ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలు కోరుకొనే అభ్యర్థులు సంబంధిత ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ పరీక్ష (ఏఏటీ)కు అక్టోబర్ 15, 16 తేదీల్లో ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ పరీక్ష అక్టోబర్ 18న నిర్వహిస్తారు.
అక్టోబర్‌లో ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు
ఏఏటీ ఫలితాలను అక్టోబర్ 22న విడుదల చేస్తారు. ఐఐటీల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియ అక్టోబర్ 16 నుంచి ప్రారంభమవుతుంది. జేఈఈ మెయిన్ ప్రశ్నపత్రాల లీకేజీపై సీబీఐ దర్యాప్తు చేస్తుండడంతోపాటు ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన నేపథ్యంలో ఫలితాల ప్రకటన ఆలస్యమవుతూ వచ్చింది. జేఈఈ మెయిన్స్ లో మెరిట్ సాధించిన 2.50 లక్షల మంది అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్ డ్‌కు అర్హులు. సెప్టెంబర్ 12న అర్ధరాత్రి లేదా సెప్టెంబర్ 13న ఉదయానికి జేఈఈ మెయిన్ ఫలితాలు వెలువడే అవకాశముంది.