Skip to main content

PUC Admissions Counselling : పీయూసీ మొద‌టి ఏడాదిలో ప్ర‌వేశానికి కౌన్సెలింగ్.. ఈ విధంగా..!

ఆర్‌జీయూకేటీలో ప్రీ యూనివ‌ర్సిటీ కోర్సులో ప్ర‌వేశం పొందేందుకు కౌన్సెలింగ్ నిర్వాహ‌ణ పూర్తి అయ్యింది. నూజివీడులో నిర్వ‌హించే కౌన్సెలింగ్ విధానం..
Counselling for admissions in Pre University Course at RGUKT

ఎచ్చెర్ల క్యాంపస్‌: శ్రీకాకుళం రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్‌జీయూకేటీ) ప్రీ యూనివర్సిటీ కోర్సు (పీయూసీ) మొదటి ఏడాది ప్రవేశాల కౌన్సెలింగ్‌కు ఎస్‌ఎంపురం క్యాంపస్‌లో ఏర్పాట్లు పూర్తి చేశారు. 10వ తరగతి మార్కులు, రిజర్వేషన్‌ రోస్టర్‌, ప్రత్యేక కేటగిరీల ఆధారంగా ఈ నెల 11న మెరిట్‌ లిస్ట్‌ విడుదల చేశారు. 1100 సీట్లకు 1110 మందితో మెరిట్‌ లిస్ట్‌ విడుదల చేశారు. ప్రత్యేక కేటగిరీలకు సంబంధించి నూజివీడులో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు.

BRICS Youth Summit: వారెవ్వా.. బ్రిక్స్‌ యూత్ సదస్సులో పాల్గొన్న ఏౖకైక తెలుగమ్మాయి ఈమెనే..

● శ్రీకాకుళం క్యాంపస్‌లో 1036 మంది విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తారు.

● శుక్రవారం 515, శనివారం 521 మంది ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తారు.

● రెండు రోజులు ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తయ్యాక గైర్హాజరైన విద్యార్థులకు మళ్లీ రిజస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తారు.

● పూర్తిగా హాజరు కాని విద్యార్థుల స్థానంలో మెరిట్‌ ఆధారంగా లిస్టు ప్రకటించి ప్రవేశాలు కల్పిస్తారు.

● క్యాంపస్‌లో 15 కౌంటర్లు ధ్రువీకరణ పత్రాల పరిశీలన కోసం ఏర్పాటు చేశారు.

Reserve Bank of India Jobs: రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

● క్యాంపస్‌లో విద్యార్థులు, తల్లిదండ్రులు కౌన్సెలింగ్‌ కేంద్రాలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం కల్పించారు.

● దరఖాస్తు సమయంలో విద్యార్థులు అప్‌లోడ్‌ చేసిన ధ్రువీకరణ పత్రాలతో కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.

● బీసీ, ఓసీ విద్యార్థులు రూ.4200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.3700 కౌన్సెలింగ్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

● ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించని విద్యార్థులు రూ.45,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

● పూర్తిగా రెసిడెన్సియల్‌ విధానంలో విద్యాబోధన సాగుతుంది.

Paris Olympics: ఒలింపిక్స్‌లో పాల్గొనే హైదరాబాద్‌ అమ్మాయిలు వీరే..

● సీటు లభించిన విద్యార్థులకు వసతి గృహాల్లో గదులు కేటాయిస్తారు.

● షెడ్యూల్‌ మేరకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు డైరెక్టర్‌ కేవీజీడీ బాలాజీ, ఏఓ ముని రామకృష్ణ చెప్పారు.

● ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు కౌన్సెలింగ్‌ కొనసాగుతుందని తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

Degree 2nd Semester Results : డిగ్రీ రెండో సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌ల ఫ‌లితాలు విడుద‌ల‌.. రీవాల్యువేష‌న్‌కు ద‌ర‌ఖాస్తులు..

Published date : 26 Jul 2024 04:52PM

Photo Stories