Lok Adalat: లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలి
Sakshi Education
వరంగల్ క్రైం: ఈనెల 9న కమిషనరేట్ పరిధి న్యాయ స్థానాల్లో జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ.రంగనాథ్ కక్షిదారులకు సూచించారు. జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ పడదగు క్రిమినల్, సివిల్ కేసులతో పాటు భూ తగాదా, చిట్‌ఫండ్, రోడ్డు ప్రమాద, ఎక్సైజ్, వివాహ, కుటుంబ తగాదాలు, ట్రాఫిక్ ఈ చలాన్ కేసులతో పాటు ఇతర రాజీ పడదగు కేసులను కక్షిదారులు రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని సూచించారు. ముఖ్యంగా ట్రాఫిక్ కేసులకు సంబంధించి డ్రంకెన్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ కేసులను ఈ అదాలత్ ద్వారా వేగంగా పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు.
ఇవీ చదవండి: 23 ఏళ్లకే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన శ్రీకాకుళం కుర్రాడు
చదవండి: నెట్టింట వైరలవుతున్న ఆటోవాలా ఇన్ఫిరేషన్ జర్నీ... ఎందుకో మీరు ఓ లుక్కేయండి.!
Published date : 05 Sep 2023 02:59PM