Bank Jobs: ఐబీపీఎస్ పీఓ.. మెయిన్‌లో మెరిసేలా!
- » ఈ నెల 22న మెయిన్ ఎగ్జామినేషన్
- » ఇటీవలే విడుదలైన ప్రిలిమ్స్ ఫలితాలు
- » మొత్తం 4,135 పోస్ట్‌లకు రెండో దశ ఎంపిక ప్రక్రియ
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్.. ఐబీపీఎస్! ఏటా పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో.. పోస్ట్‌ల భర్తీ చేపడుతున్న నియామక సంస్థ! ఐబీపీఎస్ 2022–23 సంవత్సరానికి.. పలు బ్యాంకుల్లో ప్రొబేషరీ ఆఫీసర్/మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్ట్‌లకు గత ఏడాది నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపిక ప్రక్రియలో.. తొలి దశ అయిన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించి.. ఇటీవల పరీక్ష ఫలితాలను ప్రకటించింది. రెండో దశగా పేర్కొనే.. మెయిన్ పరీక్ష తేదీని కూడా వెల్లడించింది. ఈ నెల 22వ తేదీన మెయిన్ పరీక్ష నిర్వహించనుంది. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించి.. మెయిన్‌కు అర్హత పొందిన వారికి కాల్ లెటర్ డౌన్‌లోడ్ సదుపాయం కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో.. మరో వారం రోజుల్లో జరుగనున్న ఐబీపీఎస్ మెయిన్‌లో రాణించడమెలాగో తెలుసుకుందాం...
Also read: Preparation Tips: కంప్యూటర్‌పై పట్టు.. కొలువు కొట్టు
4,135: ఐబీపీఎస్ పీఓ/ఎంటీ–11 ద్వారా భర్తీ చేయనున్న పోస్ట్‌లు.
- 1:10: ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత ఆధారంగా మెయిన్‌కు అర్హత పొందే అభ్యర్థుల నిష్పత్తి. దాదాపు 41వేల మంది ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించి.. మెయిన్ పరీక్షకు అర్హత సాధించినట్లు సమాచారం. ఈ అభ్యర్థులు ఐబీపీఎస్ మరికొద్ది రోజు ల్లో నిర్వహించనున్న మెయిన్‌లో మెరిస్తేనే.. ఎంపిక ప్రక్రియలో తుది దశగా పేర్కొనే పర్సనల్ ఇంటర్వ్యూకు అర్హత సాధిస్తారు. మెయిన్‌లోనూ రాణించిన వారు పీఓ కొలువుకు మరో అడుగు దూరంలో మాత్రమే నిలుస్తారు!
మెయిన్ పరీక్ష ఇలా
- ఐబీపీఎస్ పీఓ పరీక్ష ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. మొత్తం నాలుగు విభాగాల్లో 200 మార్కులకు ఆబ్జెక్టివ్ పద్ధతిలో, అలాగే డిస్క్రిప్టివ్ టెస్ట్‌ను 25 మార్కులకు నిర్వహించనున్నారు. ఆ వివరాలు...
విభాగం | ప్రశ్నలు | మార్కులు | సమయం |
రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ | 45 | 60 | 60 ని. |
జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్ | 40 | 40 | 35 ని |
ఇంగ్లిష్ లాంగ్వేజ్ | 35 | 40 | 40 ని |
డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ | 35 | 60 | 45 ని |
మొత్తం | 155 | 200 | 3 గం |
ఈ నాలుగు సెక్షన్లలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి.
వీటికి నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.ప్రతి తప్పు సమాధానానికి సదరు ప్రశ్నకు కేటాయించిన మార్కుల నుంచి 0.25 మార్కులను తగ్గిస్తారు.
Also read: Bank Jobs: ఎస్‌బీఐలో 21 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు
డిస్క్రిప్టివ్ టెస్ట్
- మెయిన్ పరీక్షలోనే ఆబ్జెక్టివ్ టెస్ట్ ముగిసిన తర్వాత అర గంట వ్యవధిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ పేరుతో డిస్క్రిప్టివ్ పరీక్ష నిర్వహిస్తారు.
- ఈ డిస్క్రిప్టివ్ టెస్ట్‌లో భాగంగా అభ్యర్థులు లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్ రాయాల్సి ఉంటుంది. ఒక లెటర్ రైటింగ్, ఒక ఎస్సే రాయమని అడుగుతారు.
- డిస్క్రిప్టివ్ టెస్ట్‌కు కేటాయించిన మార్కులు 25.
- ఇలా ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్.. రెండు కలిపి 225 మార్కులకు మెయిన్ పరీక్ష జరుగుతుంది. ఈ మెయిన్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా.. తుది దశ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.
Also read: Exam Guidance: కొత్త సంవత్సరంలో.. వీటిపై పట్టు.. కొలువు కొట్టు !
మెయిన్.. మెళకువలు
- ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో అభ్యర్థులు పూర్తిగా ప్రాక్టీస్, రివిజన్‌కు ప్రాధాన్యమివ్వాలి. పరీక్షలో పేర్కొన్న విభాగాలను పరిగణనలోకి తీసుకుంటూ.. సెక్షన్‌ల వారీగా రివిజన్, మోడల్ టెస్ట్‌లు రాయాలి.
- రీజనింగ్ విభాగంలో.. సిరీస్, అనాలజీ, కోడింగ్–డీ కోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ర్యాంకింగ్స్, సీటింగ్ అరేంజ్‌మెంట్స్, సిలాజిజమ్స్‌లను పునశ్చరణ చేసుకోవాలి.
- జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్ కోసం ప్రిలిమ్స్ ముగిసిన తర్వాత నుంచి.. ఇప్పటి వరకు ఆర్థిక రంగంలో జరిగిన పరిణామాలు, బ్యాంకుల విధి విధానాల్లో మార్పులు, కొత్తగా ప్రకటించిన పథకాల గురించి తెలుసుకోవాలి. అదే విధంగా బ్యాంకింగ్ పదజాలం, స్థూల ఆర్థిక భావనలపై నోట్స్ రూపొందించుకోవాలి.
- ఇంగ్లిష్ లాంగ్వేజ్ కోసం బేసిక్ గ్రామర్‌తో మొదలు పెట్టి వొకాబ్యులరీని మరింత పెంచుకోవాలి. వాస్తవానికి ఈ విభాగం ప్రిలిమ్స్‌లోనూ ఉంటుంది. మెయిన్‌లో అడిగే ప్రశ్నల క్లిష్టత కొంత ఎక్కువగా ఉంటుంది. రీడింగ్ కాంప్రహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, జంబుల్డ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్‌కు సంబంధించి షార్ట్ నోట్స్, రెడీ రెకనర్స్‌ను వినియోగించుకోవాలి.
- డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్‌లో రాణించేందుకు కాలిక్యులేషన్ స్కిల్స్‌కు మరింత పదును పెట్టుకోవాలి. టేబుల్స్, డయాగ్రమ్స్, నంబర్ డేటా, లైన్ గ్రాఫ్, బార్ గ్రాఫ్ తదితర గ్రాఫ్ ఆధారిత డేటాలోని సమాచారాన్ని క్రోడీకరించేలా ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి.
- డిస్క్రిప్టివ్ విధానంలో ఉండే ఇంగ్లిష్ ఎస్సే రైటింగ్, లెటర్ రైటింగ్ కోసం ఇంగ్లిష్ న్యూస్ పేపర్లు చదవడం, ఎడిటోరియల్ లెటర్స్ చదవడం మేలు చేస్తుంది.
- ప్రస్తుత సమయంలో అభ్యర్థులు ఆయా వ్యాసాలను చదవడంతోపాటు వాటిలో ముఖ్య సమాచారాన్ని నోట్స్ రూపంలో పొందుపరచుకోవాలి. ముఖ్యాంశాలను హైలెట్ చేసుకుంటూ అభ్యసనం సాగించాలి.
- మెయిన్‌కు ఎంపికైన అభ్యర్థులకు ఇప్పటి నుంచి వారం రోజుల సమయం మాత్రమే అందుబాటులో ఉంది. ఈ వారం రోజుల్లో అత్యధిక సమయం పునశ్చరణకు కేటాయించుకోవాలి. ప్రతి రోజు అన్ని విభాగాలు పునశ్చరణ చేసుకునేలా టైమ్ ప్లాన్ రూపొందించుకోవాలి.
మోడల్ టెస్ట్‌లు
- రివిజన్, ప్రాక్టీస్‌లకు సమయం కేటాయిస్తూనే.. ప్రతి రోజు మోడల్ టెస్ట్‌లకు హాజరవడం ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ప్రీవియస్ కొశ్చన్ పేపర్లు, మోడల్ టెస్ట్‌లు ఎక్కువగా సాధన చేయాలి. ఆ ఫలితాలను విశ్లేషించుకుంటూ మరుసటి రోజు ప్రిపరేషన్ ప్రణాళిక దిశగా అడుగులు వేయాలి.
- డిస్క్రిప్టివ్ టెస్ట్ కోసం ఎస్సే రైటింగ్, లెటర్ రైటింగ్ పరీక్షకు అందుబాటులో ఉండే సమయాన్ని పరిగణనలోకి తీసుకొని..ప్రతి రోజు ఒక ఎస్సే, ఒక లెటర్ రైటింగ్ రాసే ప్రయత్నం చేయాలి.
మెయిన్ తర్వాత
- ఐబీపీఎస్ ఎంపిక ప్రక్రియలో మెయిన్‌లోనూ అర్హత పొందిన వారికి చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మెయిన్‌లో.. సెక్షన్ వారీ కటాఫ్, ఓవరాల్ కటాఫ్‌లను పేర్కొని.. ఆ జాబితాలో నిలిచిన వారికి చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూకు కేటాయించిన మార్కులు 100. ఇందులో అభ్యర్థులు కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది.
- మెయిన్, ఇంటర్వ్యూ మార్కులకు వెయిటేజీ కల్పించి.. ఫైనల్ లిస్ట్‌ను, ఆఫర్ లెటర్లును ఖరారు చేస్తారు. మెయిన్ మార్కులకు 80 శాతం వెయిటేజీ, పర్సనల్ ఇంటర్వ్యూ మార్కులకు 20 శాతం వెయిటేజీని నిర్దేశించారు. ఇలా వంద శాతానికి అభ్యర్థులు పొందిన మార్కులను క్రోడీకరించి.. ఈ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు ఆఫర్ ఇస్తారు.
Also read: General Awareness
ఈ మార్కులు సాధించేలా
ఐబీపీఎస్ పీఓ మెయిన్ ఎగ్జామినేషన్ గత ఫలితాలు కటాఫ్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటే.. జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 90 మార్కులు పొందేలా కృషి చేయాలి. ఐబీపీఎస్ పీఓ మెయిన్ ఎగ్జామినేషన్ గత నాలుగేళ్ల కటాఫ్ మార్కుల వివరాలు..
కేటగిరీ | 2020 | 2019 | 2018 | 2017 |
జనరల్ | 83.5 | 71.25 | 74.5 | 82 |
ఓబీసీ | 78.63 | 70.25 | 68.38 | 75.63 |
ఎస్సీ | 66.38 | 55.63 | 56.38 | 62.5 |
ఎస్టీ | 52.25 | 38.13 | 35.75 | 42.25 |
ఈడబ్ల్యూఎస్ | 75.75 | 65.88 | –– | –– |
Also read: Elimination of Violence Against Women: 16 రోజులు... పదునెక్కే ఆలోచనలు
ఐబీపీఎస్ పీఓ మెయిన్–ముఖ్య సమాచారం
- 2022–23లో ఆయా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 4,135 పీఓ పోస్ట్‌ల భర్తీకి
- నిర్వహించే ఎంపిక ప్రక్రియలో రెండో దశ.. మెయిన్ ఎగ్జామినేషన్.
- పరీక్ష తేదీ: జనవరి 22, 2022
- కాల్ లెటర్ డౌన్‌లోడ్ సదుపాయం:
- జనవరి 10 నుంచి జనవరి 22 వరకు
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://ibps.in
60 శాతం లక్ష్యంగా
మెయిన్‌కు ఎంపికైన అభ్యర్థులు.. 60 శాతం మార్కులు సాధించడమే లక్ష్యంగా కృషి చేయాలి. గత కటాఫ్‌లను పరిగణనలోకి తీసుకుంటే.. 50 శాతం మార్కులతో∙ఉత్తీర్ణత సాధించి పర్సనల్ ఇంటర్వ్యూకు ఎంపికైనట్లు స్పష్టమవుతోంది. 50 నుంచి 60 శాతం మార్కులు లక్ష్యంగా కృషి చేస్తే.. పరీక్ష రోజు ఏమరపాటుతో ఏమైనా పొరపాట్లు చేసి నెగెటివ్ మార్కుల ప్రభావం పడినా.. మెరిట్ లిస్ట్‌లో నిలిచేందుకు ఆస్కారం లభిస్తుంది. మెయిన్ పరీక్ష ‘కీ’ ఆధారంగా 50 శాతం మార్కులు వస్తాయని భావించే అభ్యర్థులు.. చివరి దశ పర్సనల్ ఇంటర్వ్యూకు సన్నద్ధమవ్వాలి.
–వినయ్ కుమార్ రెడ్డి, సబ్జెక్ట్ నిపుణులు