NID DAT 2022: ఈ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్...
- నిడ్ డాట్ 2022కు నోటిఫికేషన్ విడుదల
- బి.డిజైన్, ఎం.డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలు
- ఇంటర్‌తోనే డిజైన్ కెరీర్‌కు మార్గం
డిజైనింగ్ కోర్సులు అందించేందుకు అహ్మదాబాద్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యాసంస్థ.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(నిడ్). దీన్ని 1961లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వయం ప్రతిపత్తి సంస్థగా ప్రారంభించారు. అగ్రశ్రేణి డిజైన్ ఇన్‌స్టిట్యూట్‌ల్లో ఒకటిగా నిడ్‌కు గుర్తింపు ఉంది. దీనికి గాంధీనగర్, బెంగళూరుల్లో క్యాంపస్‌లు ఉన్నాయి. వీటితోపాటు నిడ్ ఆంధ్రప్రదేశ్, నిడ్ హర్యానా, నిడ్ మధ్యప్రదేశ్, నిడ్ అసోంలు అందించే కోర్సులకు కూడా డిజైన్ అప్టిట్యూడ్ టెస్ట్(డీఏటీ) స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తున్నారు. ఇటీవల బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.
బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (బి.డిజైన్)
బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సుల కాల వ్యవధి నాలుగేళ్లు. అహ్మదాబాద్ క్యాంపస్‌లో యానిమేషన్ ఫిల్మ్ డిజైన్, సిరామిక్ అండ్ గ్లాస్ డిజైన్, ఎగ్జిబిషన్ డిజైన్, ఫిల్మ్ అండ్ వీడియో కమ్యూనికేషన్, ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్ డిజైన్, గ్రాఫిక్ డిజైన్, ప్రొడక్ట్
డిజైన్, టెక్స్‌టైల్ డిజైన్ స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, హరియాణ, మ«ధ్యప్రదేశ్, అసోం నిడ్‌ల్లో ఇండస్ట్రియల్ డిజైన్, కమ్యూనికేషన్ డిజైన్, టెక్స్‌టైల్ అండ్ అపారెల్ డిజైన్ కోర్సులు అందిస్తున్నారు.
మాస్టర్స్ ఆఫ్ డిజైన్(ఎం.డిజైన్)
ఎం.డిజైన్ కోర్సు కాలవ్యవధి రెండున్నరేళ్లు. వీటిని నిడ్ అహ్మదాబాద్, బెంగళూరు, గాం«ధీనగర్ క్యాంపస్‌ల్లో అందిస్తున్నారు. బ్యాచిలర్ స్థాయిలో ఉన్న కోర్సులన్నీ పీజీలోనూ ఉన్నాయి. వీటితోపాటు అదనంగా అపరెల్ డిజైన్, రిటైల్ డిజైన్, రిటైల్
ఎక్స్‌పీరియన్స్ డిజైన్, డిజిటల్ గేమ్ డిజైన్, ఇన్ఫర్మేషన్ డిజైన్, ఇంటరాక్షన్ డిజైన్, లైఫ్ స్టైల్ యాక్సెసరీస్ డిజైన్, న్యూ మీడియా డిజైన్, ఫోటోగ్రఫీ డిజైన్, స్ట్రాటజిక్ డిజైన్ మేనేజ్‌మెంట్, టాయ్ అండ్ గేమ్ డిజైన్, ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ ఆటోమొబైల్
డిజైన్, యూనివర్సల్ డిజైన్ కోర్సులు కూడా అందిస్తున్నారు. ఒక్కో విభాగంలో 19 చొప్పున సీట్లు కేటాయించారు. సిరామిక్ అండ్ గ్లాస్ డిజైన్, టాయ్ అండ్ గేమ్ డిజైన్‌ల్లో మాత్రం 12 సీట్లు చొప్పున లభిస్తున్నాయి.
విద్యార్హతలు
బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (బి.డిజైన్)
- ఏదైనా గ్రూప్(సైన్స్/ఆర్ట్స్/కామర్స్/హుమానిటీస్)తో ఇంటర్/10+2 ఉత్తీర్ణులు నిడ్ డాట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. మే/జూన్ 2022 నాటి ఇంటర్/10+2 ఉత్తీర్ణులై ఉండాలి.
- వయసు: 20ఏళ్లలోపు ఉండాలి.ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు,దివ్యాంగులకు అయిదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
- సీట్లు: నిడ్ అహ్మదాబాద్‌లో 125 సీట్లు, నిడ్ ఆంధ్రప్రదేశ్–75 సీట్లు, నిడ్ హర్యానా–75 సీట్లు, నిడ్ మధ్యప్రదేశ్–75 సీట్ల, నిడ్ అసోంలో–75 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
మాస్టర్ ఆఫ్ డిజైన్(ఎం.డిజైన్)
- నిడ్ అహ్మదాబాద్‌తోపాటు గాంధీనగర్, బెంగళూరు క్యాంపస్‌ల్లో మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నారు.
- ఇంటర్ తర్వాత ఏదైనా స్పెషలైజేషన్‌లో నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ లేదా అనుబంధ కోర్సులను చదివిన వారు మాస్టర్ ఆఫ్ డిజైన్(ఎం.డిజైన్) కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఇంటర్ తర్వాత డిజైన్/ఫైన్ ఆర్ట్స్/అప్లయిడ్ ఆర్ట్/ఆర్కిటెక్చర్‌లో నాలుగేళ్ల డిప్లొమా కోర్సు ఉత్తీర్ణులు కూడా దరఖాస్తుకు అర్హులు.
- వయసు: జూలై 01,1992 తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగులకు అయిదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
నిడ్ డాట్ ఇలా
- బి.డిజైన్ అప్టిట్యూడ్ టెస్టులో ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షలు ఉంటాయి.
- ప్రిలిమ్స్ 100 మార్కులకు ఆఫ్‌లైన్(పెన్–పేపర్) విధానంలో నిర్వహిస్తారు. ఈ పరీక్షలో పార్ట్ 1 ఆబ్జెక్టివ్ తరహాలో 30 మార్కులకు; అలాగే పార్ట్2 సబ్జెక్టివ్ విధానంలో 70 మార్కులకు ఉంటాయి. పరీక్ష సమయం 3 గంటలు.
- ప్రిలిమ్స్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చే సి మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.
- మెయిన్ పరీక్ష కూడా 100 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం మూడు గంటలు.
- ప్రిలిమ్స్, మెయిన్‌లో సాధించిన మార్కులు, మెరిట్ ప్రాతిపదికన తుది ఎంపిక చేస్తారు.
ఎం.డిజైన్ పరీక్ష
- మాస్టర్ ఆఫ్ డిజైన్ అభ్యర్థులకు కామన్ డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌ను నిర్వహిస్తారు. ఈ పరీక్ష కూడా పెన్–పేపర్ విధానంలో ఉంటుంది. ఇందులో రెండు రకాల పరీక్షలు ఉంటాయి. ఒకటి సీడాట్ పరీక్ష కాగా మరొకటి డిసిప్లైన్–స్పెసిఫిక్ టెస్ట్. పరీక్ష సమయం రెండు గంటలు. ఇందులో 30 శాతం ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, 70 శాతం సబ్జెక్టివ్ ప్రశ్నలను అడుగుతారు.
- ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి మెయిన్ పరీక్ష ఉంటుంది. మెయిన్‌లో పర్సనల్ ఇంటర్వ్యూ, స్టూడియో టెస్ట్‌ను నిర్వహిస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్‌లో సాధించిన మార్కులను పరిగణలోకి తీసుకొని.. ఆయా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
అవకాశాలు
నిడ్‌లో బ్యాచిలర్, మాస్టర్స్ కోర్సులను పూర్తిచేసిన అభ్యర్థులకు క్యాంçపస్ ప్లేస్‌మెంట్స్‌లోనే మంచి అవకాశాలు లభిస్తున్నాయి. నైపుణ్యాలున్న వారికి విప్రో, మైక్రోసాఫ్ట్, మైండ్, వర్ల్‌పూల్, మారుతీ సుజుకీ తదితర సంస్థలు ఉద్యోగ అవకాశాలు
అందిస్తున్నాయి.
ముఖ్యమైన సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేదీ: 30.11.2021
- అడ్మిట్ కార్డ్: 23 డిసెంబర్ 2021
- ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: 02.01.2022
- మెయిన్ పరీక్ష తేదీలు: తర్వాత ప్రకటిస్తారు
వెబ్‌సైట్: https://admissions.nid.edu
చదవండి: