Bank Jobs: పంజాబ్ బ్యాంక్‌లో 103 మేనేజర్ కొలువులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఇలా..
బ్యాంక్ ఉద్యోగం.. ప్రస్తుతం డిగ్రీ పట్టా ఉన్న ఎందరో ఉద్యోగార్థుల కల. ఇటువంటి వారి కోసమే పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) ప్రకటన విడుదల చేసింది. న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేసే పీఎన్‌బీ.. దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో మేనేజర్, ఆఫీసర్ ఖాళీల భర్తీకి ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 103
పోస్టుల వివరాలు: ఆఫీసర్(ఫైర్‌సేఫ్టీ) జేఎంజీఎస్ గ్రేడ్1: 23 పోస్టులు; మేనేజర్ (సెక్యూరిటీ) ఎంఎంజీఎస్ గ్రేడ్2: 80 పోస్టులు.
అర్హతలు
- బ్యాచిలర్ డిగ్రీ లేదా బీఈ(ఫైర్), బీఈ/బీటెక్(ఫైర్ టెక్నాలజీ/ఫైర్ ఇంజనీరింగ్/ సేఫ్టి అండ్ ఫైర్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణతతోపాటు పనిఅనుభవం ఉండాలి.
- వయసు: 01.07.2022 నాటికి 2135ఏళ్ల మధ్య ఉండాలి.
చదవండి: Bank Jobs: ఏదైనా డిగ్రీతో 6432 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
ఎంపిక ప్రక్రియ
అభ్యర్థుల ఎంపికకు బ్యాంక్ రెండు పద్ధతులను అనుసరించే అవకాశం ఉంది. రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ; లేదా రాత పరీక్షతోపాటు ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ ద్వారా
వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో చూపించిన ప్రతిభ ఆధారంగా.. మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థులను తుది ఎంపిక చేసి.. నియామకం ఖరారు చేస్తారు.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ
- ఈ విధానంలో మొదట ఆన్‌లైన్ పద్ధతిలో రాత పరీక్ష ఉంటుంది. ఇది మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. 50 ప్రశ్నలకు ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్ష సమయం 60 నిమిషాలు. తప్పు సమాధానానికి నాల్గో వంతు రుణాత్మక మార్కులుంటాయి.
- పరీక్షలో బ్యాంక్ నిర్ణయించిన కటాఫ్ మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
ఇంటర్య్వూ
ఏ విధానం అనుసరించినా..ఇంటర్వ్యూకు 50 మార్కులుంటాయి.ఇందులో ఎస్సీ/ఎస్టీ అభ్యర్థు లు 22.50(45శాతం) మార్కులు, ఇతర అభ్యర్థులు 50శాతం మార్కులు అంటే.. కనీసం 25 మార్కులు పొందాలి.
వేతనాలు
- ఆఫీసర్(ఫైర్‌సేఫ్టీ)జేఎంజీఎస్ గ్రేడ్1 పోస్టు లకు ఎంపికైన వారికి ప్రతి నెల రూ.36,000రూ.63,840 వరకు వేతనంగా లభిస్తుంది.
- మేనేజర్(సెక్యూరిటీ)ఎంఎంజీఎస్ గ్రేడ్2 పో స్టులకు ఎంపికైన వారు ప్రతి నెల రూ.48,170రూ.69,810 వరకు వేతనంగా అందుకుంటారు. వీటితోపాటు డీఏ, సీసీఏ, హెచ్‌ఆర్‌ఏ వంటి ప్రయోజనాలు కూడా పొందుతారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను చీఫ్ మేనేజర్(రిక్రూట్‌మెంట్ విభాగం), హెచ్‌ఆర్‌డీ డివిజన్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కార్పొరేట్ ఆఫీస్, ప్లాట్ నెం.4, సెక్టార్ 10, ద్వారక, న్యూఢిల్లీ చిరునామాకు స్పీడ్/రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: 30.08.2022
వెబ్‌సైట్: https://www.pnbindia.in
చదవండి: Bank Jobs: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 103 మేనేజర్, ఆఫీసర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 30,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |