Skip to main content

GAT B 2025: గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (జీఏటీ–బీ)–2025.. దరఖాస్తులకు చివరి తేది ఇదే!

సాక్షి ఎడ్యుకేష‌న్‌: నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ), రీజనల్‌ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ(ఆర్‌సీబీ)తో కలిసి దేశంలోని ప్రముఖ యూనివర్శిటీల్లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంటెక్‌ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ అగ్రికల్చరల్‌ బయోటెక్నాలజీ, ఎంవీఎస్‌సీ యానిమల్‌ బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆల్‌ ఇండియా ప్రవేశ పరీక్ష గ్రాడ్యుయేట్‌ ఆప్టి ట్యూడ్‌ టెస్ట్‌ –బయోటెక్నాలజీ (జీఏటీ–బీ)– 2025 పరీక్షను నిర్వహిస్తుంది. ఈ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
Admission to Biotechnology courses through GAT-B 2025   NTA begins GAT B 2025 registration process   GAT-B 2025 exam for MSc and MTech Biotechnology admissions

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీటెక్, బీఈ, బీవీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
పరీక్ష విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. మొత్తం 240 మార్కులకు మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో ప్రశ్నాపత్రం ఉంటుంది. సెక్షన్‌–ఏలో 60 ప్రశ్నలు– 60 మార్కులు ఉంటాయి. ఇంటర్మీడియట్‌ స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్, బయాలజీ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. సెక్షన్‌–బిలో 100 ప్రశ్నలకు–180 మార్కులు..  60 ప్రశ్నలకు సమాధానాలు తప్పకుండా గుర్తించాలి. డిగ్రీ స్థాయిలో బేసిక్‌ బయాలజీ, లైఫ్‌సైన్సెస్, బయోటెక్నాలజీ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. సెక్షన్‌–ఏలో ప్రతి తప్పు సమాధా నానికి 0.5 మార్కుల నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంది. సెక్షన్‌–బిలో ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు.  పరీక్ష మాధ్యమం ఇంగ్లిష్‌. పరీక్ష సమయం మూడు గంటలు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా 
దరఖాస్తులకు చివరి తేది: 03.03.2025.
దరఖాస్తు సవరణ తేదీలు: 05.03.2025 నుంచి 06.03.2025 వరకు
పరీక్షతేది: 20.04.2025
వెబ్‌సైట్‌: https://dbt2025.ntaonline. in/ and  www.nta.ac.in 

>> Fresher Jobs: 10th Class అర్హతతో 100 ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి రెండు రోజులే ఆవకాశం!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 10 Feb 2025 06:13PM

Photo Stories