SBI Recruitment: 714 పోస్టులకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచిల్లో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్(ఎస్‌సీఓ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 714
పోస్టుల వివరాలు: మేనేజర్, రిలేషన్ మేనేజర్, ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్, సీనియర్ రిలేషన్ మేనేజర్,రీజనల్ హెడ్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, స్పెషల్ ఎగ్జిక్యూటివ్ తదితరాలు.
విభాగాలు: డాట్‌నెట్ డెవలపర్, జావా డెవలపర్, బిజినెస్ ప్రాసెస్, ఆపరేషన్స్ టీమ్, బిజినెస్ డెవలప్‌మెంట్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ /బీటెక్/బీఈ/ఎంటెక్/ఎంఈ/ఎంసీఏ/ఎంఎస్సీ(కంప్యూటర్‌సైన్స్/ఇంజనీరింగ్ /ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ /ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్)/ఎంబీఏ/పీజీ/పీజీడీఎం ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: పోస్టును అనుసరించి 01.04.2022 వరకు 20 నుంచి 50 ఏళ్లు ఉండాలి.
పని అనుభవం: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం రెండేళ్లు నుంచి 12ఏళ్లు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. మేనేజర్, ఇంజనీర్ ఉద్యోగాలకు మాత్రం దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఇందులో ప్రతిభ ఆధారంగా నియామకాలు చేపడతారు.
పరీక్ష విధానం: ఆన్‌లైన్‌లో పరీక్ష జరుగుతుంది. రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్, ఐటీ నాలెడ్జ్, రోల్ బేస్డ్ నాలెడ్జ్ సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 మార్కులకు గాను 70 మార్కులు ఆన్‌లైన్ పరీక్ష నుంచి మరో 30 మార్కులు ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
జేఎంజీఎస్–1
ఈ పోస్టులకు సంబంధించి జనరల్ అప్టిట్యూడ్ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 50 ప్రశ్నలకు 50 మార్కులు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 35 ప్రశ్నలకు 35 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 35 మార్కులకు 35 ప్రశ్నలను అడుగుతారు. పరీక్ష సమయం 90 నిమిషాలు.
ఎంఎంజీఎస్
ఈ పోస్టులకు సంబంధించి ప్రొఫెషనల్ నాలెడ్జ్ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో జనరల్ ఐటీ నాలెడ్జ్ నుంచి 25 ప్రశ్నలు–50 మార్కులు, రోల్ బేస్డ్ నాలెడ్జ్ నుంచి 100 మార్కులకు 50 ప్రశ్నలను ఇస్తారు. పరీక్ష సమయం 70 నిమిషాలు ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నంలలో పరీక్ష కేంద్రాలున్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 20.09.2022
వెబ్‌సైట్: https://sbi.co.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | September 20,2022 |
Experience | 2 year |
For more details, | Click here |