Bank Jobs: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు.. పరీక్షా విధానం ఇలా!
మొత్తం పోస్టుల సంఖ్య: 500
పోస్టుల వివరాలు: జనరల్ బ్యాంకింగ్ స్ట్రీమ్‌లో క్రెడిట్ ఆఫీసర్ (జీబీవో)-350, ఐటీ ఆఫీసర్ ఇన్ స్పెషలిస్ట్ స్ట్రీమ్(ఎన్‌పీఎల్)-150.
అర్హత: క్రెడిట్ ఆఫీసర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ, ఐటీ ఆఫీసర్ పోస్టులకు బీఈ, బీటెక్/పీజీ(కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్-టెలికమ్యూనికేషన్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.02.2023 నాటికి 20 నుంచి 29 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.36,000 నుంచి రూ.63,480 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష, బృంద చర్చలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: మొత్తం 225 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్, జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రెటేషన్, ఇంగ్లిష్ డిస్క్రిప్టివ్ పేపర్-లెటర్ రైటింగ్-ఎస్సే అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
తెలంగాణ రాష్ట్రంలో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 25.02.2023.
వెబ్‌సైట్: https://bankofindia.co.in/
చదవండి: Central Bank of India Recruitment: సెంట్రల్ బ్యాంక్, ముంబైలో 250 పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | February 25,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |