Skip to main content

Footwear Design Admissions: ఫుట్‌వేర్‌ డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు.. చివ‌రి తేదీ ఇదే!

రాయదుర్గం: ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎఫ్‌డీడీ) హైదరాబాద్‌లో అండర్‌ గ్రాడ్యుయేట్, పోస్ట్రుగాడ్యుయేట్‌ కోర్సులకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను కోరుతున్నామని ఎఫ్‌డీడీఐ హైదరాబాద్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నర్సింహుగారి తేజ్‌లోహిత్‌రెడ్డి (ఐఏఎస్‌) తెలిపారు.
Applications for admission to Footwear Design Courses

ఈ మేరకు ఫిబ్రవ‌రి 8న‌ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ఎఫ్‌డీడీఐలలో ప్రవేశాలకు దేశమంతటా నిర్వహించే అర్హత పరీక్షను ఆలిండియా సెలక్షన్‌ టెస్ట్‌–2025 (ఏఐఎస్‌టీ–2025) నిర్వహించి అందులో అత్యుత్తమ ప్రతిభ చాటిన వారికి అడ్మిషన్లు కల్పిస్తామన్నారు.

చదవండి: FDDI Admission 2025: ఎఫ్‌డీడీఐలో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు.. చివరి తేది ఇదే

దరఖాస్తు ఫారాలను ఏప్రిల్‌ 20వ తేదీ లోపు అందించాలని సూచించారు. హైదరాబాద్‌ రాయదుర్గంలోని ఎఫ్‌డీడీఐలో ఉన్న కోర్సులు, ఇతర వివరాల కోసం ఫోన్‌ నెంబర్‌ 9440471336లో సంప్రదించాలని సూచించారు.  

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 10 Feb 2025 11:00AM

Photo Stories