IIT Goa: ఐఐటీ గోవాలో 17 నాన్‌టీచింగ్ పోస్టులు
గోవాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ).. నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 17
పోస్టుల వివరాలు: డిప్యూటీ రిజిస్ట్రార్–02, అసిస్టెంట్ రిజిస్ట్రార్–03, స్పోర్ట్స్ ఆఫీసర్–01, సీనియర్ సూపరింటెండెంట్–03, జూనియర్ సూపరింటెండెంట్–02, జూనియర్ అసిస్టెంట్–03,అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్–01,జూనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సూపరింటెండెంట్–02.
అర్హత: పోస్టుల్ని అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ నైపుణ్యాలు, సంబంధిత పని అనుభవం ఉండాలి.
వయసు: పోస్టును అనుసరించి 27 నుంచి 50ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.21,700 నుంచి రూ.78,800 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 26.09.2021
వెబ్‌సైట్: https://iitgoa.ac.in
Qualification | GRADUATE |
Last Date | September 26,2021 |
Experience | Fresher job |