Skip to main content

Bank Exam Preparation Tips: అవుతారా.. బ్యాంక్‌ పీవో!

బ్యాంకింగ్‌ రంగంలో అత్యంత క్రేజీ పోస్టు.. పీవో! ప్రభుత్వ రంగ బ్యాంకు.. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పీవో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన 500 పీవో(ప్రొబేషనరీ ఆఫీసర్‌) పోస్టులను భర్తీ చేయనుంది. రాత పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇలా ఎంపికైన వారు ముందుగా ఏడాది వ్యవధి ఉండే పీజీడీబీఎఫ్‌ కోర్సు పూర్తిచేయాలి. అనంతరం అసిస్టెంట్‌ మేనేజర్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఈ నేపథ్యంలో.. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా భర్తీ చేసే పీవో పోస్టులు, ఎంపిక ప్రక్రియ, పీజీడీబీఎఫ్‌ కోర్సు తదితర వివరాలు..
Bank Exam Preparation Tips
  • మొత్తం పీవో పోస్టులు: 500
  • విభాగాల వారీగా ఖాళీలు: జనరల్‌ బ్యాంకింగ్‌ స్ట్రీమ్‌లో క్రెడిట్‌ ఆఫీసర్‌ పోస్టులు–350, స్పెషల్‌ స్ట్రీమ్‌లో ఐటీ ఆఫీసర్‌ పోస్టులు–150.

అర్హతలు

క్రెడిట్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే వారు ఏదైనా విభాగంలో డిగ్రీ  ఉత్తీర్ణులై ఉండాలి. ఐటీ ఆఫీసర్‌ ఉద్యోగాలకు కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ/ఎలక్ట్రానిక్‌ విభాగాల్లో బీఈ/బీటెక్‌ లేదా ఇవే విభాగాల్లో పీజీ లేదా ఏదైనా డిగ్రీతోపాటు డీఓఈఏసీసీలో బీ లెవల్‌ ఉత్తీర్ణత  ఉండాలి.

వయసు

ఈ రెండు పోస్టులకు ఫిబ్రవరి 01, 2023 నాటికి 20 నుంచి 29 ఏళ్లలోపు వయసు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు; దివ్యాంగులకు పదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.

తుది ఎంపిక ఇలా

ఆన్‌లైన్‌ పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆ¯Œ లైన్‌ రాత పరీక్షలో సాధించిన మెరిట్, గ్రూప్‌ డిస్కషన్‌లో చూపిన ప్రతిభ, ఇంటర్వ్యూల్లో సాధించిన మార్కుల మెరిట్‌ ఆధారంగా, రిజర్వేషన్లను అనుసరించి తుది ఎంపిక చేస్తారు.

చ‌ద‌వండి: Groups Preparation Tips: 'కరెంట్‌ అఫైర్స్‌'పై పట్టు.. సక్సెస్‌కు తొలి మెట్టు!

రాత పరీక్ష  విధానం

  • తొలుత కంప్యూటర్‌ ఆధారిత పరీక్షను ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో 200 మార్కులకు–155 ప్రశ్నలకు నిర్వహిస్తారు. పరీక్ష సమయం 3 గంటలు. దీంతోపాటు డిస్క్రిప్టివ్‌ విధానంలో 2 ప్రశ్నలను అడుగుతారు. వీటికి 25 మార్కులుంటాయి. దీనికి అరగంట సమయం కేటాయిస్తారు. 
  • ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహించే పరీక్షలో నాలు గు విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. ఇందులో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 35 ప్రశ్నలు–40 మార్కులు, రీజినింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ 45 ప్రశ్నలు–60 మార్కులు, జనరల్‌/ఎకనామీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌ 40 ప్రశ్నలు–40 మార్కులు, డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌ విభాగం నుంచి 35 ప్రశ్నలు–60 మార్కులకు పరీక్ష ఉంటుంది. 
  • నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులో నుంచి పావు వంతు తగ్గిస్తారు.
  • ఆబ్జెక్టివ్‌ విభాగంలోని ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, డిస్క్రిప్టివ్‌ ఇంగ్లిష్‌ పేపర్లలో అర్హత సాధిస్తే సరిపోతుంది. వీటిలో సాధించిన మార్కులు తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. 
  • ఆబ్జెక్టివ్‌ పరీక్షలో అర్హత సాధించేందుకు జనరల్, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు కనీసం 40 శాతం, ఇతరులు కనీసం 35శాతం మార్కులు సాధించాలి. 

గ్రూప్‌ డిస్కషన్‌

రాత పరీక్షలో మెరిట్‌తోపాటు, రిజర్వేషన్‌ ప్రకారం ఎంపిక చేసిన కొంత మందిని గ్రూప్‌ డిస్కషన్‌కు పిలుస్తారు. దీనికి 40 మార్కులుంటాయి. ఇందులో జనరల్, ఈడబ్ల్యూఎస్‌లు కనీసం 40శాతం, ఇతర అభ్యర్థులు కనీసం 35శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది.

చ‌ద‌వండి: Competitive Exams: సివిల్స్, బ్యాంక్స్.. ఇలా.. ప‌రీక్షలు ఏవైనా.. జనరల్‌ స్టడీస్‌లో రాణిస్తేనే విజయం..

ఇంటర్వ్యూ

గ్రూప్‌ డిస్కషన్‌లో అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. మొత్తం 60 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. జనరల్, ఈడబ్ల్యూఎస్‌లు 40 శాతం, ఇతరులు కనీసం 35 శాతం మార్కులు సాధించాలి.

పీజీడీబీఎఫ్‌ కోర్సు

  • తుది ఎంపికలో అర్హత సాధించిన వారికి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌(పీజీడీబీఎఫ్‌) కోర్సు ఏప్రిల్‌ మొదటి వారంలో మణిపాల్‌ క్యాంపస్‌లో ప్రారం¿¶ మవుతుంది. మొత్తం కోర్సు ఫీజు రూ.3.5 లక్షలు. జీఎస్‌టీ ఇందుకు అదనంగా చెల్లించాలి. ఇందులో భాగంగా వసతి, భోజన సౌకర్యాలు కూడా అందిస్తారు. కోర్సు ఫీజు కోసం రుణ సౌకర్యం కూడా ఉంది. ఏడాది కోర్సు అనంతరం ప్రతి నెల కొంత మొత్తం చొప్పున సులభ వాయిదాల్లో రుణ మొత్తాన్ని చెల్లించే  వెసులుబాటు ఉంది. 
  • ఈ కోర్సులో మొత్తం నాలుగు ట్రై మిస్టర్లు ఉంటాయి. మొదటి మూడు ట్రై  మిస్టర్లకు నెలకు రూ.2500 స్టయిపెండ్‌గా చెల్లిస్తారు. చివరి ట్రైమిస్టర్లో ఏదైనా బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో జాబ్‌ ట్రైనింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో నెలకు రూ.15,000 స్టయిపెండ్‌ అందుతుంది.  
  • విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్న వారికి అసిస్టెంట్‌ మేనేజర్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. కనీసం మూడేళ్లు విధుల్లో కొనసాగుతామని రూ.లక్ష సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. సంబంధిత గడువు తీరిన తర్వాత సెక్యూరిటీ డిపాజిట్‌ మొత్తాన్ని తిరిగి ఇస్తారు. అలాగే సంస్థలో ఐదేళ్లు సర్వీస్‌ పూర్తిచేసుకున్న వారికి కోర్సు ఫీజు కూడా వెనక్కి ఇచ్చేస్తారు.

వేతనాలు

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.36,000 వరకు మూలవేతనంగా అందుతుంది. ఈ మూలవేతనంతోపాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు అదనంగా లభిస్తాయి. అన్నీ కలుపుకొని సుమారు రూ.60 వేల వరకు వేతనం  పొందవచ్చు.

చ‌ద‌వండి: Bank Jobs: ఐబీపీఎస్‌ పీఓ.. మెయిన్‌లో మెరిసేలా!

ప్రిపరేషన్‌ పక్కాగా

  • ఇప్పటికే బ్యాంకింగ్‌ పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు అదే ప్రిపరేషన్‌తో ఈ పరీక్షను కూడా రాయవచ్చు. తాజాగా ప్రిపరేషన్‌ మొదలు పెట్టాలనుకునే వారు పరీక్ష సిలబస్‌ను పూర్తిగా అధ్యయనం చేయాలి. ఇచ్చిన సిలబస్‌లో బేసిక్‌ అంశాలతో ప్రిపరేషన్‌ మొదలు పెడితే.. అనంతరం ఆయా అంశాలపై పట్టు సాధించవచ్చు. 
  • ప్రిపరేషన్‌లో భాగంగా ఎక్కువగా మాక్‌ టెస్టులను రాయాలి. వీలైనన్నీ మాదిరి ప్రశ్నలను ప్రాక్టీస్‌ చేయడం ద్వారా మంచి మార్కులు సాధించడమే కాకుండా.. నిర్ణిత సమయంలో వేగంగా సమాధానాలు గుర్తించడానికి సన్నద్ధత లభిస్తుంది. కష్టమనిపించే అంశాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి. మాక్‌ టెస్టుల్లో చేసే తప్పులను గుర్తించి.. అవి పునరావృత్తం కాకుండా చూసుకోవాలి. నెగిటివ్‌  మార్కుల నిబంధన ఉన్నందున తెలియని ప్రశ్నలను వదిలేయడం మంచిది. ఎందుకంటే.. వాటితో సమయం వృథా అవుతుంది. 
  • ఆబ్జెక్టివ్‌ పరీక్షతోపాటు డిస్క్రిప్టివ్‌ పరీక్షను రాయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్‌లోనే దాన్ని కూడా భాగం చేసి ప్రాక్టీస్‌ చేయాలి.
  • డేటా అనాలసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌కు అధిక ప్రాధాన్యమివ్వాలి. దీని తర్వాత రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ ప్రధానమైంది. ఈ రెండు విభాగాల్లో మెరుగైన మార్కులు పొందినవారు మాత్రమే తర్వాత దశకు చేరుకోగలుగుతారు. ఈ విభాగంలోని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడానికి షార్ట్‌కట్‌ మెథడ్స్‌ను అనుసరించాలి. 
  • గత పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాలతోపాటు వీలైనన్ని ఎక్కవ మాక్‌టెస్టులు, ప్రాక్టీస్‌ టెస్టులను రాయాలి. దీని ద్వారా ఆయా అంశాలపై ఏ మేరకు అవగాహన ఉందో తెలుస్తుంది. 

ముఖ్యసమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 25, 2023
  • వెబ్‌సైట్‌: https://bankofindia.co.in

చ‌ద‌వండి: Bank Jobs: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 500 ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టులు.. పరీక్షా విధానం ఇలా!

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date February 25,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories