Skip to main content

Amma Adarsh ​​School Committee: పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న పాఠశాలల్లో విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే మౌలిక వసతులు కల్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ బోనగిరి శ్రీనివాస్‌ అన్నారు.
Infrastructure should be provided in schools

మే 16న‌ నగరపాలక సంస్థ కార్యాలయంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. నగరపాలకసంస్థ పరిధిలో 70 ప్రభుత్వ, ఎంపీపీ, జెడ్పీ తదితర పాఠశాలలున్నాయని తెలిపారు. ఈ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడానికి ప్రభుత్వం సమాఖ్య అధ్యక్షులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులతో అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేసిందన్నారు.

చదవండి: Summer Camp: విద్యార్థుల ప్ర‌తిభ‌కు అభినంద‌న‌లు..!

ఈ కమిటీల ద్వారా ఆయా పాఠశాలల్లో విద్యుత్‌, రంగులు వేయడం, సులభ్‌కాంప్లెక్స్‌ల నిర్మాణం తదితర మౌలిక వసతులు కల్పించాలన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభం కానున్నందున పదిహేను రోజుల్లోగా ఈ పనులు పూర్తి చేయాలన్నారు.

ఇప్పటికే 25 శాతం నిధులు సంబంధిత సమాఖ్య అధ్యక్షులు, హెచ్‌ఎంల జాయింట్‌ ఖాతాలో పడ్డాయన్నారు. త్వరితగతంగా పనులు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ జనార్దన్‌రావు, స్పెషల్‌ ఆఫీసర్‌, డీడబ్ల్యూఓ సరస్వతి, ఎంఈఓ మధుసూదన్‌ తదితరులు పాల్గొన్నారు.

చదవండి: Text Books: ముందుగానే పాఠ్యపుస్తకాలు పంపిణీ

Published date : 17 May 2024 04:28PM

Photo Stories