Skip to main content

TSCHE: చదువుకుంటూనే సంపాదన!

సాక్షి, హైదరాబాద్‌: నైపుణ్యంతో కూడిన డిగ్రీ కోర్సులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి.. అందుకనుగుణంగా ప్రణాళికను సిద్ధంచేస్తోంది.
TSCHE
చదువుకుంటూనే సంపాదన!

వచ్చే ఏడాది (2023–24) నుంచి ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేసే వీలుంది. ఈ క్రమంలో ఏప్రిల్‌ 28న వంద కాలేజీల ప్రిన్సిపల్స్, ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహిస్తున్నట్టు మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి తెలిపారు. ఏ కాలేజీలో ఏ కోర్సు సాధ్యమనేది చర్చించి, త్వరలో ప్రణాళికను ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పటికే సంప్రదాయ డిగ్రీ కోర్సుల స్థానంలో ఇంజనీరింగ్‌తో సమానంగా డేటా సైన్స్, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, కంప్యూటర్, ఆనర్స్‌ కోర్సులను అందుబాటులోకి తెచ్చారు. తాజాగా ప్రవేశపెట్టే నైపుణ్య కోర్సులు డిగ్రీ విద్య స్వరూప స్వభావాల్ని మారుస్తాయని, చదువుతూనే ఉపాధి పొందవచ్చని మండలి అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన విధివిధానాలనూ తెలంగాణ స్టేట్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ తయారుచేస్తోందని ప్రొఫెసర్‌ లింబాద్రి తెలిపారు. 

చదవండి: TSCHE: కొత్తగా సైబర్‌ సెక్యూరిటీ కోర్సు

ఏమిటీ కోర్సులు? 

కేంద్ర ప్రభుత్వ స్కిల్‌ ఇండియా పథకంలో భాగంగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ కొన్నేళ్లుగా సరికొత్త కోర్సులపై అధ్యయనం చేసి.. 14 నైపుణ్య కోర్సులకు రూపకల్పన చేసింది. వీటిలో రిటైల్‌ మేనేజ్‌మెంట్, క్రియేటివ్‌ రైటింగ్, ఈ–కామర్స్, లాజిస్టిక్స్, గేమింగ్‌ అండ్‌ యానిమేషన్‌ వంటి కోర్సులున్నాయి. స్కిల్‌ కోర్సులను రెండు రకాలుగా నిర్వహించాలని యోచిస్తున్నారు. ఫస్టియర్‌ నుంచే స్కిల్‌ కోర్సులుండేలా ఒక పథకం, రెండో ఏడాది నుంచి వీటిని అమలు చేయడం మరో విధానంగా తీసుకురానున్నారు.   

చదవండి: TSCHE: ఎంసెట్‌ విద్యార్హతల్లో మార్పులు?

చదివే సమయంలోనే స్టైపెండ్‌ 

డిగ్రీ చదివే సమయంలో స్కిల్‌ కోర్సులను ప్రాక్టికల్‌గా నేర్పుతారు. ఇందుకు కొన్ని సంస్థలతో ఉన్నత విద్యామండలి ఒప్పందం చేసుకుంటుంది. ఆయా సంస్థల్లో వారానికి మూడు రోజులు విద్యార్థి ప్రాక్టికల్‌గా శిక్షణ పొందుతారు. ఈ సమయంలో రూ.10 వేల వరకూ నెలకు ఉపకార వేతనం అందుతుంది. రాష్ట్రంలో మొత్తం 1,056 డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిలో తొలుత 103 ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో స్కిల్‌ కోర్సులు ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నారు.     

చదవండి: TSCHE: డిగ్రీ కోర్సుల్లో అమ్మాయిలదే హవా.. కోర్సుల వారీగా చేరికలు ఇలా..

Published date : 25 Apr 2023 03:10PM

Photo Stories