Skip to main content

SBI Recruitment 2022: ఎస్‌బీఐలో 1422 సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

SBI CBO Recruitment 2022

ప్రభుత్వ రంగ బ్యాంక్‌.. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ).. దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ సర్కిళ్లలో 1422 సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. హైదరాబాద్‌ సర్కిల్‌లో 176 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సర్కిల్‌/రాష్ట్రంలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 1422
పోస్టు: సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్లు
ఎస్‌బీఐ సర్కిళ్లు: భోపాల్, భువనేశ్వర్, హైదరాబాద్, జైపూర్, కోల్‌కతా, మహారాష్ట్ర, నార్త్‌ ఈస్ట్రన్‌. 
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. 
వయసు: 30.09.2022 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 
వేతనం: నెలకు ప్రారంభ బేసిక్‌ పే రూ.36,000 లు ఉంటుంది. రూ.36,000-రూ.63,840 శ్రేణిలో వేతనం లభిస్తుంది.

చ‌ద‌వండి: Competitive Exams: సివిల్స్, బ్యాంక్స్.. ఇలా.. ప‌రీక్షలు ఏవైనా.. జనరల్‌ స్టడీస్‌లో రాణిస్తేనే విజయం.. 

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్‌ రాత పరీక్ష, స్క్రీనింగ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
  • ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం: 18.10.2022
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 7.11.2022
  • హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌: నవంబర్‌/డిసెంబర్‌ 2022
  • ఆన్‌లైన్‌ టెస్ట్‌ తేదీ: 04.12.2022
  • వెబ్‌సైట్‌: https://bank.sbi/web/careers

 

చ‌ద‌వండి: Bank Jobs 2022: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో.. ఉద్యోగం కొట్టాలనుకుంటున్నారా..? అయితే మీకు సరైన మార్గం ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 07,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories