Skip to main content

Text Books: ముందుగానే పాఠ్యపుస్తకాలు పంపిణీ

ఆసిఫాబాద్‌ అర్బన్‌: ప్రభుత్వ పాఠశాలల్లోని వి ద్యార్థులకు ఏటా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పా ఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తోంది.
Advance distribution of textbooks

2024– 25 విద్యా సంవత్సరానికి సంబంధించిన పుస్తకాలను పాఠశాలల పునఃప్రారంభం సమయంలోనే అందించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విడతల వారీగా జిల్లాలకు అవసరమైన పుస్తకాలు పంపిణీ చేస్తోంది. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాకు మొదటివిడతగా వచ్చిన పు స్తకాలను జిల్లా కేంద్రంలోని గోదాంలో భద్రపరిచారు.

చదవండి: School Students: బడులు తెరిచే నాటికే విద్యార్థుల పాఠ్య‌పుస్త‌కాలు, యూనిఫార్మ్..

ఆలస్యమైతే ఒత్తిడి

కొన్నేళ్లుగా సకాలంలో పాఠ్యపుస్తకాలు రాకపోవడం, వచ్చినవి కూడా విద్యార్థులకు సరిపోకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా సమయంలో కూడా పుస్తకాలు అందించడంలో తీవ్ర జాప్యం జరిగింది. పుస్తకాలు సకాలంలో అందకపోతే చిన్నారులతోపాటు సిలబస్‌ పూర్తి చేయాలనే ఒత్తిడి టీచర్లపైనా ఉంటుంది.

పాఠశాలల పునఃప్రారంభం రోజే అన్ని తరగతుల టెక్స్‌బుక్స్‌ అందిస్తే ఉపయోగం ఉంటుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. దీంతో 2024– 25 విద్యా సంవత్సరానికి సంబంధించి పుస్తకాల పంపిణీ ప్రక్రియను మే నెలలోనే ప్రారంభించారు.

జూన్‌లో బడులు తెరుకునే నాటిని పూర్తిస్థాయిలో అందించేందుకు ప్రణాళికలు రూపొందించారు. జిల్లాకు చేరుకున్న పుస్తకాలను ఆసిఫాబాద్‌ పట్టణంలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌లోని గోదాంలో భద్రపరుస్తున్నారు. మరోవైపు విద్యార్థులకు స్కూల్‌ యూనిఫాం కుట్టు బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించిన విషయం తెలిసిందే. యూనిఫాంలను సైతం విద్యార్థులకు సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

చదవండి: New School Textbooks: కొత్త పాఠ్యపుస్తకాలు వచ్చాయ్‌..తెలుగు, ఇంగ్లిష్‌లో పుస్తకాల ముద్రణ

4.78 లక్షల పుస్తకాలు అవసరం

జిల్లా ప్రభుత్వం అన్ని యాజమాన్యాల కింద పని చేస్తున్న పాఠశాలలు మొత్తం 1076 ఉన్నాయి. ఇందులో పదో తరగతి వరకు దాదాపు 64,141 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఏప్రిల్‌ 24 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించగా.. జూన్‌ 13న బడులు పునఃప్రారంభమవుతాయి.

విద్యా సంవత్సరం ప్రారంభమైతే కొత్త అడ్మిషన్లతో విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా జిల్లాకు మొత్తం 4,78,076 పాఠ్యపుస్తకాలు అవసరమవుతాయని జిల్లా విద్యాశాఖ అధికారులు నివేదికలు సమర్పించారు.

ప్రస్తుతానికి మొదటి విడతగా 1,57,760 పుస్తకాలు, 70 వేల నోట్‌బుక్స్‌ జిల్లాకు చేరుకున్నాయి. 50 శాతానికి పైగా పుస్తకాలు జిల్లాకు చేరుకున్న తర్వాత డీఈవో ఆదేశాలతో ఎమ్మార్సీ కార్యాలయాలకు తరలిస్తారు. అక్కడి నుంచి మండలాల్లో పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులు తీసుకెళ్లాల్సి ఉంటుంది.

కాగా.. ప్రతీ పాఠ్యపుస్తకంలో పార్ట్‌ 1, 2 అని రెండు భాగాలుగా ముద్రిస్తున్నారు. ఓ వైపు ఇంగ్లిష్‌, మరోవైపు తెలుగు మీడియంలో పాఠ్యాంశాలు ఉండేలా పుస్తకాలు ముద్రించారు.

గోదాంలో భద్రపరుస్తున్నాం

జిల్లాకు 1,57,760 పుస్తకాలతోపాటు 70వేల నోట్‌బుక్స్‌ చేరుకున్నాయి. వీటిని జిల్లా కేంద్రంలోని గోదాంలో భద్రపరుస్తున్నాం. ప్రస్తుతానికి పార్ట్‌– 1 పుస్తకాలు రాగా.. పార్ట్‌– 2కు సంబంధించినవి సెప్టెంబర్‌లో వస్తాయి. గోదాం నుంచి మండలాలకు, అక్కడి నుంచి పాఠశాలలకు సరఫరా చేస్తాం. విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు అందితే వారిపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. విద్యార్థులకు బడుల పునఃప్రారంభం రోజు పుస్తకాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. పుస్తకాలు పక్కదారి పట్టకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం.

– రాథోడ్‌ ప్రకాశ్‌, టెక్స్‌బుక్స్‌ మేనేజర్‌ ఆసిఫాబాద్‌

Published date : 15 May 2024 03:19PM

Photo Stories