Skip to main content

SCCL Jobs: Singareni ఎక్స్‌టర్నల్‌ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ.. చివ‌రి తేదీ ఇదే..

సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థలో ఉద్యోగాల(ఎక్స్‌టర్నల్‌) భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ విడుదల చేయగా దరఖాస్తులకు మే 15న‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌ అందుబాలోకి వచ్చింది.
Singareni External Posts applications

ఈ మేరకు అభ్యర్థులు జూన్‌ 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా, ఈ ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి ఆన్‌లైన్‌ పక్రియ గత నెల 15వ తేదీనే ప్రారంభమవుతుందని తొలుత చెప్పినా నెల తర్వాత మొదలైంది.

ఇందులో రెండు రకాల ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌ పోస్టులు 327 ఉన్నాయి. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు www. scclmines. com వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

చదవండి: SCCL: ఉచితంగా వేసవి శిక్షణ శిబిరాలు

మొదటి నోటిఫికేషన్‌ పరీక్షలు జూన్‌లో..

సింగరేణి యాజమాన్యం ఎక్స్‌టర్నల్‌ పోస్టుల భర్తీ కోసం మొదటి దఫా విడుదల చేసిన నోటిఫికేషన్‌లో రాతపరీక్షలు జూన్‌ చివరివారంలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

ఇందులో 16 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు, 256 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు ఉండగా, ఈ ఉద్యోగాల భర్తీకి సింగరేణి సంస్థ తొలిసారిగా ఆన్‌లైన్‌లో నిర్వహించడానికి సిద్ధమవుతోంది. గతంలో జరిగిన పరీక్షల్లో పలు అవకతవకలు జరిగిన నేపథ్యాన ఈసారి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.

చదవండి: Singareni Job Notification: పరీక్షలు తెలుగులో నిర్వహించాలి

దళారులను నమ్మకండి..

సింగరేణి సంస్థలో చాలాకాలం తర్వాత రెండు నోటిఫికేషన్లు విడుదలైన నేపథ్యాన ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సీఎండీ బలరామ్‌ ఒక ప్రకటనలో సూచించారు.

రోజుకు సుమారు పది గంటలు కష్టపడి చదివితే ఉద్యోగం వచ్చే అవకాశముందని చెప్పారు. అయితే, అభ్యర్థులు స్వశక్తిని నమ్ముకోవాలి తప్ప దళారులను ఆశ్రయించి మోసపోవద్దని ఆయన హితవు పలికారు.
 

Published date : 17 May 2024 05:13PM

Photo Stories