Transfers and Promotions: ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపట్టాలి..!
విద్యారణ్యపురి: రాష్ట్రంలో పార్లమెంట్, నల్లగొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం హనుమకొండలోని సంఘం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల పదోన్నతులకు ఆటంకంగా ఉన్న టెట్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినందున వెంటనే బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు.
Tenth Advanced Supplementary: అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల సన్నద్ధం కోసం ఆదేశాలు జారీ..!
2010 కంటే ముందు ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్, రాష్ట్ర కమిటీ బాధ్యులు బద్దం వెంకటరెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ రవీందర్‌రాజు, పెండెం రాజు, సి.సుజన్ ప్రసాద్‌రావు, మేకరి దామోదర్, ఎస్‌ఏ రవూఫ్, సీహెచ్ లింగారావు, సీఎస్‌ఆర్ మల్లిక్ పాల్గొన్నారు.
Skill Development Centers: కొత్తగా స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల ఏర్పాటు..!
Tags
- transfers
- promotions
- Teachers
- Elections
- TET
- State Chief Secretary Chava Ravi
- Schools and Colleges
- post elections
- Telangana United Teachers Federation
- Education News
- Sakshi Education News
- hanmakonda news
- Vidyaranyapuri
- TSUTF
- ChavaRavi
- Government
- promotions
- Teachers
- Parliament
- Nalgonda
- Warangal
- Khammam
- Elections
- Graduation
- State
- mlc