Apprentice Jobs: 28న అప్రెంటీస్ మేళా
Sakshi Education
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఈనెల 28న అప్రెంటీస్ మేళా నిర్వహిస్తున్నట్లు డీఐఈఓ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు 2021, 2023 విద్యాసంవత్సరాల మధ్య వివిధ వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన వారు తమ సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో మేళాకు రావాలని, రాష్ట్రవ్యాప్తంగా వివిధ కంపెనీలు, ఆస్పత్రులకు సంబంధించిన ప్రతినిధులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉదయం 10గంటలకు మేళా ప్రారంభమవుతుందని తెలిపారు.
Govt Jobs: జూనియర్ కాలేజీల్లో 73 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ..
Published date : 26 Jul 2023 03:26PM