Skip to main content

9,053 Posts in IBPS RRB Notification: గ్రామీణ బ్యాంకుల్లో.. ఘనమైన కొలువులు

ఉద్యోగార్థులకు శుభవార్త! బ్యాంకు కొలువుల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు చక్కటి అవకాశం!! ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌(ఐబీపీఎస్‌).. గ్రామీణ బ్యాంకుల్లో మొత్తం 9,053 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా డిగ్రీతోనే ఆఫీస్‌ అసిస్టెంట్, ఆఫీసర్‌ స్కేల్‌-1, 2, 3 ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. ఐబీపీఎస్‌.. సీఆర్‌పీ ఆర్‌ఆర్‌బీ పోస్టులు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం తదితర వివరాలు..
ibps rrb notification 2023 exam pattern and syllabus
  • ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్‌ విడుదల
  • 43 బ్యాంకుల్లో 9,053 పోస్ట్‌లకు ఎంపిక ప్రక్రియ
  • ఆఫీస్‌ అసిస్టెంట్, ఆఫీసర్‌ స్కేల్‌-1,2,3 ఉద్యోగాలు

ఎస్‌బీఐ మినహా దేశంలోని అన్ని జాతీయ బ్యాంకుల్లో క్లర్క్స్‌ నుంచి ఆఫీసర్స్‌ వరకు.. వివిధ ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియ చేపట్టే సంస్థ.. ఐబీపీఎస్‌. ఇది తాజాగా దేశంలోని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ)ల్లో పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

43 బ్యాంకులు.. 9053 పోస్టులు

ఐబీపీఎస్‌ ఇటీవల విడుదల చేసిన సీఆర్‌పీ ఆర్‌ఆర్‌బీ ద్వారా దాదాపు అన్ని రాష్ట్రాల్లోని గ్రామీణ బ్యాంకుల్లో 9053 పోస్టులను భర్తీ చేయనుంది. వీటిల్లో ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీపర్పస్‌) 5650; ఆఫీసర్‌ స్కేల్‌-1: 2563; ఆఫీసర్‌ స్కేల్‌-2 (అగ్రికల్చర్‌ ఆఫీసర్‌):118; ఆఫీసర్‌ స్కేల్‌-2(మార్కెటింగ్‌ ఆఫీసర్‌): 38; ఆఫీసర్‌ స్కేల్‌-2(ట్రెజరీ మేనేజర్‌): 16; ఆఫీసర్‌ స్కేల్‌-2(లా): 56; ఆఫీసర్‌ స్కేల్‌-2(సీఏ): 63; ఆఫీసర్‌ స్కేల్‌-2(ఐటీ): 106; ఆఫీసర్‌ స్కేల్‌-2(జనరల్‌ బ్యాంకింగ్‌): 367; ఆఫీసర్‌ స్కేల్‌-3: 76 పోస్టులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 916 ఖాళీలు భర్తీ చేయనున్నారు. 

చ‌ద‌వండి: IBPS RRB Notification 2023: ఐబీపీఎస్‌–ఆర్‌ఆర్‌బీల్లో 8612 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

పోస్ట్‌లు.. అర్హతలు

  • ఆఫీస్‌ అసిస్టెంట్‌(మల్టీ పర్పస్‌): గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. స్థానిక భాషతోపాటు కంప్యూటర్‌పై అవగాహన ఉండాలి. వయసు: జూన్‌ 1, 2023 నాటికి 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. 
  • ఆఫీసర్‌ స్కేల్‌1(అసిస్టెంట్‌ మేనేజర్‌): బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్‌ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్, పిసికల్చర్, అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ అండ్‌ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మేనేజ్‌మెట్, లా, ఎకనామిక్స్, అకౌంటెన్సీలో డిగ్రీ ఉత్తీర్ణులకు ప్రాధాన్యం ఉంటుంది. స్థానిక భాషపై అవగాహన తప్పనిసరి. దాంతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. వయసు: జూన్‌ 1, 2023 నాటికి 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
  • ఆఫీసర్‌ స్కేల్‌-2(జనరల్‌ బ్యాంకింగ్‌): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్‌ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్, పిసికల్చర్, అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ అండ్‌ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మేనేజ్‌మెట్, లా, ఎకనామిక్స్, అకౌంటెన్సీలో డిగ్రీ పాసైన వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఏదైనా బ్యాంకు లేదా ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్‌లో ఆఫీసర్‌గా రెండేళ్ల అనుభవం ఉండాలి. 
  • ఆఫీసర్‌ స్కేల్‌ 2(స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌): ఐటీ ఆఫీసర్‌: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్‌/కమ్యూనికేషన్‌/కంప్యూటర్‌ సైన్స్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగాల్లో డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. 
  • చార్టర్డ్‌ అకౌంటెంట్‌: ఐసీఏఐ నుంచి సీఏ ఉత్తీర్ణతతతోపాటు ఏడాది అనుభవం తప్పనిసరి. 
  • లా ఆఫీసర్‌: బ్యాచిలర్‌ ఆఫ్‌ లా కోర్సు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల్లో అడ్వకేట్‌గా రెండేళ్ల పని అనుభవం ఉండాలి. 
  • ట్రెజరీ మేనేజర్‌: సీఏ లేదా ఎంబీఏ ఫైనాన్స్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత విభాగంలో ఏడాది పని అనుభవం ఉండాలి. 
  • మార్కెటింగ్‌ ఆఫీసర్‌: ఎంబీఏ మార్కెటింగ్‌ స్పెషలైజేషన్‌ ఉత్తీర్ణత ఉండాలి. ఏడాది పని అనుభవం తప్పనిసరి. 
  • అగ్రికల్చరల్‌ ఆఫీసర్‌: అగ్రికల్చర్‌/హార్టికల్చర్‌/డెయిరీ/యానిమల్‌ హస్బెండరీ /ఫారెస్ట్రీ/వెటర్నరీ సైన్స్‌/అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌/పిసీ కల్చర్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. దీంతోపాటు రెండేళ్ల పని అనుభవం తప్పనిసరి. 
  • వయసు: ఆఫీసర్‌ స్కేల్‌-2 అన్ని పోస్ట్‌లకు జూన్‌ 1, 2023 నాటికి 21 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.
  • ఆఫీసర్‌ స్కేల్‌-3: కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్‌ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్, పిసికల్చర్, అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ అండ్‌ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మేనేజ్‌మెట్, లా, ఎకనామిక్స్, అకౌంటెన్సీలో డిగ్రీ అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. అయిదేళ్ల పని అనుభవం కూడా ఉండాలి. వయసు: జూన్‌ 1, 2023 నాటికి 21 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. 
  • రిజర్వేషన్‌ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ఎస్సీ/ఎస్టీలు ఐదేళ్లు, ఓబీసీలు మూడేళ్లు వయో సడలింపు పొందొచ్చు.
  • ఆయా కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే. వీరు జూన్‌ 21 నాటికి ఉత్తీర్ణత సాధించాల్సిన ఉంటుంది.

చ‌ద‌వండి: Previous Papers

ఎంపిక విధానం

  • ఆర్‌ఆర్‌బీ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌లో భాగంగా ఆయా పోస్ట్‌లను అనుసరించి వేర్వేరు విధానాల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 
  • ఆఫీస్‌ అసిస్టెంట్, ఆఫీసర్‌ స్కేల్‌-1 పోస్ట్‌లకు రెండు దశల రాత పరీక్ష(ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామినేషన్‌), ఇంటర్వ్యూ.. ఇలా మొత్తం మూడు దశల్లో నియామక ప్రక్రియ ఉంటుంది. 
  • ఆఫీసర్‌ స్కేల్‌-2, స్కేల్‌-3లకు మాత్రం రాత పరీక్షతోపాటు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీపర్పస్‌)

  • ఆఫీస్‌ అసిస్టెంట్‌(మల్టీ పర్పస్‌) ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్‌ తరహాలో ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. ఇందులో రీజనింగ్‌ 40 ప్రశ్నలు-40 మార్కులు, న్యూమరికల్‌ ఎబిలిటీ 40 ప్రశ్నలు-40 మార్కులు.. ఇలా మొత్తం 80 ప్రశ్నలు-80 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమ­యం 45 నిమిషాలు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధిస్తేనే మెయిన్‌ రాసేందుకు అనుమతి లభిస్తుంది.
  • ప్రిలిమ్స్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా రెండో దశలో మెయిన్‌ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్‌ కూడా ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటుంది. మొత్తం 200 ప్రశ్నలతో 200 మార్కులకు జరుగుతుంది. రీజనింగ్‌ 40 ప్రశ్నలు-50 మార్కులు, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ 40 ప్రశ్నలు-20 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌ 40 ప్రశ్నలు-40 మార్కులు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 40 ప్రశ్నలు-40 మార్కులు, న్యూమరికల్‌ ఎబిలిటీ 40 ప్రశ్నలు-50 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 
  • మెయిన్‌లో ప్రతిభ ఆధారంగా 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.

చ‌ద‌వండి: Bitbank

ఆఫీసర్‌ స్కేల్‌-1

  • ఆఫీసర్‌ స్కేల్‌-1 ప్రిలిమినరీ పరీక్ష.. ఆబ్జెక్టివ్‌ తరహాలో ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. ఇందులో రీజనింగ్‌ 40 ప్రశ్నలు-40 మార్కులు, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ 40 ప్రశ్నలు-40 మార్కులు చొప్పున మొత్తం 80 ప్రశ్నలతో 80 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 45 నిమిషాలు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధిస్తేనే మెయిన్‌కు అనుమతిస్తారు.
  • మెయిన్‌ ఎగ్జామినేషన్‌: మెయిన్‌లో రీజనింగ్‌ 40 ప్రశ్నలు-50 మార్కులు, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ 40 ప్రశ్నలు-20 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌ 40 ప్రశ్నలు-40 మార్కులు, ఇంగ్లిష్‌/హిందీ 40 ప్ర­శ్నలు-40 మార్కులు, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ 40 ప్రశ్నలు-50 మార్కులు.. ఇలా వివిధ విభాగాల్లో మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం రెండు గంటలు. 
  • ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్‌లకు సంబంధించి ఏదో ఒక లాంగ్వేజ్‌నే ఎంచుకోవాలి. అభ్యర్థులు ఎంచుకున్న లాంగ్వేజ్‌ నుంచే ఆ విభాగం ప్రశ్నలు అడుగుతారు. 
  • మెయిన్‌ ఎగ్జామ్‌లో ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్ట్‌కు ముగ్గురిని చొప్పున తుది దశ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. 

చ‌ద‌వండి: Study Material

ఆఫీసర్‌ స్కేల్‌- 2,3.. ఒకే రాత పరీక్ష

  • ఆఫీసర్‌ స్కేల్‌-2(జనరలిస్ట్,స్పెషలిస్ట్‌), ఆఫీసర్‌ స్కేల్‌-3 పోస్టులకు ఒకే రాత పరీక్ష నిర్వహిస్తారు. 
  • ఆఫీసర్‌(జనరల్‌ బ్యాంకింగ్‌)పోస్ట్‌లకు రీజనింగ్‌ 40 ప్రశ్నలు-50 మార్కులు, కంప్యూటర్‌ నాలె­డ్జ్‌ 40 ప్రశ్నలు-20 మార్కులు, ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌ 40 ప్రశ్నలు- 40 మార్కులు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌/హిందీ లాంగ్వేజ్‌ 40ప్రశ్నలు-40 మార్కు­లు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ 40ప్రశ్నలు-50 మార్కు­లు.. ఇలా మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.
  • ఆఫీసర్‌ స్కేల్‌-2(స్పెషలిస్ట్‌ కేటగిరీ) పోస్ట్‌లకు ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ 40 ప్రశ్నలు-40 మార్కులు, రీజనింగ్‌ 40 ప్రశ్నలు-40 మార్కులు, ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌ 40 ప్రశ్నలు-40 మార్కులు, ఇంగ్లిష్‌/హిందీ లాంగ్వేజ్‌ 40 ప్రశ్నలు-20 మార్కులు, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ 40 ప్రశ్నలు-20 మార్కులు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ 40 ప్రశ్నలు-40 మార్కులు.. ఇలా మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
  • ఆఫీసర్‌ స్కేల్‌-3 పోస్ట్‌లకు రీజనింగ్‌ 40 ప్రశ్నలు-50 మార్కులు, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ 40 ప్రశ్నలు-20 మార్కులు, ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌ 40 ప్రశ్నలు-40 మార్కులు, ఇంగ్లిష్‌/హిందీ లాంగ్వేజ్‌ 40 ప్రశ్నలు-40 మార్కులు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ 40 ప్రశ్నలు-50 మార్కులు..ఇలా వివిధ విభాగాల్లో 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. 
  • అన్ని పోస్ట్‌లకు సంబంధించి పరీక్షలు ఆబ్జెక్టివ్‌ విధానంలోనే జరుగుతాయి.
  • రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా 1:3 నిష్పత్తిలో(ఒక్కో పోస్ట్‌కు ముగ్గురిని చొప్పున) చివరి దశ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.

ప్రాక్టీస్‌తోపాటు వేగం

  • రీజనింగ్‌: కోడింగ్, డీకోడింగ్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్, పజిల్స్, ఇన్‌-ఈక్వాలిటీస్, ఆల్ఫాబెటికల్‌ సీక్వెన్సెస్, సిలాజిజమ్స్, బ్లడ్‌ రిలేషన్స్, డైరెక్షన్స్, స్టేట్‌మెంట్స్, కాజ్‌ అండ్‌ ఎఫెక్ట్స్, ఇన్‌పుట్‌ అవుట్‌పుట్స్‌ తదితర అంశాలపై దృష్టిపెట్టాలి. 
  • ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌: ఇందులో రాణించాలంటే.. గ్రామర్‌తోపాటు వొకాబ్యులరీ, రీడింగ్‌ కాంప్రహెన్షన్, సెంటెన్స్‌ కరెక్షన్స్, ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్, యాంటానిమ్స్,సినానిమ్స్‌పై పట్టు సాధించాలి. 
  • జనరల్‌ అవేర్‌నెస్‌: కరెంట్‌ అఫైర్స్, దేశ ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్‌ రంగంలో పరిణామాలు, మానిటరీ పాలసీ, రుణాలు, వడ్డీ రేట్లు, ఫైనాన్స్‌ రంగ అంశాలపై అవగాహన పెంచుకోవాలి. దాంతోపాటు జాతీయ,అంతర్జాయ పరిణామా­లు, కేంద్ర ప్రభుత్వ పథకాలు,ముఖ్యమైన ఘట నలు, తేదీలు, వ్యక్తుల గురించి తెలుసుకోవాలి. 
  • క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌/డేటా ఇంటర్‌ప్రిటేషన్‌: అర్థమెటిక్‌ అంశాలు, నంబర్‌ సిరీస్, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్స్‌ అంశాలను అధ్యయనం చేయాలి. 
  • ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌: ఆఫీసర్‌ స్కేల్‌-2 పోస్ట్‌లకు ఉండే ఈ విభాగంలో రాణించాలంటే..అభ్యర్థులు తమ అకడమిక్‌ అర్హతలకు సంబంధించిన అంశాలపై పట్టు సాధించాలి. 
  • కంప్యూటర్‌ నాలెడ్జ్‌: కంప్యూటర్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌(కీ బోర్డ్‌ షార్ట్‌ కట్స్, ఎంఎస్‌ ఆఫీస్, ఎంఎస్‌ ఎక్సెల్, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ తదితర అంశాల)పై అవగాహన పెంచుకోవాలి. 
  • ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌: తాజా బ్యాంకింగ్‌ రంగ పరిణామాలు, బ్యాంకింగ్‌ వ్యవస్థ విధానాలు, ఆర్థిక రంగంలో జరుగుతున్న తాజా పరిణామాల గురించి తెలుసుకోవాలి. 

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 21.06.2023
  • ప్రిలిమ్స్‌: ఆగస్ట్‌లో నిర్వహించే అవకాశం ఉంది. 
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.ibps.in/
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు వెబ్‌సైట్‌: https://www.ibps.in/crprrbxi

చ‌ద‌వండి: IDBI Bank Recruitment 2023: ఐడీబీఐ బ్యాంక్‌లో 1036 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date June 21,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories