UPSC Civils 568th Ranker Kiran Saiempu Success Story: సివిల్స్‌లో 5సార్లు ఫెయిల్.. చివరి ప్రయత్నంలో 568వ ర్యాంకుతో ఐపీఎస్‌గా..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ 2023 పరీక్ష తుది ఫలితాల్లో వరంగల్‌కు చెందిన సయింపు కిరణ్ 568వ ర్యాంకు సాధించారు. ఐపీఎస్ కోసం ఐదుసార్లు ప్రయత్నాలు చేసినా ఆయనకు విజయం దక్కలేదు. అయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా, పట్టు వదలని విక్రమార్కుడిలా ఆరవసారి సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. చివరి ప్రయత్నంలో సివిల్స్‌కు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సయింపు కిరణ్‌తో సాక్షి ఎడ్యుకేషన్. కామ్ స్పెషల్ ఇంటర్వ్యూ.
సివిల్ సర్వీసెస్ 2023 ఫలితాల్లో 568వ ర్యాంకు రావడంపై మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?
చాలా సంతోషంగా ఉంది. ఇది నా చివరి ప్రయత్నం. ఆరోసారి నాకు విజయం వరించింది. నా కోరిక నెరవేరింది.
మీ ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ గురించి చెప్పండి
నేను 2017లో ఐఐటీ ఢిల్లీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను. అప్పట్నుంచి సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నాను. గతంలో నాకు CAPF,AAIలో ఉద్యోగాలు వచ్చినా వదులుకున్నాను. ప్రస్తుతం నేను ఇండియన్ పోస్టల్ సర్వీసెస్‌లో ఫీల్డ్ అటాచ్‌మెంట్‌లో పని చేస్తున్నాను. ఓవైపు ఉద్యోగం చేస్తూనే, మరోవైపు సివిల్స్‌కు సన్నద్ధమయ్యాను. చివరి ప్రయత్నంలో నాకు 568వ ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉంది.
ట్యూషన్లు చెప్పి..
రోజూ కొంత సమయం కేటాయించి ప్రిపేరై విజయం సాధించా. సివిల్స్ రాయడానికి నాకు ఇంకో అవకాశం లేదు. చివరి ప్రయత్నంలో విజయం సాధించా. మాది సయింపు కిరణ్‌ది మధ్య తరగతి కుటుంబం. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతూ మరో వైపు యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఆన్‌లైన్‌లో ట్యూషన్లు చెప్పి సొంత ఖర్చులు వెళ్లదీసుకున్నాను. ఒకవైపు ప్రిపరేషన్.. మరో వైపు బోధన ఐపీఎస్ సాధించడంలో అనుకూలించాయి. నా ఆన్‌లైన్ క్లాసులకు అటెండ్ అయిన పలువురు ఉన్నత ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
ఐదుసార్లు అపజయాలు ఎదురైనా పట్టువదలని విక్రమార్కుడిలా మళ్లీ ప్రయత్నించారు. దీని గురించి ఏం చెప్తారు?
ఐపీఎస్ కావడం నా కల. దానికోసం ఐదుసార్లు ప్రయత్నించినా నాకు విజయం దక్కలేదు. గతేడాది సివిల్ సర్వీసెస్‌లో రెండు మార్కులతో కోల్పోయాను. ఈసారి మరింత పట్టుదలతో కష్టపడి చదివాను. ఈ ప్రాసెస్‌లో చాలా కుంగిపోతుంటాం. కానీ మనపై మనకు నమ్మకం ఉంటే దేన్నైనా సాధించగలం.
Tags
- UPSC Civils 2023 Ranker Success Stories
- UPSC Civils 2023 Ranker Success Stories in Telugu
- upsc interview result 2023 out news
- Competitive Exams Success Stories
- UPSC Civils 2023 Top Ranker Success Stories in Telugu
- SuccessStory
- upsc civils final results 2023 out news telugu
- upsc civils final results 2023 released
- Saimpu Kiran
- Warangal
- upsc civil services 2023 final result
- Civil Services Success
- Special interview
- sakshi education