cyber awareness: సైబర్ మోసానికి గురైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
ఖలీల్‌వాడి: నగరంలోని ఒకటో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌కు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి నార్కోటిక్ పోలీసుల పేరిట సైబర్ మోసానికి పాల్పడినట్లు ఎస్‌హెచ్‌వో విజయ్‌బాబు శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. సాప్ట్‌వేర్ ఉద్యోగికి సెడెక్స్ కొరియర్ కంపెనీకి చెందిన వారిమని మీరు పంపిన పార్సల్‌లో మత్తు మందులు ఉన్నాయని, ఈ కేసులో నార్కోటిక్ పోలీసులు ఇన్వాల్ అయ్యారని చెప్పారు. దీనికి మీ రెండు బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు వేయాలని తెలుపగా రూ.1,97,778 వేసినట్లు తెలిపారు. వారిపై అనుమానం రావడంతో తాను సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు సమాచారం అందించారు.
ప్రజలు ఇలాంటి కాల్స్ వస్తే డబ్బులు వేయొద్దని ఎస్‌హెచ్‌వో సూచించారు. తాము సైబర్ మోసానికి గురైనట్లు తెలిస్తే వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.