CSIR-UGC NET 2023: సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ డిసెంబర్ 2022/జూన్ 2023కు నోటిఫికేషన్ విడుదల
సబ్జెక్ట్‌లు: పరీక్ష ను ఐదు సబ్జెక్టుల్లో నిర్వహిస్తారు. కెమికల్ సైన్సెస్, ఎర్త్, అట్మాస్పియరిక్, ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమేటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్.
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఎమ్మెసీ తత్సమాన ఉత్తీర్ణులు/నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఎస్‌ఎంఎస్/బీఈ/బీటెక్/బీఫార్మసీ/ఎంబీబీఎస్ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీ(ఎన్‌సీఎల్), ఎస్సీ, ఎస్టీ, థర్డ్‌జెండర్, దివ్యాంగ అభ్యర్థులు అర్హత పరీక్షలో కనీసం 50 శాతం మార్కులు పొందాలి.
వయసు: జేఆర్‌ఎఫ్‌కు అర్హతకు సంబంధించి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 01.07.2022 నాటికి 28 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎస్సీ/ఎస్టీ /దివ్యాంగులు /మహిళ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ(నాన్‌క్రిమిలేయర్)లకు మూడేళ్ల గరిష్ట వయసు సడలింపు లభిస్తుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్/లెక్చరర్‌షిప్‌కు ఎలాంటి గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.
పరీక్ష విధానం: పరీక్ష 200 మార్కులకు నిర్వహిస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్ష జరుగుతుంది. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల పద్ధతిలో పరీక్ష ఉంటుంది. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ప్రశ్నపత్రంలో మొత్తం మూడు విభాగాలు ఉంటాయి.
ముఖ్యసమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- ఫీజు చెల్లింపు,ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 10.04.2023.
- దరఖాస్తు సవరణ తేదీలు: 12.04.2023 నుంచి 18.04.2023 వరకు.
- పరీక్ష తేదీలు: 6.06.2023, 7.06.2023, 8.06.2023.
- వెబ్‌సైట్: https://csirnet.nta.nic.in/
చదవండి: IIPE Recruitment 2023: ఐఐపీఈ, విశాఖపట్నంలో ఫ్యాకల్టీ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | April 18,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |