Degree 2nd Semester Results : డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదల.. రీవాల్యువేషన్‌కు దరఖాస్తులు..
ఏఎన్‌యూ (గుంటూరు): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఏప్రిల్‌లో నిర్వహించిన డిగ్రీ కోర్సుల 2వ సెమిస్టర్ ఫలితాలను గురువారం ఇన్‌చార్జి వైస్ చాన్సలర్ ఆచార్య కె.గంగాధరరావు విడుదల చేశారు. ఈ పరీక్షలకు 9,792 మంది హాజరు కాగా వారిలో 5,670 మంది ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అదనపు పరీక్షల నియంత్రణ అధికారి రెడ్డి ప్రకాశరావు మాట్లాడుతూ డిగ్రీ పరీక్షల ఫలితాలను యూనివర్సిటీ వైబ్సెట్ www.anu.ac.inలో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. ఫలితాలకు సంబంధించి రీవాల్యుయేషన్‌కు ఆగస్టు 8వ తేదీలోగా ఒక్కో పేపర్ కు రూ.1,240 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
ITI Second Counselling: రేపు రెండో విడత ఐటీఐ కౌన్సెలింగ్.. ఈ సర్టిఫికేట్స్ తప్పనిసరి
పర్సనల్ వెరిఫికేషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ.1260 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తులు చేసుకున్న వారు ఆయా కళాశాల ప్రిన్సిపాల్ ద్వారా వర్సిటీ డిగ్రీ పరీక్షల కో–ఆర్డినేటర్ కార్యాలయానికి పంపాలని సూచించారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో ఇన్‌చార్జి రెక్టార్ ఆచార్య కె.రత్నషీలామణి, ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. సింహాచలం డిగ్రీ పరీక్షల కోఆర్డినేటర్ ఆచార్య సంధ్య కోలే, సీటీఏ ప్రొఫెసర్ సత్యనారాయణ, రీసెర్చ్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ సుధాకర్, డాక్టర్ భవిత, డాక్టర్ మాధవి పాల్గొన్నారు.
Govt Primary School : ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోనే..!