Free Education in Private Schools: ప్రైవేటు స్కూళ్లలో ‘ఉచిత’మెప్పుడు?

విద్యా హక్కు చట్టంలోని ఈ నిబంధన అమలుచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపినప్పటికీ.. అందుకోసం ఇంకా కార్యాచరణ ప్రణాళిక మాత్రం రూపొందించలేదు. దీనిని ఎలా అమలు చేయాలనే అంశంపై అధ్యయనం చేస్తున్నామని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
మరోవైపు కొన్ని కార్పొరేట్ స్కూళ్లు వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు మొదలు పెట్టాయి. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ స్కూళ్లల్లో అడ్మిషన్లు ముగింపు దశకు చేరాయి. 25 శాతం ఉచితంపై తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని ఆ సంస్థలు అంటున్నాయి. ప్రభుత్వం ఫీజులను రీయింబర్స్ చేస్తే పేదలకు ఉచితంగా సీట్లు ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని యాజమాన్యాలు చెబుతున్నాయి.
చదవండి: 100 Jobs for Freshers: టెక్ మహీంద్రాలో ఫ్రెషర్స్ కు 100 ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక!
ఎవరికి ఉచితం?
రాష్ట్రంలో దాదాపు 10 వేలకుపైగా ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయి. వీటిల్లో 38 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం అనాథలు, వికలాంగులకు 5 శాతం, ఎస్సీలకు 10, ఎస్టీలకు 4, బీసీ, మైనారీ్ట, అల్పాదాయ వర్గాల పిల్లలకు 6 శాతం కలిపి మొత్తం 25 శాతం సీట్లను ఉచితంగా ఇవ్వాలి.
అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధన అమలు తీరును విద్యాశాఖ పర్యవేక్షించాలి. స్థాయిని బట్టి ప్రైవేటు స్కూళ్లలో ప్రస్తుతం రూ.40 వేల నుంచి రూ.20 లక్షల వరకు వార్షిక ఫీజు వసూలు చేస్తున్నారు.
రూ.40 వేల లోపు ఫీజులుండే ప్రైవేటు స్కూళ్లల్లో ఆశించిన మేర అడ్మిషన్లు జరగవు. కాబట్టి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ చేస్తే ఈ పథకం అమలుకు సిద్ధమేనని చెబుతున్నారు. కార్పొరేట్ స్కూళ్లు మాత్రం రూ.20 లక్షల ఫీజు లావాదేవీలను రికార్డుల్లో చూపించకుండా, స్కూల్ డెవలప్‌మెంట్ ఫీజుగా వసూలు చేస్తున్నాయి. వీటికి ఎలాంటి రసీదులు ఇవ్వడం లేదు.
ఉచిత సీట్లిస్తే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ చేసినా ట్యూషన్ ఫీజుగా వసూలు చేసే రూ.2 లక్షల లోపే వస్తుందని ఆ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర సిలబస్‌తో నడిచే సీబీఎస్‌సీ, ఐసీఎస్‌ఈ వంటి స్కూళ్లపై రాష్ట్రానికి అంతగా ఆధిపత్యం ఉండదని అధికారులు అంటున్నారు.
![]() ![]() |
![]() ![]() |
కొన్ని రాష్ట్రాల్లో అమలు
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, తెలంగాణ, మరో మూడు రాష్ట్రాల్లో మాత్రమే 25 శాతం ఉచిత సీట్ల కేటాయింపు అమలు జరగడం లేదని అధికారులు తెలిపారు. మిగతా రాష్ట్రాల్లో ఈ పథకం వివిధ మార్గాల్లో అమలవుతోంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ చేస్తోంది. మరికొన్ని రాష్ట్రాల్లో ప్రైవేటు స్కూళ్లే స్వచ్ఛందంగా అమలు చేస్తున్నాయి.
కాగా, విద్యాహక్కు చట్టం ప్రకారం ఆవాసాలకు కిలోమీటర్ దూరంలో ప్రాథమిక పాఠశాల, మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్నతపాఠశాల లేకపోతే ఆయా విద్యార్థులకు ప్రైవేట్ బడుల్లో 25 శాతం సీట్లను కేటాయించాల్సి ఉంటుందని కొన్ని ప్రైవేటు స్కూళ్లు వాదిస్తున్నాయి.
అయితే, ఈ నిబంధనతో పనిలేదని విద్యాశాఖ చెబుతోంది. పథకం అమలుపై ఇటీవల ప్రభుత్వం నివేదిక కోరడంతో అధికారులు సమర్పించారు. 38 లక్షల్లో 25 శాతం మందికి ఉచితంగా సీట్లిస్తే దాదాపు 9 లక్షల మందికిపైగా విద్యార్థులు సీట్లు పొందుతారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తే ఈ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించాలి. ఇది ఆర్థికంగా గుదిబండ అవుతుందనే భావనతో ప్రభుత్వం ఉన్నదని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఫీజు రీయింబర్స్ చేయకుండా, ప్రైవేటు స్కూళ్లు సామాజిక బాధ్యతగా 25 శాతం ఉచితం అమలు చేసేలా చూడాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
IOCL Jobs 10th & ITI Qualification: పదోతరగతి, ఐటీఐ విద్యార్హతతో IOCLలో 246 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) మార్కెటింగ్ డివిజన్‌లో వివిధ ప్రదేశాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఫిబ్రవరి 23వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య: 246
పోస్టుల వివరాలు:
- జూనియర్ ఆపరేటర్ గ్రేడ్-1: 215
- జూనియర్ అటెండెంట్ గ్రేడ్-1: 23
- జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ గ్రేడ్-3: 08
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదోతరగతి/ఐటీఐ, ఇంటర్, డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 18 - 26 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు సడలింపు ఉంటుంది.
జీతం: జూనియర్ ఆపరేటర్, జూనియర్ అటెండెంట్ గ్రేడ్-1 పోస్టులకు రూ.23,000 - రూ.78,000, జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ గ్రేడ్-3 పోస్టుకు రూ.25,000 - రూ.1,05,000.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్టు, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తుకు చివరి తేదీ: 23-02-2025.
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్: https://iocl.com/