Skip to main content

TS Adarsha Vidyalaya Admissions: ‘ఆదర్శ’లో ప్రవేశాలుకు దరఖాస్తులు స్వీకరణ‌.. సీట్ల భర్తీ ఇలా..

ఆసిఫాబాద్‌ రూరల్‌: తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు వేళైంది. 2024– 25 విద్యా సంవత్సరానికి సంబంధించి సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది.
TS Adarsha Vidyalaya Admissions

మే 5 నుంచి 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జిల్లాలోని ఇంటర్మీడియేట్‌ ఇంగ్లిష్‌ మీడియంలో చదవాలనుకునే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఈ తెలంగాణ ఆదర్శ పాఠశాలలు వరంగా మారాయి. మోడల్‌ స్కూళ్లలోని విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు, కళలు, సాంస్కృతిక రంగాల్లో ప్రతిభ చూపుతున్నారు.

రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటుతున్నారు. జిల్లాలో టాప్‌ ర్యాంకులు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో పది పాసైన విద్యార్థులు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

చదవండి: School Admisssions: బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లలో ప్రవేశానికి దరఖాస్తులు

రెండు స్కూళ్లు.. 320 సీట్లు

జిల్లాలో రెండు తెలంగాణ మోడల్‌ స్కూళ్లు ఉన్నాయి. ఆసిఫాబాద్‌ పట్టణంతోపాటు సిర్పూర్‌(యూ)లోని కళాశాలలో సీఈసీ, ఎంఈసీ, ఎంపీసీ, బైపీసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో గ్రూపులో 40 సీట్ల చొప్పున ఒక్కో కళాశాలలో 160 సీట్లు ఉన్నాయి. మొత్తం 320 సీట్లు భర్తీ చేయనున్నారు.

పదో తరగతి వార్షిక పరీక్షలో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా రోస్టర్‌ విధానంలో ఎంపిక ఉంటుంది. వందమంది బాలికలకు హాస్టల్‌ వసతి కల్పించనున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే 9, 10, ఇంటర్‌ చదివే విద్యార్థులకు భోజన సదుపాయం కూడా ఉంటుంది.

చదవండి: Subject Teachers: స‌బ్జెక్టు ఉపాధ్యాయుల‌కు రెండు రోజుల శిక్ష‌ణ‌..!

సీట్ల భర్తీ ఇలా..

ఇంటర్మీడియట్‌కు సంబంధించి జిల్లాలోని రెండు మోడల్‌ స్కూళ్లలో 320 సీట్లు భర్తీ చేస్తారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఎలాంటి దరఖాస్తు రుసుం లేకుండా ఈ నెల 25లోగా http s:// www.tsmodelsc hools.co m/ admissions/ లింక్‌ ద్వారా వివరాలు సమర్పించాలి.

మే 27న జాబితా విడుదల చేస్తారు. 29వ తేదీ నుంచి 31 వరకు ధ్రువపత్రాలు పరిశీలించి ఎంపికైన వారి జాబితా విడుదల చేస్తారు. విద్యార్థులకు ఉచిత విద్యతోపాటు వసతి, పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు, యూనిఫాం, కంప్యూటర్‌ విద్య, ఐఎఫ్‌పీ డిజిటల్‌ బోర్డులతో అనుభవజ్ఞులైన అధ్యాపకులతో బోధన చేస్తారు.

ఫలితాల్లో సత్తా..

కొన్నేళ్లుగా ఇంటర్‌ వార్షిక ఫలితాల్లో మోడల్‌ పాఠశాల విద్యార్థులు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. 2021– 22 విద్యా సంవత్సరంలో ఇంటర్‌ ఫలితాల్లో 28 మంది సెకండియర్‌ విద్యార్థులు 900లకు పైగా మార్కులు సాధించారు. 2022– 23లో 92 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఈ ఏడాది కూడా సెకండియర్‌ ఫలితాల్లో 35 మంది విద్యార్థులు 900 పైగా మార్కులు సాధించారు.

అక్షయ, పూజిత 983 మార్కులతో జిల్లాలో టాపర్లుగా నిలిచారు. అలాగే నేషనల్‌ కం మెరిట్‌ స్కాలర్‌షిప్‌, జేఈఈ ప్రిలిమ్స్‌, మెయిన్స్‌లో సత్తా చాటుతున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల తల్లిదండ్రులు ఇక్కడ ప్రవేశాలకు మొగ్గు చూపుతున్నారు. దీంతోపాటు ఆసిఫాబాద్‌ మోడల్‌ స్కూల్‌ పీఎం శ్రీ పథకానికి ఎంపిక కావడంతో రానున్న రోజుల్లో ఇక్కడ కార్పొరేట్‌ స్థాయి ప్రమాణాలతో కూడిన వసతులు అందుబాటులోకి రానున్నాయి.

రిజర్వేషన్ల వారీగా సీట్ల వివరాలు...

కేటగిరి

శాతం

సీట్లు

జనరల్‌

బాలికలు

జనరల్‌

50

20

13

07

ఎస్సీ

15

06

04

02

ఎస్టీ

06

02

01

01

బీసీ– ఏ

07

03

02

01

బీసీ– బీ

10

04

03

01

బీసీ– సీ

01

00

00

00

బీసీ– డీ

07

03

02

 01

బీసీ– ఈ

04

02

02

00

Published date : 17 May 2024 04:21PM

Photo Stories