గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఆర్‌ఈఐఎస్) నిర్వహిస్తున్న జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి మే 20న జరగనున్న ఏపీఆర్‌జేసీ డీసీ సెట్ దరఖాస్తుకు ఏప్రిల్ 24న ముగిసిన గడువును ఏప్రిల్ 28 వరకు పొడిగించినట్లు సంస్థ కార్యదర్శి ఆర్.నరసింహారావు ఓ ప్రకటనలో తెలిపారు.
ఏపీఆర్‌జేసీ డీసీ సెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
రాష్ట్రంలోని 10 జూనియర్ కళాశాలలు, నాగార్జున సాగర్‌లోని బాలుర డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి మే 20న ఏపీఆర్‌జేసీ డీసీ సెట్–2023తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 50 గురుకుల పాఠశాలల్లో 5,6,7,8 తరగతుల్లో ప్రవేశానికి ఏపీఆర్‌ఎస్ సీఏటీ–2023కు సైతం దరఖాస్తు గడువు పెంచినట్లు పేర్కొన్నారు. అర్హులు ఈ నెల 28లోపు ఏపీఆర్‌ఎస్.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్. ఇన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.