TSCHE: కొత్తగా సైబర్ సెక్యూరిటీ కోర్సు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: అండర్ గ్రాడ్యుయేషన్‌లో కొత్తగా సైబర్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ కోర్సును ప్రవేశపెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కసరత్తు వేగవంతం చేసింది.
2023–24 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ప్రకటించిన టీఎస్‌సీహెచ్‌ఈ... ఆ కోర్సు పాఠ్యాంశం, విధానాలు తదితరాల ఖరారు కోసం డీజీపీ కార్యాలయం, ఉస్మానియా, జేఎన్‌టీయూ, నల్సార్ యూనివర్సిటీల తో పాటు ఐఐటీ హైదరాబాద్‌లను ప్రతి పాది స్తూ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
చదవండి: Tech skills: సైబర్ సెక్యూరిటీ.. కెరీర్ అవకాశాలు, అర్హతలు, నైపుణ్యాలు అందుకునేందుకు మార్గాలు
ఇందులో భాగంగా జనవరి 19న టీఎస్‌సీ హెచ్‌ఈ కార్యాలయంలో ప్రత్యేక కమిటీ ప్రతినిధులతో సమావేశం జరిగింది. సైబర్ సెక్యూరిటీ అండ్ సైన్స్ కోర్సు విధివిధానాలపై చర్చించారు.
Published date : 20 Jan 2023 01:33PM