సులో 3–6 నెలల పాటు ఉచిత శిక్షణ కల్పించి, అనంతపురం, హైదరాబాద్‌ బెంగుళూరు, హోసూరు, చైన్నె తదితర ప్రాంతాల్లోని ప్రముఖ ప్లాస్టిక్‌, అనుబంధ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలిపారు. శిక్షణా కాలంలో ఉచిత భోజన, వసతి సదుపాయాలు, ట్రైనింగ్‌ కిట్‌, యూనిఫాం, సేఫ్టీ షూస్‌ను సీపెట్‌ అందజేస్తుందని వివరించారు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హతలు, ఆదాయ, సామాజిక వర్గ ధ్రువపత్రాలతో పాటు ఆధార్‌, రేషన్‌కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌ కాపీలు, నాలుగు పాస్‌పోర్ట్‌ సైజు ఫోటోలతో తమ ప్రతినిధి బాణావతు అంజినాయక్‌ను 7893586494 నంబర్లో సంప్రదించాలని తెలిపారు.

Published date : 22 Sep 2023 10:24AM

Photo Stories