Skip to main content

Bank jobs 2022: టీఎస్‌సీఏబీలో 445 పోస్టులు.. రాత పరీక్ష ఇలా..

TSCAB Notification

స్థానిక జిల్లాలో.. బ్యాంక్‌ కొలువును సొంతం చేసుకోవాలనుకునే వారి కోసం టీఎస్‌కాబ్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది. తెలంగాణ సహకార బ్యాంకుల్లో ఖాళీల భర్తీకి  హైదరాబాద్‌ డిస్ట్రిక్‌ కో ఆపరేటివ్‌ అపెక్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌(టీఎస్‌సీఏబీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 445 స్టాప్‌ అసిస్టెంట్, అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ ఉత్తీర్ణులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్,మెయిన్స్‌ రాత పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి గల వారు మార్చి 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టుల వివరాలు

  • అసిస్టెంట్‌ మేనేజర్‌(ఏఎమ్‌)–73, స్టాఫ్‌ అసిస్టెంట్‌(ఎస్‌ఏ)–372.

విద్యార్హతలు

  • కనీసం 60శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే తెలుగు భాషపై పట్టు ఉండాలి. తెలంగాణ లోకల్‌ అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 
  • వయసు: 01.02.2022 నాటికి 18–30 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం
రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షలను ఆన్‌లైన్‌ నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపిన వారిని రోస్టర్‌ ప్రకారం ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష ఇలా

  • ప్రిలిమిన రీ: ఈ పరీక్షకు ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో కంప్యూటర్‌ ఆధారంగా(సీబీటీ) నిర్వహిస్తారు. మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలుంటాయి. ప్రతి విభాగానికి పరీక్ష సమయం ప్రత్యేకంగా ఉంటుంది. మూడు విభాగాలుగా నిర్వహించే ఈ పరీక్షకు 60 నిమిషాల పరీక్ష సమయం ఉంటుంది.  ఇందులో ఇంగ్లిష్‌ విభాగానికి 30 ప్రశ్నలు, రీజనింగ్‌ ఎబిలిటీ–35 ప్రశ్నలు,  న్యూమరికల్‌ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కును కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 శాతం చొప్పున కోతను వి«ధిస్తారు.

మెయిన్‌ ఎగ్జామినేషన్‌
ఈ పరీక్షను కూడా ఆబ్జెక్టివ్‌ పద్దతిలో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలను అడుగుతారు. మొత్తం 160 ప్రశ్నలకు గాను 160 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రతి విభాగానికి ప్రత్యేక పరీక్ష సమయం ఉంటుంది. ఇందులో జనరల్‌ నాలెడ్జ్‌ విభాగానికి 40 ప్రశ్నలు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌–40 ప్రశ్నలు, రీజనింగ్‌ ఎబిలిటీ–40 ప్రశ్నలు, న్యూమరికల్‌ ఎబిలిటీ విభాగం నుంచి 40 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. అలాగే ప్రతి తప్పు సమాధానానికి 0.25శాతం మార్కును కోతగా విధిస్తారు.

వేతనాలు
ఈ పోస్టులకు ఎంపికైన అసిస్టెంట్‌ మేనేజర్‌కు రూ.26,080–రూ.57,860 వేతనంగా చెల్లిస్తారు. అలాగే స్టాఫ్‌ అసిస్టెంట్‌లుగా ఎంపికైన వారు రూ.17,900–47,920 వేతనంగా పొందుతారు.  

ముఖ్యమైన సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 10.03.2022
  • స్టాఫ్‌ అసిస్టెంట్‌ పరీక్ష తేది: 24 ఏప్రిల్‌ 2022
  • అసిస్టెంట్‌ మేనేజర్‌ పరీక్ష తేది: 23 ఏప్రిల్‌ 2022
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://tscab.org/

​​​​​​​

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 10,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories