Skip to main content

AECS Recruitment 2022: ఏఈసీఎస్, హైదరాబాద్‌లో టీచర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

AECS Hyderabad

హైదరాబాద్‌లోని అటామిక్‌ ఎనర్జీ సెంట్రల్‌ స్కూల్‌(ఏఈసీఎస్‌).. తాత్కాలిక ప్రాతిపదికన టీచర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు(టీజీటీ): 
సబ్జెక్టులు: ఇంగ్లిష్, సోషల్‌ సైన్స్, హిందీ/సంస్కృతం, మ్యాథ్స్‌/ఫిజిక్స్, బయాలజీ/కెమిస్ట్రీ, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్, ఆర్ట్‌. 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌తోపాటు బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకి రూ.26,250 చెల్లిస్తారు.

ప్రైమరీ టీచర్లు: 
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌తోపాటు డిప్లొమా(నర్సరీ టీచర్స్‌ ఎడ్యుకేషన్‌) ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి. 
జీతం: నెలకి రూ.21,250 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రిన్సిపల్‌ కోఆర్డినేషన్, అటామిక్‌ ఎనర్జీ సెంట్రల్‌ స్కూల్‌–2, డీఏఈ కాలనీ, ఈసీఐఎల్‌ పోస్ట్, హైదరాబాద్‌–500062 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 11.02.2022

వెబ్‌సైట్‌: https://nfc.gov.in
 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date February 11,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories