Skip to main content

Cyber ​​talk: మోసాలను లాక్‌ చేద్దాం!

సోషల్‌ మీడియా వేదికగా బ్లూ టిక్‌ మేనియా గురించి మనకు తెలిసిందే. దీని ఆధారంగానే మన సందేశం లేదా ఫొటో అవతలి వారు చూశారు అన్నది తెలిసిపోతుంది. మన ఆలోచనలను ప్రదర్శించడానికి, షేర్‌ చేయడానికి ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వేదిక ఇన్‌స్టాగ్రామ్‌. ఇది ఒక బిలియన్‌ కంటే ఎక్కువ ఉన్న వినియోగదారులతో కూడిన భారీ ప్లాట్‌ఫారమ్‌. అలాగే స్కామ్‌లు కూడా అంతే స్థాయిలో జరుగుతుంటాయి. అందులో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్‌ని పెంచుకోవడానికి, ఇన్వెస్ట్‌మెంట్స్‌ను రాబట్టడానికి, గివ్‌ అవే, రొమాన్స్‌ వంటి స్కామ్‌లకు పాల్పడటానికి స్కామర్‌లు రకరకాల మోసాలకు పాల్పడుతుంటారు. ఇన్‌ స్టాగ్రామ్‌లో బ్లూటిక్‌ పొందిన ప్రొఫైల్స్‌ అధికంగా ఉంటాయి. వాటికి ఉన్న ఆదరణను బట్టి సైబర్‌ నేరగాళ్లు రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు. 
Let's lock the cheats!
Let's lock the cheats!


వారు మిమ్మల్ని ఆపరేట్‌ చేసేలా మారవచ్చు. మిమ్మల్ని మోసగించడానికి, మీ డబ్బును దొంగిలించడానికి, కొత్త మోసపూరిత మార్గాలను ఆలోచించడానికి అనువైన అవకాశాల కోసం పొంచి ఉంటారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్ల ఆసక్తి, ఆశను ఉపయోగించుకుని చేసే ఈ మోసాలను అడ్డుకోవడానికి ఎవరికి వారు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  
స్కామర్ల అంతిమ లక్ష్యం మీ ఖాతా నుంచి డబ్బు కోసం మిమ్మల్ని బ్లాక్‌ మెయిల్‌ చేయడం లేదా మీ పరువు తీయడం. 

 

Also read: Artificial Intelligence: ఏఐతో సైబర్‌ సెక్యూరిటీకీ లాభాలు

కొన్ని సాధారణ మోసాలు :
(ఎ) మీ పాస్‌వర్డ్‌ను మార్చడం, మీ స్వంత అకౌండ్‌ నుండి మిమ్మల్ని లాక్‌ చేయడం (బి) వ్యక్తిగత డేటాను దొంగిలించడం (అనగా, ఫోన్‌ నంబర్, ఇ–మెయిల్, అనుచరుల వివరాలు మొదలైనవి). (సి) స్కామ్‌ ప్రకటనలను పోస్ట్‌ చేయడం. (డి) మీలా నటించి, మీ అనుచరులకు మాల్వేర్‌ ప్రభావిత లింక్‌లను పంపడం. (ఇ) మీలా నటించి, డబ్బు కోసం మీ అనుచరులకు సందేశాలు పంపడం.

Also read: search-image Cyber Safe : పిల్లల ఇంటర్నెట్ వాడకాన్ని గమనించాలి

ఇన్‌ స్టాగ్రామ్‌ మోసాలలో కొన్ని: 
ఫిషింగ్‌ స్కామ్‌లు: స్కామర్‌లు మీకు అనుమానాస్పద లింక్‌లను ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా డైరెక్ట్‌ మెసేజ్‌ లేదా ఇ–మెయిల్‌ ద్వారా పంపుతారు. దీని ద్వారా మీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాకు అనుమతి పొందడానికి ప్రయత్నిస్తారు. అక్కడ బాధితులు నకిలీ ఇన్‌ స్టాగ్రామ్‌ లాగిన్‌ పేజీలో యూజర్‌ నేమ్, పాస్‌వర్డ్‌ను ఇవ్వడం ద్వారా మోసపోతారు. స్కామర్‌లు మీ లాగిన్‌ వివరాలను తెలుసుకుని ఉంటే, వారు మీ వ్యక్తిగత సమాచారాన్ని (అంటే ఫోన్, ఇ–మెయిల్‌ మొదలైనవి) యాక్సెస్‌ చేయవచ్చు లేదా మార్చవచ్చు. మీ సొంత ఖాతా నుండి మిమ్మల్ని లాక్‌ చేయడానికి మీ పాస్‌వర్డ్‌ను కూడా మార్చవచ్చు.

Also read: search-image Cyberattack : మీరు జాబ్‌ కోసం వెతుకుతున్నారా..? అయితే వీరి మోసాల నుంచి తప్పించుకోండిలా..

కొన్ని ఫిషింగ్‌ వ్యూహాలు: 
(ఎ) ఇన్‌స్టాగ్రామ్‌ నుండి అధికారిక కాపీరైట్‌ ఉల్లంఘన హెచ్చరికలుగా పేర్కొంటున్న సందేశాలను పంపడం (బి) నకిలీ ఇన్‌ ఫ్లుయెన్సర్‌ స్పాన్సర్‌లు, స్కామర్‌లు ఒక బ్రాండ్‌గా నటిస్తారు. ఇన్‌ ఫ్లుయెన్సర్‌లకు ప్రకటనల ఒప్పందాన్ని అందిస్తారు. (సి) ఇన్‌స్టాగ్రామ్‌ నుండి బ్లూ టిక్‌ నిర్ధారణకు కేవైసీ ఉపయోగిస్తారు. పైన పేర్కొన్న అన్ని సందర్భాల్లో, మీకు చిన్న లింక్‌లు పంపి, మీ వివరాల యాక్సెప్టెన్సీ కోరుతారు. 

రొమాన్‌ ్స స్కామ్‌లు: 
స్కామర్‌లు నకిలీ ఆన్‌ లైన్‌ ఖాతా నుంచి మీతో సంభాషణను కొనసాగిస్తారు. కాలక్రమేణా బాధితుడితో నమ్మకాన్ని పెంచుకుంటారు. ఆపై వారి నమ్మకాన్ని దుర్వినియోగం చేయడం ప్రారంభిస్తారు. అనుకున్న లక్ష్యం చేరాక స్కామర్‌ వీసాలు, విమానాలు, ప్రయాణ ఖర్చులు, ఆసుపత్రి ఖర్చులు.. ఇలా అన్నింటిæ కోసం డబ్బు అడగడం ప్రారంభిస్తాడు.

Also read: Facebook: నేరాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఫేస్‌బుక్‌


బహుమతుల స్కామ్‌లు : 
ఇన్‌ స్టాగ్రామ్‌ ఇన్‌ ఫ్లుయెన్సర్‌లు తరచుగా బహుమతులను ఇస్తారు. కొంతమంది అదృష్ట విజేతలకు ఉచిత ఉత్పత్తులు లేదా సేవలను అందిస్తారు. ఫాలోవర్లు డిజైనర్‌ దుస్తులు, ఖరీదైన ల్యాప్‌టాప్‌లు, ఎయిర్‌ పాడ్‌లు మొదలైనవాటిని గెలుచుకునే అవకాశం ఉంది. (బహుమతులను స్వీకరించడానికి, బాధితుడు షిప్పింగ్‌ రుసుము చెల్లించాలి లేదా చట్టవిరుద్ధ ప్రయోజనాల కోసం ఉపయోగించగల వ్యక్తిగత సమాచారాన్ని అందించాలి)

నకిలీ అమ్మకాలు:
ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ/రెప్లికా వస్తువులను అమ్మడం అనేది ఒక భారీ స్కామ్‌. ఇది వినియోగదారు ఖాతాలు, ప్రకటనలలో బలంగా ఉంటుంది. కొనుగోలుదారులు త్వరగా పని చేయడానికి వారు అత్యవసరాన్ని (అంటే పరిమిత కాలపు ఆఫర్‌లు) సృష్టిస్తారు. స్కామర్‌లు ఎక్కువగా సురక్షితంగా లేని పద్ధతుల ద్వారా చెల్లింపును అభ్యర్థిస్తారు.

Also read: Online Safety: ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ ఎంత భద్రం?

ఫేక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్కామ్‌లు:
కేవలం చిన్న పెట్టుబడికి గొప్ప రాబడిని ఇస్తామని మీకు వాగ్దానం చేస్తారు. డబ్బు చెల్లించేంతవరకూ అందించిన యాక్సెస్‌ (అంటే, వెబ్‌సైట్‌ లేదా యాప్‌) వాస్తవికంగా కనిపిస్తుంది, బాగా పని చేస్తుంది కూడా. అయితే ఇది పూర్తిగా నకిలీ, మీ పెట్టుబడులు బాగా పని చేస్తున్నాయని, మీరు వదులుకోలేని విధంగా నకిలీ డేటాను ప్రొజెక్ట్‌ చేస్తుంది. వీటిలో ఎక్కువ భాగం పోంజీ పథకాలు, ఎగ్జిట్‌ స్కామ్‌లు ఉంటాయి.

మన సామాజిక ప్రొఫైల్‌లలో మనకు ఎంత మంది అనుచరులు ఉన్నారు, వారి ఇష్టాలు ఏంటి అనే విషయాలను తరచూ చూస్తుంటాం. దీని ఆధారంగా స్కామర్‌లు వారి నుంచి ప్రయోజనాన్ని పొందే విధంగా తమ ఉత్పత్తులు లేదా ప్రకటనలను విడుదల చేస్తుంటారు. ఎక్కువ లైక్‌లు, ఫాలోవర్లను పొందేందుకు నామమాత్రపు ధరలకు వస్తువుల్ని, సేవలను ఆఫర్‌ చేస్తుంటారు. ఈ వాగ్దానాలు చాలా వరకు నిజం కావని నమ్మాలి. 

Also read: Cyber Security: మహిళలే లక్ష్యం... సైబర్‌ సేఫ్టీ పాయింట్స్‌ ఇవే

స్కామర్‌ని ఇలా గుర్తించండి

  •      స్కామర్‌లు నకిలీ ఖాతా ఉన్నవారై, మీ ఫ్రెండ్స్‌ జాబితాలో ఉన్నట్టు చూపుతారు.  
  •      వీరి లిస్ట్‌లో చాలా తక్కువ మంది అనుచరుల సంఖ్య ఉంటుంది.
  •      అకౌంట్‌ లేదా లింక్‌లో సాధారణ వ్యాకరణం లేదా భాషా లోపాలను ఉంటాయి.
  •      చాలా ప్రొఫైల్‌లు ఇటీవల కొత్తగా క్రియేట్‌ చేసినవై ఉంటాయి.
  •      బహుమతిని అందుకోవడానికి డబ్బు (అడ్వాన్‌ ్స ఫీజు లేదా రిజిస్ట్రేషన్‌ ఫీజు) పంపమని అడుగుతారు.
  •      ప్రొఫైల్స్‌ ఫీడ్‌ క్వాలిటీ చాలా తక్కువగా ఉంటుంది.
  •      వారి ఇ–మెయిల్‌ ఖాతాతో మిమ్మల్ని కమ్యూనికేట్‌ చేస్తారు.
  •      కొన్నిసార్లు ఇ–మెయిల్‌ ఖాతాల నుండి కాకుండా టెక్ట్స్‌ మెసేజ్‌ల ద్వారా వివరాలను అడుగుతారు.

Also read: Online Gambling: ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌... యాప్స్‌పై అవగాహన..

సురక్షితంగా ఉండటానికి...
∙బలమైన సంక్లిష్ట పాస్‌వర్డ్‌ను (సంఖ్య , పెద్ద అక్షరాలు, ప్రత్యేక అక్షరాలతో) సెట్‌ చేయండి.

  • ధ్రువీకరించబడిన బ్రాండ్‌ అకౌంట్‌ల నుండి మాత్రమే షాపింగ్‌ చేయండి.
  • మీ లాగిన్‌ కార్యకలాపాలను తరచుగా పర్యవేక్షించండి.
  • మీరు ఇచ్చిన థర్డ్‌ పర్సన్‌ యాక్సెస్‌ను తరచుగా సమీక్షించండి.
  • ఇన్‌ స్టాగ్రామ్‌లో నేరుగా లాగిన్‌ అవ్వండి. ధ్రువీకరించని థర్డ్‌ పార్టీ యాప్‌లను ఎప్పుడూ ఉపయోగించవద్దు. 
  • వచ్చిన షార్ట్‌ లింక్స్‌ను https://isitphishing.org/, https://www.urlvoid.com/ లో చెక్‌ చేయండి. 
  • మీ గోప్యతా సెట్టింగ్‌లను కాన్ఫిగర్‌ చేయండి. సరిగా లేని కంటెంట్‌ ఏదైనా ఉంటే దానిని https://help.instagram.com/116024195217477 కి రిపోర్ట్‌ చేయండి. 
  • https://help.instagram.com/192435014247952 తెలియజేయండి. 
  • పేజీ హ్యాక్‌ అయితే, దానికి సంబంధించిన సాయం కోసం  https://help.instagram.com/368191326593075   https://help.instagram.com/44666317538

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 13 Oct 2022 05:45PM

Photo Stories