Teacher Jobs: సెంట్రల్ రైల్వే, భుస్వాల్ డివిజన్‌లో టీచర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
సెంట్రల్ రైల్వేలో భాగంగా ఉన్న భుస్వాల్ రైల్వే డివిజన్.. ఒప్పంద ప్రాతిపదికన టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 22
పోస్టుల వివరాలు: పీజీటీ-05, టీజీటీ-08, పీఆర్‌టీ-09.
విభాగాలు: కెమిస్ట్రీ, ఇంగ్లిష్, హిందీ, మ్యాథ్స్, ఎకనామిక్స్,మ్యూజిక్, సైన్స్,ఆర్ట్స్ తదితరాలు.
అర్హత
పీజీటీ: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈడీ/ఎమ్మెస్సీ/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.27,500 వరకు చెల్లిస్తారు.
టీజీటీ: సంబంధిత స్పెషలైజేషన్‌లో టీచింగ్ గ్రాడ్యుయేషన్, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా/బీఈడీ/బీఈఐఈడీ/బీఏ/బీఎస్సీ/బీఏఈడీ ఉత్తీర్ణులవ్వాలి. టెట్ అర్హత సాధించాలి.
జీతం: నెలకు రూ.26,250 వరకు చెల్లిస్తారు.
పీఆర్‌టీ: సెకండరీ స్కూల్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, డిప్లొమా/బీఏ/బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. టెట్ అర్హత సాధించాలి.
జీతం: నెలకు రూ.21,250 వరకు చెల్లిస్తారు.
వయసు: 18 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఇంటర్వ్యూకు నేరుగా సంబంధిత ఒరిజనల్ డాక్యుమెంట్స్‌తో
హాజరవ్వాలి.
ఇంటర్వ్యూ తేది: 04.10.2022
ఇంటర్వ్యూ వేదిక: డీఆర్‌ఎమ్ కార్యాలయం, భుస్వాల్.
వెబ్‌సైట్: https://cr.indianrailways.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | October 04,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |