LIC HFL Recruitment 2022: ఎల్‌ఐసీలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. నెలకు రూ.80వేలకుపైగా వేతనం..
ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్.. పలు విభాగాల్లో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయశాఖల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి గల వారు ఆగస్టు 25 తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం పోస్టుల సంఖ్య: 80
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ పోస్టులు50; అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు30.
అర్హత: అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు డిగ్రీ లేదా పీజీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణలవ్వాలి. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల్లో డైరెక్ట్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్(డీఎంఈ) విభాగానికి సంబంధించి కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీతోపాటు ఎంబీఏలో మార్కెటింగ్/ఫైనాన్స్ చేసి ఉండాలి. అలాగే వీరికి సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. రెండు పోస్టులకు సంబంధించి కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
వయసు: 01.01.2022 నాటికి 2128 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. డీఎంఈ పోస్టులకు 2140 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి.
వేతనాలు: అసిస్టెంట్ పోస్టులకు నెలకు రూ.33,960 వేతనంగా చెల్లిస్తారు. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఎంపికైన వారు ప్రతి నెల రూ.80,100 వేతనంగా పొందవచ్చు.వీటికి అదనంగా ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: ఈ పరీక్షను ఆన్‌లైన్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)విధానంలో నిర్వహిస్తారు. ఇందులో నాలుగు విభాగాల నుంచి మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులుంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు.
నాలుగు విభాగాలు
ఇంగ్లిష్ లాంగ్వేజ్: ఈ విభాగంలో 50 ప్రశ్నలు50 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం 35 నిమిషాలు.
లాజికల్ రీజనింగ్: ఈ విభాగంలో 50 మార్కులకు 50 ప్రశ్నలుంటాయి. పరీక్ష సమయం 35 నిమిషాలు.
జనరల్ అవేర్‌నెస్: ఇందులో 50 మార్కులకు 50 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 15 నిమిషాలు.
న్యూమరికల్ ఎబిలిటీ: ఈ విభాగంలో 50 ప్రశ్నలకు 50 మార్కులుంటాయి. పరీక్ష సమయం 50 నిమిషాలు.
ముఖ్యసమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.
- దరఖాస్తులకు చివరి తేదీ: 25.08.2022
- వెబ్‌సైట్: https://www.lichousing.com/
చదవండి: Bank Jobs: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 103 మేనేజర్, ఆఫీసర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 25,2022 |
Experience | 3 year |
For more details, | Click here |