Skip to main content

Cyber Safe : పిల్లల ఇంటర్నెట్ వాడకాన్ని గమనించాలి

Internet Safety for Children
Internet Safety for Children

దసరా నవరాత్రుల సమయంలో అమ్మవారిని వివిధ రూపాలలో  కొలుస్తుంటాం. ఈ పూజలన్నీ మనచుట్టూ, మనలోనూ ఉన్న చెడును సంహరించి, జీవితాలను బాధ్యతగా మలచుకోమని సూచన ఇస్తున్నట్టుగా ఉంటాయి. ఇదే విషయాన్ని టెక్నాలజీ విషయంలో తీసుకుంటే... పిల్లలు డిజిటల్‌ రాక్షసులుగా మారకుండా, అలాంటి రాక్షసుల నుంచి ఎలా కాపాడుకోవాలో ఇంట్లో అమ్మలూ, స్కూల్‌లో టీచర్లూ  పిల్లలకు సూచనలు ఇస్తే .. ఎన్నో సమస్యలకు అడ్డుకట్ట వేయచ్చు.  ఐఫోన్‌ లు, ఆండ్రాయిడ్‌లు రాకముందు, స్మార్ట్‌ఫోన్‌ లపై అంతగా చర్చ లేదు. పాఠశాలల్లో సాంకేతికత అనేది ఇప్పుడు చాలా సర్వసాధారణమైపోయింది. ఆన్‌ లైన్‌ ప్లాట్‌ఫారమ్‌ల ప్రయోజనాలను ఉపయోగించుకుంటూ విద్యార్థుల డేటాను సురక్షితంగా ఉంచడానికి, డిజిటల్‌ టెక్నాలజీతో వారి సామర్థ్యాన్ని ఎలా అంచనా వేయాలో, తమను తాము రక్షించుకోవడం ఎలాగో నేర్పడానికి ఉపాధ్యాయులూ సిద్ధంగా ఉండాలి. 

Also read: Cyber Security: మహిళలే లక్ష్యం... సైబర్‌ సేఫ్టీ పాయింట్స్‌ ఇవే

ప్రమాదాలు పలు విధాలు... 
స్కూల్లో... 
(ఎ) సైబర్‌–సేఫ్‌ క్లాస్‌రూమ్‌ని ఏర్పాటు చేయాలి, విద్యార్థుల ప్రైవేట్‌ డేటాను రక్షించడంలో ఫస్ట్‌ లెవల్‌ రక్షణ వ్యూహాలను కలిగి ఉండాలి 
(బి) విద్యార్థులకు ఆన్‌ లైన్‌ గోప్యత భద్రతలో తీసుకోవాల్సిన ప్రాథమికాంశాలను బోధించాలి 
(సి) తరగతిలో, ఇంట్లో టెక్నాలజీని వాడటం ప్రయోజనకరంగా ఉండాలే తప్ప, అన్నింటిని దూరం చేసేలా ఉండకూడదు.  
(డి) టెక్నాలజీని మితిమీరి ఉపయోగించడం వల్ల కలిగే నష్టాల గురించి, అది సంబంధాలు, భవిష్యత్తు కెరీర్‌లు, వ్యక్తిగత జీవితాలను ఎలా దెబ్బతీస్తుందో తెలియజేయాలి 

Also read: Online Safety: ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ ఎంత భద్రం?

టీచర్లు పిల్లల తల్లిదండ్రుల అంగీకార పత్రాన్ని తీసుకోవాలి 
మీ పిల్లలకు ఏదైనా ఇబ్బంది కలిగించే విషయం ఇంటర్నెట్‌లో కనిపిస్తే ఏమి చేయాలో వారితో మాట్లాడాలి. మీరు వారితో కలివిడిగా లేకపోతే, మీరు వారి సమీపంలోకి వెళ్లినప్పుడు వారు ల్యాప్‌టాప్‌ మూసివేస్తారు లేదా స్క్రీన్‌ ను ఆఫ్‌ చేస్తారు. టీచర్లు తమ పిల్లలకు ఎంత స్క్రీన్‌ సమయం సరిపోతుందో పరిశీలించడానికి తల్లిదండ్రులతో తప్పనిసరిగా ఇంటరాక్ట్‌ కావాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు తెలిసుండాలి. అవి.. 

Also read: Facebook: నేరాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఫేస్‌బుక్‌

1. అన్ని అప్లికేషన్‌ లు, గేమింగ్, బ్రౌజర్‌లు లోపలే కొన్ని నియంత్రణలను కలిగి ఉంటాయి, ఇవి మీ పిల్లలు ఆన్‌ లైన్‌ లో గడిపే సమయాన్ని పరిమితం చేయడానికి, పెద్దలు వాడే టెక్నాలజీలో పిల్లల జోక్యం పరిమితంగా ఉండాలి. అలాగే, పిల్లలు ఉపయోగించే షాపింగ్, చాటింగ్‌ వంటి ఫంక్షన్‌ లను స్విచ్‌ ఆఫ్‌ చేయడానికి మీకు యాక్సెస్‌ ఉండాలి. 
2. అన్ని అప్లికేషన్‌ లు, గేమింగ్, ఈ కామర్స్‌ సైట్‌లు తమ వినియోగదారులకు షాపింగ్, అదనపు పాయింట్‌లను కొనుగోలు చేయడం, ఇతర అదనపు ప్రయోజనాలను అందిస్తాయి. పిల్లలు పెద్దలకు తెలియకుండానే సులభంగా కొనుగోళ్లు చేయవచ్చు. అందుకని, యాప్‌ కొనుగోళ్లను ఆపేయాలి.
3. పిల్లలకు ఆన్‌ లైన్‌ ప్రమాదాల గురించి తెలియదు. మీరు రోజులో కొంత సమయాన్ని పిల్లలతో గడుపుతారు కాబట్టి, ఆ సమయం లో భవిష్యత్తులో కెరీర్‌ను ప్రభావితం చేసే సైబర్‌ బెదిరింపు, గోప్యత, ఆన్‌ లైన్‌ పరువు గురించి తెలియజేయాలి.
4. ఆన్‌ లైన్‌ లో కొత్త గేమ్‌లు, వెబ్‌సైట్‌లకు సైన్‌ అప్‌ చేసేటప్పుడు మీ పిల్లలు ఉపయోగించగల సాధారణ ఇ మెయిల్‌ చిరునామాను సెటప్‌ చేయండి. (అనగా కుటుంబ సభ్యులందరికీ వారి ఇ మెయిల్‌ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌ తెలుసుండాలి)
5. మీ గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ లో ‘గూగుల్‌ సేఫ్‌ సెర్చ్‌’ని యాక్టివేట్‌ చేయడం ద్వారా సెర్చ్‌ ప్రశ్నలకు ప్రతిస్పందనగా అనుచితమైన కంటెంట్‌ను వదిలించుకోవడానికి లేదా పిల్లల కోసం https://www.kiddle.co వంటి సెర్చ్‌ ఇంజిన్‌ లను ప్రత్యామ్నాయంగా ఉపయోగించండి. 

Also read: Aadhar biometric locking: నకిలీలలు - ముద్ర కాని ముద్ర

యాంటీ ర్యాగింగ్, జెండర్‌ ఈక్వాలిటీ కౌన్సిల్‌ మాదిరిగానే ఈ రోజుల్లో డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ కౌన్సిల్‌ తప్పనిసరి. ఈ కౌన్సిల్‌ పిల్లలకు మంచి డిజిటల్‌ పరిశుభ్రత, సైబర్‌ నైతికతను పెంపొందించడానికి సహాయపడుతుంది. తరాలు మారాయి. కొత్త కొత్త సాంకేతికత రూపుకడుతోంది. పిల్లల ఆలోచనా ధోరణి మారుతోంది. అవగాహనారాహిత్యంతో ఉన్న పిల్లల ఎదుగుదలను సరి చేయకపోతే భవిష్యత్తు సమాజం సమస్యాత్మకంగా మారనున్నది. ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే పెద్దలే జాగ్రత్త వహించాలి.                        

Also read: Online Gambling: ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌... యాప్స్‌పై అవగాహన..
 
పిల్లలు ఆన్‌ లైన్‌ లో ఏం చేస్తారు...
దాదాపుగా ప్రీ–టీన్స్, టీనేజ్‌ పిల్లల రోజువారీ జీవితంలో ఇంటర్నెట్‌ భాగమైపోయింది. చాలా మంది యుక్త వయస్కులు స్మార్ట్‌ఫోన్‌ లేదా టాబ్లెట్‌ని ఉపయోగిస్తారు. ఇంచుమించు అందరికీ ఇంటర్నెట్‌ ఉంటుంది. అనేక రకాల సోషల్‌ నెట్‌వర్కింగ్, గేమింగ్‌ సైట్‌లను ఉపయోగిస్తున్నారు. పిల్లలు ఇతరుల రహస్యాలను బయటపెట్టడం, లింక్‌ అప్‌లు, హుక్‌ అప్‌లు, ద్వేషం.. సర్వసాధారణం. వీరిలో మరొక చీకటి కోణం కూడా గమనించాలి. సాధారణంగా సామాజిక ప్లాట్‌ఫారమ్‌లలో కన్ఫెషన్‌ పేజీలు పెద్దవాళ్లు క్రియేట్‌ చేసినవి ఉంటాయి. దీనిని ఇప్పుడు పిల్లలు టీచర్లు, హెడ్మాస్టర్లపై ప్రేమ, సరస వ్యాఖ్యలను చేయడం చూస్తుంటే వారి భవిష్యత్తుపై ఆందోళన కలుగుతుంది. అందుకని, టీచర్లు – తల్లిదండ్రులు ఈ విషయాలపై మాట్లాడుకొని, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ వారి పిల్లల భవిష్యత్తు జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో టీచర్లు తెలియజేయాలి. 

Also read: ASCI: ప్రకటనల్లో నేటి మహిళ!

1. సమాచారం : (ఎ) పిల్లలు వాడే కమ్యూనికేషన్‌ సాధనాలేమున్నాయి, వాటి సమాచారాన్ని తల్లిదండ్రులు తప్పనిసరిగా చూడాలి. (బి) మూలాన్ని తనిఖీ చేయాలి. (సి) ఇన్ఫర్మేషన్‌ నుంచి చెక్‌ చేయాలి (డి) సమాచారాన్ని ధ్రువీకరించాలి. (ఇ) సమాచారాన్ని నమ్మాలి. (ఎఫ్‌) సమాచారాన్ని పంచుకోవాలి.
2. ప్రభావం : తల్లిదండ్రులు తప్పనిసరిగా పర్యవేక్షించాలి (ఎ) మీ పిల్లల డిజిటల్‌ కార్యకలాపాలు వారికి మంచి లేదా చెడుగా ఎలా అనిపిస్తాయి. (బి) బ్యాలెన్‌ ్స, క్రాస్‌ చెక్‌ ఉందా... అని చూడాలి. 
3. సూచన: వీటన్నింటి చివరలో గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన పాఠం మీ సొసైటీలో సాంకేతికంగా సురక్షితంగా ఉండాలంటే .. పిల్లలు ఇతరుల నుండి ఏ సూచనలను తీసుకుంటున్నారు, ఎవరు సూచనలు ఇస్తున్నారు... అనేది తెలుసుకుని జాగ్రత్త పడాలి. ఏమరపాటుగా ఉంటే అది ప్రతి ఒక్కరి భద్రతకు భంగం కలిగించవచ్చు. 

ఇన్‌పుట్స్‌: అనీల్‌ రాచమల్ల, డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్, ఎండ్‌ నౌ ఫౌండేషన్‌

Also read: Weekly Current Affairs (Persons) Bitbank: DRDO కొత్త ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?

Published date : 29 Sep 2022 08:03PM

Photo Stories