Skip to main content

JOSAA 2021: ఐఐటీలు, నిట్‌లు, జీఎఫ్‌ఐటీల్లో ప్రవేశం పొందాలంటే.. ఇది తప్పనిసరి

ఐఐటీలు, నిట్‌లు, ట్రిపుల్‌ ఐటీలతోపాటు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో నడిచే ఇతర విద్యాసంస్థ(జీఎఫ్‌టీఐ)ల్లో సీట్ల భర్తీకి నిర్వహించే జోసా(జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ)– 2021 షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల(అక్టోబర్‌) 15న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల కానున్నాయి. ఆ మరుసటి రోజు (అక్టోబర్‌ 16) నుంచే జోసా కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఐఐటీల్లో సీటు కోరుకునే విద్యార్థులు..అడ్వాన్స్‌డ్‌ ర్యాంక్‌ ఆధారంగా జోసా కౌన్సెలింగ్‌లో పాల్గొనాలి. అందులో తమ ప్రాథమ్యాలు(ఇన్‌స్టిట్యూట్, బ్రాంచ్‌) పేర్కొంటూ.. ఆప్షన్లను ఎంచుకోవాలి! వాటి ఆధారంగానే సీటు ఖరారు చేస్తారు. ఈ నేపథ్యంలో.. ఐఐటీలు, అందిస్తున్న కోర్సులు–సీట్లు, జోసా కౌన్సెలింగ్‌ ప్రక్రియ తదితర అంశాలపై ప్రత్యేక కథనం...
JoSAA Counselling 2021 schedule released
JoSAA Counselling 2021 schedule released
  • జోసా 2021 ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియకు షెడ్యూల్‌ విడుదల
  • ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న జోసా ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ 
  • ఐఐటీలు,నిట్‌లు,ట్రిపుల్‌ ఐటీలు సహా మొత్తం 114 ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశాలు
  • జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2021 ఉత్తీర్ణులు ఐఐటీల్లో అడ్మిషన్‌కు అర్హులు
  • జేఈఈ మెయిన్‌ ర్యాంకుతో నిట్‌లు, ట్రిపుల్‌ ఐటీలు, జీఎఫ్‌టీఐల్లో సీట్ల భర్తీ
  • అడ్వాన్స్‌డ్‌కు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 30 వేల మంది హాజరు!
  • ఈ నెల 15వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల వెల్లడి

జేఈఈ అడ్వాన్స్‌డ్‌.. ఐఐటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే పరీక్ష! 2021విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నెల మూడో తేదీన పరీక్ష జరిగింది. జాతీయ స్థాయిలో లక్షన్నర మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 30 వేల మంది హాజరైనట్లు అంచనా! ఈ పరీక్ష ఫలితాలు.. ఈ నెల 15వ తేదీన వెల్లడి కానున్నాయి. ఐఐటీల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ జోసా ఈ నెల(అక్టోబర్‌)16న ప్రారంభం కానుంది. 

23 ఐఐటీలు.. 16 వేలకు పైగా సీట్లు

  • ప్రస్తుతం జాతీయ స్థాయిలో మొత్తం 23 ఐఐటీలు.. అడ్వాన్స్‌డ్‌ 2021 ర్యాంకు ఆధారంగా ప్రవేశం కల్పిస్తున్నాయి. బీటెక్, ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌+ఎంటెక్‌ తదితర ప్రోగ్రామ్‌లలో 16వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి.
  •  జేఈఈ మెయిన్‌ 2021 బీఈ/బీటెక్, జేఈఈ మెయిన్‌ 2021 బీఆర్క్, జేఈఈ మెయిన్‌ 2021 బీ ప్లానింగ్‌ ఉత్తీర్ణులు.. నిట్‌లు, ట్రిపుల్‌ ఐటీలు, జీఎఫ్‌టీఐ (గవర్నమెంట్‌ ఫండెడ్‌ టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌)ల్లో ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్‌ ప్రక్రియలో పాల్గొనేందుకు అర్హులు. 
  •  2021–22 విద్యాసంవత్సరంలో జేఈఈ మెయిన్‌తో 31 నిట్‌లు, ఐఐఎస్‌ఈటీ షిబ్‌పూర్, 26 ట్రిపుల్‌ ఐటీలు, 29 జీఎఫ్‌ఐటీల్లో ప్రవేశాలకు  జోసా నిర్వహిస్తున్నారు. 

అమ్మాయిలకు 20 శాతం సీట్లు

ఐఐటీల్లో మహిళా విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో.. 2017లో జండర్‌æ బ్యాలెన్స్‌(లింగ సమానత్వం)విధానాన్ని తెచ్చారు. ఈ ఏడాది కూడా మహిళా విద్యార్థులకు 20 శాతం సీట్ల కేటాయింపు విధానాన్ని కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. నిట్‌లు, ఐఐఎస్‌ఈటీ షిబ్‌పూర్, ట్రిపుల్‌ఐటీల్లోనూ 2021–22 విద్యాసంవత్సరంలో అండర్‌గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో కనీసం 20 శాతం మంది మహిళా విద్యార్థులు ఉండాలని నిర్దేశించారు. 

ఆరు రౌండ్లలో.. జోసా

ఐఐటీలు, నిట్‌లు, ట్రిపుల్‌ ఐటీలు, జీఎఫ్‌ఐటీల్లో ప్రవేశం పొందాలంటే.. జోసా 2021కు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం తప్పనిసరి. ఈ ఉమ్మడి కౌన్సెలింగ్‌.. ఆన్‌లైన్‌ విధానంలో మొత్తం ఆరు రౌండ్లలో నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్, జేఈఈ మెయిన్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులందరూ.. ఈ ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. 

ఆన్‌లైన్‌లో సీట్ల భర్తీ

  • ఐఐటీల్లో ప్రవేశాలకు అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు మాత్రమే అర్హులు. వీరు జోసా వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకొని.. తమ వివరాలు పొందుపరచాలి. తర్వాత తమ ఆసక్తి మేరకు కోర్సు, ఇన్‌స్టిట్యూట్‌ ప్రాథమ్యాలను ఆన్‌లైన్‌లోనే పేర్కొనాల్సి ఉంటుంది. ఈ ప్రాథమ్యాలను పేర్కొనడాన్నే ఛాయిస్‌ ఫిల్లింగ్‌ అని పిలుస్తారు.
  • ఆన్‌లైన్‌లో ప్రాథమ్యాలను పేర్కొన్న తర్వాత.. విద్యార్థులు తాము ఎంచుకున్న కోర్సు, ఇన్‌స్టిట్యూట్‌.. అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా సీటు కేటాయింపు జరుగుతుంది. 
  • అభ్యర్థులు మొత్తం 23 ఐఐటీల్లో తమకు ఆసక్తి ఉన్న కోర్సు, ఇన్‌స్టిట్యూట్‌ ప్రాథమ్యాలను వరుస క్రమంలో పేర్కొనాల్సి ఉంటుంది. ఈ ప్రాథమ్యాల ప్రకారం–అభ్యర్థులు పొందిన మార్కులు/ర్యాంకు,అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా సీటు ఖరారు చేస్తారు.

కౌన్సెలింగ్‌ ప్రక్రియ

  • జోసా కౌన్సెలింగ్‌లో అభ్యర్థులు మొదటి రౌండ్‌ నుంచి ఆరో రౌండ్‌ వరకు పాల్గొనే అవకాశం ఉంది. మొదటి రౌండ్‌లో లభించిన సీటు, ఇన్‌స్టిట్యూట్‌పై ఆసక్తి లేకపోతే.. తదుపరి రౌండ్ల కౌన్సెలింగ్‌లో పాల్గొనొచ్చు. అందుకోసం విద్యార్థులు ఫ్లోట్, స్లైడ్, ఫ్రీజ్‌ ఆఫ్షన్‌లు ఉపయోగించుకోవాలి. 
  • ఫ్రీజ్‌: మొదటి రౌండ్‌లోనే తమకు సీటు లభించిన ఇన్‌స్టిట్యూట్, ప్రోగ్రామ్‌తో సంతృప్తి చెందితే.. ఫ్రీజ్‌ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. దీంతో తదుపరి రౌండ్లకు విద్యార్థుల ఛాయిస్‌లను పరిగణనలోకి తీసుకోరు. తొలిదశలో సీటు లభించిన ఇన్‌స్టిట్యూట్‌లోనే జాయినింగ్‌ రిపోర్ట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. 
  • స్లైడ్‌: మొదటి రౌండ్‌లోనే నిర్దిష్టంగా ఒక ఇన్‌స్టిట్యూట్‌లో ఒక బ్రాంచ్‌లో సీటు వచ్చిన విద్యార్థి.. అదే ఇన్‌స్టిట్యూట్‌లో మరో బ్రాంచ్‌లో సీటు కోరుకుంటే.. స్లైడింగ్‌ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. వీరికి తదుపరి రౌండ్‌లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. 
  • ఫ్లోట్‌: మొదటి రౌండ్‌లో వచ్చిన సీటు కంటే.. మరింత మంచి ఇన్‌స్టిట్యూట్‌లో సీటు కోరుకుంటే..ఫ్లోటింగ్‌ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఫలితంగా ఆ విద్యార్థి ప్రాథమ్యాలను తదుపరి రౌండ్లకు పరిగణనలోకి తీసుకుంటారు. 
  • ఇలా ఫ్లోటింగ్, స్లైడింగ్‌ ఆప్షన్‌లు పేర్కొనడం వల్ల అభ్యర్థులకు చివరగా కేటాయించిన సీట్లే ఖరారవుతాయి. తొలి రౌండ్‌లో లేదా ఆ తర్వాత రౌండ్లలో వచ్చిన సీట్లు రద్దవుతాయి.

మాక్‌ సీట్‌ అలొకేషన్‌

జోసా వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకొని ఆన్‌లైన్‌లో నిర్దేశిత గడువు తేదీలోగా ఛాయిస్‌ ఫిల్లింగ్‌ పూర్తి చేసిన విద్యార్థులకు.. ముందుగా వారిచ్చిన ప్రాథమ్యాల ఆధారంగా మాక్‌ సీట్‌ అలొకేషన్‌(నమూనా సీటు కేటాయింపు) వివరాలను అందుబాటులో ఉంచుతారు. అంటే.. అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా సీటు వచ్చే అవకాశం ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లు, బ్రాంచ్‌ల వివరాలు తెలుస్తాయి. మాక్‌ సీట్‌ అలొకేషన్‌ జాబితాను బేరీజు వేసుకున్న విద్యార్థులు..తమ ర్యాంకుకు ఇంకా మంచి ఇన్‌స్టిట్యూట్‌లో సీటు వస్తుందనుకుంటే.. తమ ఆప్షన్లను మార్చుకునే వెసులుబాటు కూడా కల్పిస్తారు. ఇలా.. ఈ ఏడాది రెండుసార్లు మాక్‌ సీట్‌ అలొకేషన్‌ జాబితాను అందుబాటులో ఉంచనున్నారు. 

రిపోర్టింగ్‌ తప్పనిసరి

మొత్తం ఆరు రౌండ్లలో జరిగే సీట్‌ అలొకేషన్‌ ప్రక్రియలో భాగంగా.. ప్రతి రౌండ్‌ సీట్‌ అలొకేషన్‌ తర్వాత ఆ రౌండ్‌కు నిర్దేశించిన నిర్దిష్ట గడువు తేదీలోగా అభ్యర్థులు తమకు సీటు లభించిన ఇన్‌స్టిట్యూట్‌కు సంబంధించి పేర్కొన్న రిపోర్టింగ్‌ సెంటర్‌లో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా రిపోర్ట్‌ చేయకపోతే.. సీటు రద్దవుతుంది. 

ఆమోదం లేదా ఉపసంహరణ

జోసా ఆన్‌లైన్‌ ఛాయిస్‌ ఫిల్లింగ్‌ ప్రాథమ్యాల ప్రకారం.. సీట్లు లభించిన విద్యార్థులు.. ప్రతి రౌండ్‌ తర్వాత సీటు యాక్సప్టెన్స్‌ లేదా ఉపసంహరణ విషయాన్ని స్పష్టం చేయాలి. మొత్తం ఆరు రౌండ్ల కౌన్సెలింగ్‌లో అయిదో రౌండ్‌ వరకే ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. చివరి రౌండ్‌ (ఆరో రౌండ్‌)లో ఈ ఉపసంహరణ అవకాశం ఉండదు. 

ఫీజు చెల్లింపు

జోసా కౌన్సెలింగ్‌ విధానంలో సీటు పొందిన విద్యార్థులు తప్పనిసరిగా సీట్‌ యాక్సప్టెన్స్‌ ఫీజును చెల్లించాలి. దీన్ని కూడా ఆన్‌లైన్‌ విధానంలో నెట్‌ బ్యాంకింగ్‌ లేదా డెబిట్‌ కార్డ్‌ లేదా ఎస్‌బీఐ ఈ–చలాన్‌ రూపంలో మాత్రమే చెల్లించాలి.

  • ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో సీటు పొందిన జనరల్‌ కేటగిరీ విద్యార్థులు రూ.35 వేలు; ఎస్‌సీ, ఎస్‌టీ, పీడబ్లు్యడీ విద్యార్థులు రూ.15 వేలు చొప్పున యాక్సప్టెన్స్‌ ఫీజు చెల్లించాలి.

జోసా–2021 ముఖ్య తేదీలు

అక్టోబర్‌ 16: జోసా వెబ్‌సైట్‌లో అభ్యర్థుల రిజిస్ట్రేషన్, ఛాయిస్‌ ఫిల్లింగ్‌ ప్రక్రియ ప్రారంభం. 
అక్టోబర్‌ 22: మాక్‌ సీట్‌ అలొకేషన్‌(సీట్ల కేటాయింపు నమూనా జాబితా)–1 విడుదల.
అక్టోబర్‌–24: మాక్‌ సీట్‌ అలొకేషన్‌(సీట్ల కేటాయింపు నమూనా జాబితా)–2 విడుదల. 
అక్టోబర్‌ 25: ఛాయిస్‌ ఫిల్లింగ్, క్యాండిడేట్‌ రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ. 
అక్టోబర్‌ 26: నమూనా సీట్ల కేటాయింపు జాబితా ఆధారంగా.. తాము పేర్కొన్న ప్రాథమ్యాలను సరిచూసుకోవడం, మార్పులు/చేర్పులు చేసుకోవడం. 
అక్టోబర్‌ 27: మొదటి రౌండ్‌ సీట్ల కేటాయింపు.
అక్టోబర్‌ 27–30: మొదటి రౌండ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిపోర్టింగ్‌ చేయాలి. అదే విధంగా యాక్సప్టెన్స్‌ ఫీజును చెల్లించాలి. నిర్దేశిత డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేయాలి. 
నవంబర్‌ 1: రెండో రౌండ్‌ సీట్ల కేటాయింపు
నవంబర్‌ 2–3 తేదీలు: రెండో రౌండ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్‌ రిపోర్టింగ్, ఫీజు పేమెంట్, డాక్యుమెంట్ల అప్‌లోడ్‌. 
నవంబర్‌ 2–5: రెండో రౌండ్‌లో పొందిన సీటు విషయంలో ఉపసంహరణ లేదా కౌన్సెలింగ్‌ ప్రక్రియ నుంచి విరమించుకునే అవకాశం.
నవంబర్‌ 6: మూడో రౌండ్‌ సీట్ల కేటాయింపు
నవంబర్‌ 7–8: మూడో రౌండ్‌ సీట్ల కేటాయింపునకు సంబంధించి ఆన్‌లైన్‌ రిపోర్టింగ్, ఫీజు పేమెంట్, డాక్యుమెంట్‌ అప్‌లోడ్‌.
నవంబర్‌ 7–9: మూడో రౌండ్‌ తర్వాత సీటు ఉపసంహరణ లేదా కౌన్సెలింగ్‌ ప్రక్రియ నుంచి ఉపసంహరణ
నవంబర్‌ 10: నాలుగో రౌండ్‌ సీట్ల కేటాయింపు
నవంబర్‌ 11–12: నాలుగో రౌండ్‌కు సంబంధించి ఆన్‌లైన్‌ రిపోర్టింగ్, ఫీజు పేమెంట్, డాక్యుమెంట్‌ అప్‌లోడ్‌.
నవంబర్‌ 11–13: నాలుగో రౌండ్‌ తర్వాత సీటు ఉపసంహరణ లేదా కౌన్సెలింగ్‌ నుంచి ఉపసంహరణ అవకాశం.
నవంబర్‌ 14: అయిదో రౌండ్‌ సీట్ల కేటాయింపు
 నవంబర్‌ 15–16: అయిదో రౌండ్‌కు సంబంధించి ఆన్‌లైన్‌ రిపోర్టింగ్, డాక్యుమెంట్‌ అప్‌లోడ్, ఫీజు పేమెంట్‌.
 నవంబర్‌ 15–17: అయిదో రౌండ్‌ తర్వాత సీటు విత్‌డ్రా లేదా కౌన్సెలింగ్‌ నుంచి ఉపసంహరణ అవకాశం.
 నవంబర్‌ 17: అయిదో రౌండ్‌కు సంబంధించి సీటు నిర్ధారణపై నిర్ణయం వెల్లడి
 నవంబర్‌ 18: ఆరో రౌండ్‌ (చివరి రౌండ్‌) సీట్ల కేటాయింపు
 నవంబర్‌ 19: ఆరో రౌండ్‌లో పొందిన సీటుకు సంబంధించి ఆన్‌లైన్‌ రిపోర్టింగ్, ఫీజు చెల్లింపు. 

వెబ్‌సైట్‌: https://josaa.nic.in

ఐఐటీలు అందించే బ్రాంచ్‌లు

  •  అడ్వాన్స్‌డ్‌ ర్యాంకర్లు ఐఐటీల్లో మొదటగా సీఎస్‌ఈ బ్రాంచ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్‌ నిలుస్తున్నాయి. 
  •  ఐఐటీ–హైదరాబాద్‌.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. ఇందులో మొత్తం 27 సీట్లు ఉన్నాయి.
  •  ఐఐటీ జో«ద్‌పూర్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డేటా సైన్స్‌ పేరుతో మొత్తం 50 సీట్లతో బీటెక్‌ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది.
  •  ఐఐటీ–భిలాయ్‌ డేటాసైన్స్‌ అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పేరుతో 20 సీట్లతో కోర్సును అందిస్తోంది.
  •  ఈ ఏడాది ఐఐటీ–చెన్నై, ఐఐటీ–ముంబైలలోనూ ఈ ప్రోగ్రామ్‌లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఐఐటీ క్యాంపస్‌లు– సీట్ల వివరాలు

 భువనేశ్వర్‌–475, ముంబై–1360,మండి–329, ఢిల్లీ–1209,ఇండోర్‌–360, ఖరగ్‌పూర్‌–1902, హైదరాబాద్‌–425, జోథ్‌పూర్‌–451, కాన్పూర్‌–1182, చెన్నై–1133,గాంధీనగర్‌–250,పాట్నా –427, రూర్కీ–1353, ధన్‌బాద్‌–1125, రోపార్‌–370, బీహెచ్‌యూ–1589, గువహటి–902, భిలాయ్‌–183, గోవా–157, పాలక్కాడ్‌–188, తిరుపతి–237, జమ్ము–237, ధర్వాడ్‌–170.

ఆప్షన్ల ఎంపికలో అప్రమత్తత

జోసా ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌లో ఇన్‌స్టిట్యూట్, బ్రాంచ్‌లను ఆప్షన్లుగా పేర్కొనే విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా వ్యవహరించాలి. మాక్‌ సీట్‌ అలొకేషన్‌ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. కాబట్టి విద్యార్థులు ఈ మాక్‌ సీట్‌ అలొకేషన్‌లో తమకు లభించే బ్రాంచ్, ఇన్‌స్టిట్యూట్‌లను క్షుణ్నంగా పరిశీలించి.. ఆప్షన్లలో మార్పులు, చేర్పుల విషయంలో నిర్ణయం తీసుకోవాలి. అన్ని ఐఐటీల్లోనూ అత్యంత నాణ్యమైన బోధన అందుబాటులో ఉంది.
– ప్రొ‘‘ ఆర్‌.వి.రాజ్‌కుమార్, డైరెక్టర్, ఐఐటీ–భువనేశ్వర్‌.

చ‌ద‌వండి: TIFR GS 2022: ఇందులో ప్రతిభ చూపిన వారికి.. ప్రతి నెల రూ.35 వేల ఆర్థిక ప్రోత్సాహం

Published date : 14 Oct 2021 03:37PM

Photo Stories