Latest Applications news: దరఖాస్తుల ఆహ్వానం
కడప రూరల్ : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం, ట్రావెల్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని సహాయ ఆచార్యులు డాక్టర్ పి.శర్వానంద్ తెలిపారు. బుధవారం వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని విద్యా సంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్స్ మేనేజ్‌మెంట్ నెల్లూరులో ఉందన్నారు.
నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రముఖ సంస్థల్లో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు, ప్లేస్‌మెంట్స్ కల్పించడమే ఈ విద్యా సంస్థ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
2024–25 విద్యా సంవత్సరానికిగాను ఎంబీఏ (టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్), బీబీఏ (టూరిజం అండ్ ట్రావెల్) కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంబీఏ కోర్సుకు ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలన్నారు. పూర్తి వివరాలకు 9966462786, 9490787854 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.