Gurukul School Admissions : గురుకుల పాఠశాలలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల.. ఇదే చివరి తేది
Sakshi Education
తిరుపతి అర్బన్ : జిల్లాలోని అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సమన్వయకర్త ఎం.గీత తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశానికి బాలురు, బాలికలు మార్చి 6వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
Gurukul School Admissions
5వ తరగతి అడ్మిషన్‌కు ఏప్రిల్ 4వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు. ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశానికి 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని వివరించారు. అదనపు సమాచారం కోసం ఆయా ప్రాంతాల గురుకుల విద్యాలయ అధికారులను సంప్రదించాలని సూచించారు.