TSPSC: మే అంతా పరీక్షా కాలం.. 7 పరీక్షలు ఈ నెలలోనే... రూల్స్ మార్చేసిన టీఎస్పీఎస్సీ
పేపర్ లీకేజీ ఘటనతో టీఎన్‌పీఎస్‌సీ పరువు పోయింది. దాదాపు ఇప్పటివరకు నిర్వహించిన పోటీ పరీక్షలన్నింటినీ రద్దు చేసింది. మళ్లీ కొత్త షెడ్యూల్ ప్రకటించింది. ఈ సారి ఎలాంటి తప్పులు చోటుచేసుకోకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఇప్పటికే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నెల 8 నుంచి 22 వరకు నిర్వహించనున్న పరీక్షలకు కసరత్తు ప్రారంభించింది.
టీఎస్‌పీఎస్సీ ఇప్పటివరకు 17,285 ఉద్యోగాలకు 26 నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇందుకు సంబంధించి ఏడు నోటిఫికేషన్ల పరీక్షలు నిర్వహించింది. అయితే, మార్చిలో ప్రశ్న పత్రాల లీకేజీ ఘటన బయటికి రావడంతో ఆ తర్వాత నిర్వహించనున్న పరీక్షలను వాయిదా వేసింది. గ్రూప్-1 ప్రిలిమినరీతోపాటు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ), డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్(డీఏవో), అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) పరీక్షలను రద్దు చేసేసింది.
ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నలను లాక్ చేశారు. అయితే లీకేజీ తో పరువు పోవడంతో ఆ ప్రశ్నలన్నింటిని మార్చేశారు. ఇకనుంచి జరుగబోయే ప్రతి పరీక్షకు కొత్తగా మళ్లీ ప్రశ్నలను టీఎన్‌పీఎస్‌సీ సిద్ధం చేస్తోంది. గతంలో పనిచేసిన సబ్జెక్ట్ నిపుణులను కూడా మార్చేసింది. ఎవరెవరు పనిచేస్తున్నారు? ఎంతమంది ఉన్నారు? ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు? వంటి విషయాల్లో గోప్యత పాటిస్తోంది.
☛ చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
లీకేజీ ఘటనతో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఇకపై పరీక్షలన్నీ సీబీఆర్‌టీ(కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్) పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు 50 వేల మంది అభ్యర్థుల వరకే ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించే వెసులుబాటు ఉంది. అంత కంటే ఎక్కువ మంది దరఖాస్తు చేస్తే షిఫ్టుల వారీగా పరీక్ష నిర్వహించాల్సి వస్తోంది.
అలాగే మళ్లీ ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా పరీక్షల విభాగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పరీక్షల విభాగం కో ఆర్డినేషన్ బాధ్యతను ఐఏఎస్ అధికారి సంతోష్‌కి తెలంగాణ ప్రభుత్వం అప్పగించింది. మే నుంచి జరిగే పరీక్షలన్నీ ఇకపై విభాగమే కో ఆర్డినేట్ చేయనుంది.
పరీక్షల తేదీలు ఇవే...
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించనున్న ఫారెస్ట్ అసిస్టెంట్ కన్జర్వేటర్(Assistant Conservator of Forest 2022) పోస్టులకు సంబంధించి మే 3న పరీక్ష నిర్వహించనున్నారు.
చదవండి: Top Current Affairs: అమెరికాలో మరో బ్యాంకు మూత
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించనున్న అగ్రికల్చర్ ఆఫీసర్(Agriculture Officer 2023 Rescheduled) పోస్టులకు 16వ తేదీ పరీక్ష జరగనుంది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించనున్న టెక్నికల్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ ఎగ్జామ్ 15, 16వ తేదీల్లో నిర్వహించనున్నారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించనున్న లైబ్రేరియన్ పరీక్ష 17వ తేదీ జరగనుంది.
చదవండి: పది, ఇంటర్ అర్హతతో ఎన్‌సీఈఆర్‌టీలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించనున్న ఫిజికల్ డైరెక్టర్(పీడీ) ఎగ్జామ్ మే 17వ తేదీ జరగనుంది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించనున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పరీక్ష 21, 22వ తేదీల్లో జరగనుంది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించనున్న అగ్రికల్చర్ ఆఫీసర్(Agriculture Officer (Advt No. 27/2022)) పరీక్ష 24వ తేదీ నిర్వహించనున్నారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించనున్న లెక్చరర్ ఎగ్జామ్ 13వ తేదీ జరగనుంది.